ఆగస్టు 9వ తారీకు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. దీంతో అభిమానులు భారీ ఎత్తున కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆగస్టు 9వ తారీఖు నాడు 4కె టెక్నాలజీతో మహేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ”పోకిరి” సినిమా మళ్లీ రిలీజ్ అవుతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2006వ సంవత్సరంలో విడుదలైన “పోకిరి” ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మహేష్ కెరియర్ లో ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో మరింతగా మాస్ లో మహేష్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. అంతే కాదు ప్రిన్స్ ట్యాగ్ లైన్ కాస్త సూపర్ స్టార్ గా మారింది.
ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న మహేష్ బాబు గడ్డం న్యూ లుక్..!!
మహేష్ పలికే డైలాగులు మేనరిజం రన్నింగ్ స్టైల్ ముఖ్యంగా సినిమాలో పాటలు పోకిరి ఇండస్ట్రీ హిట్ అవ్వటంలో ప్రముఖ పాత్ర పోషించాయి. అటువంటి ఈ సినిమా మళ్లీ దాదాపు 16 సంవత్సరాల తర్వాత ప్రస్తుత టెక్నాలజీ తో రూపుదిద్దుకొని మళ్లీ మహేష్ పుట్టినరోజు నాడు ఆగస్టు 9వ తారీకు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టికెట్ లు హాట్ కేకుల అమ్ముడుపోయాయి. అయితే వచ్చిన ఈ కలెక్షన్ లను తన పుట్టినరోజు నాడు అభిమానులు మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లలకు చేస్తున్న గుండె ఆపరేషన్లకు.. ఇక పేద విద్యార్థులు చదువుకు వినియోగించాలని డిసైడ్ అయ్యారు.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ దాదాపు వెయ్యి మందికి చిన్న పిల్లలకు తన ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్ చేయించి బ్రతికించారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అంతేకాదు యాడ్ రంగానికి సంబంధించి వచ్చిన డబ్బులను సైతం మొత్తాన్ని ఛారిటీకి ఉపయోగించే గొప్ప మనిషి మహేష్ బాబు. అటువంటి హీరో అభిమానులు కూడా ఇప్పుడు అదే తరహాలో చారిటీ చేయడానికి ముందుకు రావడం విశేషం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!