Madhuranagarilo December 1 2023 Episode: అదేమీ లేదు రాదా నువ్వేం టెన్షన్ పడకు మీ ఇంటికి వద్దామని బయలుదేరాక నాన్న ఫోన్ చేశాడు, తనకు టాబ్లెట్లు అయిపోయాయి అంట వెంటనే తీసుకు రమ్మని చెప్పాడు అందుకే టాబ్లెట్లు తీసుకొని కొన్ని ఇంట్లోకి సామాన్య తీసుకొని ఇంటికి వెళ్లి పోతున్నాను మీ ఇంటికి ఇంకెప్పుడైనా వస్తానులే రాదా అనిరుక్మిణి అంటుంది. అవునా అక్క అయితే ఇప్పుడే మా ఆయన కూడా ఇంటికి వచ్చాడు ఆయన పనులు చూసుకోవాలి ఉంటాను అని రాధా ఫోన్ కట్ చేస్తుంది. కట్ చేస్తే, దాక్షాయని ఒక రేoడు వoదలు ఉంటే ఇవ్వవా ఒక పెగ్గు తాగి టెన్షన్స్ అన్ని మర్చిపోతాను అని చలపతి అంటాడు. నా దగ్గర రేoడు వoదలు ఉంటే నిన్ను ఎనిమిది వందలు అడుక్కొని చీర కొనుక్కునే దాన్ని కదా అని దాక్షాయిని అంటుంది.
ఇంతలో బజార్లోకి కూరగాయల బండి వస్తుంది. కూరగాయలు తీసుకోవడానికి రాదా వెళ్తూ ఉండగా చలపతి పిలిచి నువ్వు ఎందుకమ్మా కూరగాయల కోసం వెళ్లడం నేను తెస్తాను ఇవ్వు అంటూ డబ్బులు తీసుకుని చలపతి వెళ్తాడు. కూరగాయల దగ్గరకి వెళ్లి ఈ కూరగాయలన్నీ పుచ్చిపోయాయి అని బండ్లో ఉన్న కూరగాయలన్నీ కింద పడేస్తాడు చలపతి. సార్ మీకు నచ్చకపోతే తీసుకోకండి అని కూరగాయలు అమ్మే అతను అంటాడు. పుచ్చిపోయిన కూరగాయలన్ని తెచ్చి మా వీధిలో అమ్ముతావా నిన్ను ఇక్కడ అమ్మని ఇవ్వను అని చలపతి అంటాడు. పొద్దున్నే బలే బేరం దొరికింది తప్పుకోవయ్యా అంటూ కూరగాయల అతను బండి తోసుకుంటూ వెళ్ళిపోతాడు. చలపతి కింద ఉన్న కూరగాయల నీ సంచిలో వేసుకొని రాధకి ఇస్తాడు. ఈ రెండు వందల తోటి ఒక పెగ్గు తాగి వద్దాము అని చలపతి అనుకుంటాడు.రాధా కూరగాయలు సద్దుతూ ఉంటే మధుర వచ్చి ఏంటి రాధా మీ అక్క ఇంకా రాలేదు అని అంటుంది.
మా నాన్న ఫోన్ చేశాడంట అత్తయ్య అందుకే అక్క ఇంటికి వెళ్ళింది అంట అని రాధా చెప్తుంది. అవునా అని మధుర వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, రుక్మిణి శ్యామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి రుక్మిణి నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా అని మురళి అంటాడు. నేను జాబ్ చేస్తున్నది డబ్బు కోసం కాదు నాన్న మా ఆయనని రోజు చూసుకోవచ్చని చేస్తున్నాను అని రుక్మిణి అంటుంది. రేపటి నుంచి మా ఆయనకి నేనే వంట చేసుకుని తీసుకువెళ్తాను అది కూడా కొద్దిరోజులే తర్వాత కుదరదు అని రుక్మిణిఅంటుంది.
ఎందుకు కుదరదు అని నాగమణి అంటుంది. రోజు ఇంత దూరం నుంచి వచ్చి పోలేనని రాధ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్పింది నిజంగా రాధ వాళ్ళ అత్తయ్య చాలా మంచిది కదా అమ్మ అని అంటుంది రుక్మిణి. నువ్వు రాధ వాళ్ళ ఇంట్లో ఉండడం బాగోలేదమ్మా అని మురళి అంటాడు. ఎందుకు ఉండకూడదు నాన్న వాళ్లే ఉండమంటున్నారు కదా అని రుక్మిణి అంటుంది.
నువ్వు అక్కడ ఉంటే రోజు టెన్షన్ తో చావాలి అని మురళి అంటాడు. నేనక్కడ ఉంటే టెన్షన్ తో మీరెందుకు చేస్తారు నాన్న అని రుక్మిణి అంటుంది. అదేనమ్మా నువ్వు మీ చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ బంధువులు ఏమైనా అంటే అప్పుడు మాట పడ్డామని టెన్షన్ తో బాధపడాలి కదా అందుకే అలా అన్నాడు అని నాగమణి అంటుంది.నువ్వు చెప్పింది కూడా కరెక్టే నాన్న నేను రాధ వాళ్ళ ఇంట్లో ఉండనులే అని రుక్మిణి అంటుంది. నాగమణి మురళి అమ్మయ్య కాస్తంత ఊపిరి పీల్చుకున్నంత పనైంది అని అనుకుంటారు. కట్ చేస్తే, శ్యామ్ రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండీ టెన్షన్ గా ఉన్నారు అని రాదా అడుగుతుంది.
ఏమీ లేదు రాధా ఆఫీసులో కొంచెం టెన్షన్ అని అంటాడు శ్యామ్. ఆఫీస్ టెన్షన్స్ అన్ని మీరు ఇంటిదాకా మూసుకు రాకుండా ఉండాలి అంటే నేను ఆఫీస్ కి రావడమే సొల్యూషన్ అని రాదా అంటుంది. నువ్వు ఆఫీసుకు వచ్చి పని చేయడం నాకు ఇష్టం లేదు రాదా ఇంట్లో కూర్చొని హాయిగా ఉండు నీకెందుకు ఆ టెన్షన్స్ అన్ని అని శ్యామ్ అంటాడు. నేను కూడా ఆఫీసు నడిపిన దానే నండి నేను మీ పక్కనే ఉంటే ఆఫీసులో టెన్షన్స్ అన్ని అప్పుడే మాట్లాడుకొని సెటిల్ చేసుకోవచ్చు ఇంటిదాకా మూసుకు రావాల్సిన అవసరం ఉండదు అని రాదా అంటుంది. ఓకే రాధా రేపటి నుంచి ఆఫీస్ టెన్షన్ ఏవి ఇంటిదాకా తీసుకురాను కానీ నువ్వు ఆఫీసుకు రావద్దు రాదా అని శ్యామ్ అంటాడు.మీరు ఆఫీస్ టెన్షన్స్ అన్ని ఇంటికి తీసుకు వస్తే నేను ఆఫీసుకు రావాల్సి ఉంటుంది అని రాదా అంటుంది. అలాగే రాదా అని అంటాడు శ్యామ్.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!