NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo December 25 2023 Episode 244: రుక్మిణి ని స్కూల్ దగ్గరికి రమ్మన్నా రాధా కి నిజం తెలుస్తుందా లేదా?.

Madhuranagarilo Today Episode December 25 2023 Episode 244 Highlights

Madhuranagarilo December 25 2023 Episode 244: నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చింది నేను కొత్త బట్టలు కూడా కొనియ్యలేని పరిస్థితి నాది అని ధనంజయ్ బాధపడతాడు. ఇంతలో పండు వస్తాడు. ఏంట్రా అప్పుడే రెడీ అయిపోయావు నేను రెడీ చేయకుండానే అని ధనంజయ్ అంటాడు. రోజురోజుకీ పెద్దగా అవుతున్నాను కదా తాతయ్య అందుకే నేనే రెడీ అయ్యాను అని పండు అంటాడు. అవున్రా చాలా పెద్దోడివి అయిపోయావు అని ధనంజయ్ నవ్వుతాడు. పండు రెడీ అయిపోయావా మన0 స్కూల్ కి వెళ్దాం అని రాదా పండుని తీసుకొని బయలుదేరుతుంది. కట్ చేస్తే, పెద్దమ్మ నువ్వెప్పుడొచ్చావ్ నా కోసమేమైనా చాక్లెట్ లాంటివి తెస్తే ఇవ్వు నేను స్కూల్ లోకి వెళ్ళిపోతాను టైం అవుతుంది అని పండు అంటాడు. చాక్లెట్ తెచ్చానని నీకు ఎలా తెలుసు అని రుక్మిణి అంటుంది. పెద్దమ్మ తెలిసేదేముంది కొత్తగా పిల్లల కాడికి వచ్చినప్పుడు చాక్లెట్ తీసుకొస్తారు కదా అందుకనే నేను అలా అన్నాను అని పండు చాక్లెట్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంతలో రాదా అక్కడికి వస్తుంది.

Madhuranagarilo Today Episode December 25 2023 Episode 244 Highlights
Madhuranagarilo Today Episode December 25 2023 Episode 244 Highlights

రాధ వంక కోపంగా చూస్తుంది రుక్మిణి. ఏంటక్కా నా వంక అలా చూస్తున్నావ్ అని రాధా అంటుంది. ఏమీ లేదు రాదా నువ్వేంటి కొత్తగా గ్రీన్ కలర్ సారీ కట్టుకొని వచ్చావు అని రుక్మిణి  అంటుంది. ఎందుకక్కా ఈ గ్రీన్ కలర్ అంటే నీకు ఇష్టమే కదా ఎందుకు అలా చిరాకు పడుతున్నావ్ అని రాదా అడుగుతుంది. ఒకప్పుడు ఇష్టముండేది రాదా కానీ ఇప్పుడు నాకు ఇష్టం లేదు ఈ చీర వల్లే నేను మీ బావగారు విడిపోయాము అని రుక్మిణి చెప్తుంది. గ్రీన్ కలర్ వల్ల మీరిద్దరు విడిపోవడం ఏంటక్కా అని రాదా అడుగుతుంది. అవును రాదా ఒకరోజు పార్టీకి అందరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకుని రావాలని కంపెనీ రూల్స్ పెట్టారంట అందుకని మీ బావగారు ఒక రెడ్ కలర్ డ్రెస్సు కొని నాకు పంపించారు ఆ విషయం నాకు తెలవక నేను గ్రీన్ కలర్ శారీ కట్టుకొని వెళ్లాను అక్కడ మీ బావగారు నన్ను చూసి షాక్ అయ్యి ఏంటి రెడ్ కలర్ ఏస్కు రమ్మంటే గ్రీన్ కలర్ ఏసుకు వచ్చావు అని ఇంటికి వచ్చాక నన్ను తిట్టాడు నాకు కొంచెం కోపం ఎక్కువ కదా అందుకని నేను కోపంతో ఆయనతో గొడవ పడ్డాను అలా మా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయి మేము విడిపోయాము అని రుక్మిణి చెప్తుంది.

Madhuranagarilo Today Episode December 25 2023 Episode 244 Highlights
Madhuranagarilo Today Episode December 25 2023 Episode 244 Highlights

అంటే శ్యామ్ సారి చెప్పింది అక్క చెప్పింది నిజమే అన్నమాట వీళ్లిద్దరూ అపార్థం వల్ల విడిపోయారు కానీ వీళ్ళ మధ్య పెద్ద సమస్యలేమీ లేవు అని రాదా అనుకుంటుంది. కానీ రాధా ఇప్పుడు నేను మా ఆయన గురించి అర్థం చేసుకున్నాను ఆయన కూడా నన్ను అర్థం చేసుకున్నారు ఇప్పుడు మా మధ్య  గొడవలు రావు  కలిసి పోతాము అని రుక్మిణి అంటుంది. అది సరే రాధ మా గొడవలు ఎప్పుడు ఉండేవే కదా కానీ నన్ను ఎందుకు స్కూల్ దగ్గరికి రమ్మన్నావు చెప్పు అని రుక్మిణి అంటుంది. ఏమీ లేదు అక్క బావను నాకు పరిచయం చేస్తానన్నావు కదా తీసుకురాలేదు ఎందుకు అని అడుగుదామని నేను రమ్మన్నాను అని రాదా అంటుంది. సర్లే రాధా ఇప్పుడు కాదు కానీ ఇంకెప్పుడైనా పరిచయం చేస్తాను అని రుక్మిణి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, గుడ్ మార్నింగ్ మేడం నేను సార్ పిఏని అని అతను పరిచయం చేసుకుంటాడు. నీ ప్లేస్ లో ఇంతకుముందు చక్రం అని అతను ఉండేవాడు అతను చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు అని ఊడబీకించి నిన్ను అపాయింట్ చేశాను నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడావనుకో నిన్ను కూడా పీకే గలను జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో అని రుక్మిణి అంటుంది. అర్థమైంది మేడం మీరు వెళ్ళండి అని అతను వెళ్ళిపోతాడు.

Madhuranagarilo Today Episode December 25 2023 Episode 244 Highlights
Madhuranagarilo Today Episode December 25 2023 Episode 244 Highlights

ఇంతలో రుక్మిణి శ్యామ్ క్యాబిన్లోకి వెళ్లి ఏంటి సార్ ఏదో ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఏమీ లేదు మన బిడ్డ గురించి అడిగాను కదా ఎప్పుడు చూపిస్తావు అని శ్యామ్ అంటాడు. ఇప్పుడు ఆ విషయం మీద గొడవ నాకు ఇష్టం లేదు ఈ ఫైల్ చూడండి అని రుక్మిణి వెళ్ళిపోతుంది.కట్ చేస్తే, ధనంజయ్ కొత్త బట్టలు తెచ్చి సిరికి ఇస్తాడు. దాక్షాయని మీ అన్నయ్య సిరికే మోస్తున్నాడు రారా చూద్దామని చలపతి అంటాడు. ఇప్పుడు నాకు కొత్త బట్టలు తెచ్చారు ఏం పండగలు లేవు కదా అంకుల్ అని అంటుంది సిరి.ఏంటమ్మా ఏమైనా పండగలు ఉంటేనే నీకు బట్టలు తీసుకురావాలా తండ్రి లాంటి వాడిని నీకు తీసుకు రాకూడదా అని ధనంజయ్ అంటాడు.  చూడు దాక్షాయిని మీ అన్నయ్య తండ్రి లాంటి వాడిని అంటున్నాడు తండ్రి నేమో ఇది చూడాల్సింది మనం కాదే మీ వదిన చూసి అసూయ పడాలి రా అని మధుర దగ్గరికి వెళ్లి మధుర అని పిలుసుకొచ్చి చూపెడతారు.అది చూసిన మధుర సిరి దగ్గరికి వెళ్లిఏంటమ్మా తండ్రి లాంటి అంకుల్ బట్టలు తెచ్చి ఇస్తే తీసుకొను అంటున్నావ్ తీసుకో మీ అంకుల్ నన్ను కూడా బట్టలు తీసుకోవడానికి రమ్మన్నారు కానీ నేనే వేలలేదు మీ అంకుల్ సెలక్షన్ చాలా బాగుంటుందమ్మా అని మధుర బట్టలు సిరికి ఇస్తుంది.

Madhuranagarilo Today Episode December 25 2023 Episode 244 Highlights
Madhuranagarilo Today Episode December 25 2023 Episode 244 Highlights

మధుర అలా మాట్లాడగానే చలపతి దాక్షాయణి షాక్ అయిపోతారు. మా ఆయన నాకు తెలియకుండా షాపింగ్ చేసి బట్టలు తెచ్చి సిరికి ఇస్తున్నాడని నాకు చెప్తే నేను గొడవ పడాలని మీరు ఇలా చేశారు కదా కానీ మీ అన్నయ్య ఎప్పుడూ అలా చేయడు అని నాకు చెప్పే చేస్తాడు మీ అన్నయ్య అంటే నాకు అంత నమ్మకం అని మధుర వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,ఏంటి రాధా మీ అక్క భర్తను నువ్వు పెళ్లి చేసుకున్నావా అని మాధవి షాక్ అవుతుంది.

Madhuranagarilo Today Episode December 25 2023 Episode 244 Highlights
Madhuranagarilo Today Episode December 25 2023 Episode 244 Highlights

అవును మాధవి మా అక్క మొదటి భర్త అని నాకు తెలియకుండానే నేను శ్యామ్ సార్ ని ప్రేమించాను ఆయన కూడా తన మొదటి భార్య చెల్లెలు అని తెలియకుండానే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ వాళ్ళ మాటలను బట్టి చూస్తే వాళ్ళిద్దరూ పెద్ద గొడవలు పడి విడిపోయినట్టుగా లేదు చిన్న అపార్థం చేసుకుని విడిపోయారు అని రాదా మాధవితో చెప్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు రాదా అని మాధవి అడుగుతుంది. అదే నాకు అర్థం కావట్లేదు అని రాదా అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu