Malli Nindu Jabili ఏప్రిల్ 25: నేను మీతో చెప్పినట్లే అరవింద్ బాబు గారు మాలిని అక్క పేరు మీద పూజ చేయించి వొస్తున్నాను అమ్మ గారు అని మల్లి అనడం తో మల్లి నిండు జాబిలి ఏప్రిల్ 25 నేటి ఎపిసోడ్ S1 E343 మొదలవుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో మల్లి తండ్రి సత్య కాదు మాలిని తండ్రి మల్లి తండ్రి ఒక్కరే అనే పెద్ద మలుపు కథలో చోటుచేసుకుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం

Malli Nindu Jabili Serial ఏప్రిల్ 25: పెల్లెటూరు నుండి పట్నం ఇంటికి వొచ్చిన అరవింద్ మల్లి
ముందుగా మల్లి పట్నం లో ఉన్న అరవింద్ ఇంట్లోకి తన బ్యాగ్ పట్టుకుని వొస్తుంది. జరిగిన విషయాలు ఇంట్లో చెప్పొద్దు అని చెప్పిన అరవింద్ మాటలు మల్లి కి గుర్తువొస్తాయి. అందుకే నిజం దాచి పూజ చేయుంచుకు వొస్తున్నాను అమ్మ గారు అని చెప్తుంది. ఇంతలో అలసిపోయిన మొఖం తో అరవింద్ అక్కడికి వొస్తాడు. తన తండ్రి అరవింద్ ను ఆపి మల్లి ఊరికి వెళ్లి వొచ్చిన సంగతి చెబుతాడు…అరవింద్ కూడా ఏమి తెలియనట్లు అవునా మల్లి అంటూ మామూలుగ మాటలు కలుపుతాడు. నువ్వు మాలిని కలిసిపోవడానికి మల్లి తన ఊరి దెగ్గర ఉన్న సీతారాముల గుడికి వెళ్లి పూజలు చేయించింది అని అరవింద్ కు చెప్తారు. తప్పనిసరి పరిస్థితులలల్లో మీకు అబద్ధం చెప్పాల్సి వొచ్చింది దీనికి దేవుడు నాకు ఎలాంటి శిక్ష వేస్తాడో అని మనసులో అనుకుంటూ మల్లి అక్కడనుంచి వెళ్ళిపోతుంది.

పుట్టింటికి వెళ్లిన మాలిని
వాడిపోయిన మోఖం తో బ్యాగ్ పట్టుకుని తన తల్లిగారి ఇంటికి వెళ్తుంది మాలిని. లోపలికి వొచ్చిన మాలినిని హత్తుకొని ఎలా ఉన్నావ్ అమ్మా? అంతా కూల్ కదా అని అడుగుతుంది మాలిని తల్లి వసుంధర. నాకోసం ఏదైనా తీసుకువొస్తావ్ అనుకున్నాను నువ్వు ఏంటి ఏదో పోగొట్టుకున్న దానిలా మొఖం అలా పెడుతున్నావ్ అంటూ తల్లి ఆరాతీస్తుంది. నేలకొండపల్లి రహస్యాలు నీకు తెలియకూడదు అని మీ నాన్న నాన్నమ్మ తెగ కంగారు పడుతున్నారు. అందుకేనేమో ఇప్పుడే కలిసి గుడికి వెళ్లారు అని అంటుంది వసుంధర.

పట్నం చేరిన నేలకొండపల్లి రహస్యాలు
ఇంతకీ నువ్వు వెళ్లిన పని ఏమైంది…నీకు ఏమైనా రహస్యాలు తెలిసాయా? నువ్వు ఎప్పుడు వొస్తావో ఎం తెలుసుకుంటావో అని ఎదురు చూస్తూ ఉన్నాను అని మాలినిని ఆరా తీస్తుంది వసుంధర. చాలా విషయాలు తెలుసుకున్నాను మామ్, చెప్తే విని భరించలేవేమో అని భయంగా ఉంది. అలా అని చెప్పకుండా నిన్ను మోసం చేయాలి అనే ఆలోచన లేదు అని మాలిని అంటుంది. దానికి వసుంధర బదులుగా నేను మోసాలు చూసి చూసి విసిగిపోయాను నాకు మోసం వొద్దు నిజం కావాలి అని వసుంధర అంటుంది. బాధ కలిగించేదయినా భరించలేనిది అయినా పరవాలేదు చెప్పు.
అయితే నీకు మల్లి అరవింద్ గురించి నిజం చెప్పాలి మామ్
నిజం చెప్పమని వసుంధర అడిగినదానికి బదులుగా మాలిని ఇలా అంటుంది…నీకు మల్లి గురించి నిజం చెప్పాలి మల్లికి అరవింద్ కి మధ్య అంత ఆప్యాయత ఎందుకు ఉందొ తెలుసా? మల్లిని అరవింద్ నాకంటే ముందు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అని వసుంధరకు చెప్పేస్తుంది. నేలకొండపల్లి లో అనుకోని పరిస్థితులలో వాళ్ళ పెళ్లి జరిగింది, ఆ విషయం తెలిసిన తరువాతనే నేను అరవింద్ కు డివోర్స్ ఇద్దాం అని నిర్ణయించుకుంది మామ్ అని చెప్పేస్తుంది.

Malli Nindu Jabili Serial ఏప్రిల్ 25: ఆ అరవింద్ పెద్ద నమ్మక ద్రోహి
మల్లి గురించి నిజం తెలియగానే కోపం తో రగిలిపోతుంది వసుంధర. నమ్మక ద్రోహి ఆ దిక్కుమాలిన దానిని నీకంటే ముందే పెళ్లి చేసుకున్నప్పుడు నీ మెడలో ఎందుకు తాళి కట్టాలి? ఆ అరవింద్ ను షూట్ చేసి పారేయాలి అంటుంది వసుంధర. పక్కన ఉన్న మాలిని ఏడుస్తూ ఆ మల్లి కూడా నా పక్కనే ఉంటూ అక్క అక్క అంటూ నా పై ప్రేమను కురిపించింది. వసుంధర ఆగ్రహం తో ఊగిపోతూ ఆ పనిది తడి గుడ్డలతో గొంతులు కోసేస్తుంది అంతటి నెరజాణ అది అని మల్లిని తిడుతుంది.
అరవింద్ కు నువ్వు విడాకులు ఇవ్వడమే కరెక్ట్
ఏడుస్తూ వసుంధర ఇలా అంటుంది…ఆ అరవింద్ కు నువ్వు విడాకులు ఇవ్వడమే కరెక్ట్. నీ కాపురం నిలబడే నిజం ఏదో ఆ నేలకొండపల్లి లో దొరుకుతుంది అనుకున్నాను కానీ ఇలా జరుగుతుంది అని అస్సలు ఊహించలేక పోయాను. ఇప్పుడే ఆ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తాను అంటూ కదులుతుంది వసుంధర. వెంటనే మాలిని ‘ఆగు మామ్’ అని వసుంధరను ఆపుతుంది. నన్ను ఆపకు మాలిని నా కూతురికి ఇంత నరకం చూపించిన ఆ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పాలి అని వసుంధర అంటుంది. కానీ అత్తయ్య వాళ్ళకి మల్లి గురించి నిజం తెలియదు మామ్ అంతే కాదు నేను ఇంకో పెద్ద నిజం కూడా తెలుసుకున్నా మామ్ అని మాలిని చెప్తుంది.

వసుంధరకు నిజం తెలుస్తుందా అనే కంగారులో శరత్
మరోవైపు గుడి నుంచి ఇంటికి తిరిగి వొస్తుంటాడు మాలిని తండ్రి శరత్. పక్కన ఉన్న తల్లి తో శరత్ ఇలా అంటాడు… నేలకొండపల్లి లో మాలిని కి ఎలాంటి నిజాలు తెలుస్తాయో అని కంగారుగా ఉంది, గుడి నుంచి వొస్తున్నా ప్రశాంతంగా లేదు. ఏదో జరుగుతుంది అని ముందే కంగారు పడకు అని తల్లి అంటుంది. వసుంధర గురించి నీకు తెలిసిందే కదా అమ్మ, మాములు సమయంలోనే తన నోటికి హద్దులు ఉండవు అలాంటిది నా గురించి ఏమైనా తెలిసిందంటే తన ముందు నిలబడటం కూడా కష్టమే.

Malli Nindu Jabili ఏప్రిల్ 25: మరొక నిజం వైపు వసుంధర
వసుంధర చేయి పట్టుకుని మాలిని తన తండ్రి శరత్ పెయింటింగ్ రూమ్ కు తీసుకువొస్తుంది. ఇక్కడకి ఎందుకు తీసుకువొచ్చావ్ మాలిని అని అడగగా ఈ రూమ్ లో మరొక నిజం ఉంది అందుకే తీసుకువొచ్చాను అంటూ మాలిని సమాధానం ఇస్తుంది. ఆ రూమ్ లో ఉన్న పెయింటింగ్స్ అన్ని పడేస్తూ వెతకడం మొదలు పెడుతుంది మాలిని. చివరికి దొరికిన పెయింటింగ్ చూస్తే అది మల్లి తల్లి మీరా పెయింటింగ్. ఆ పెయింటింగ్ ని వసుంధరకు చూపిస్తూ ఇందులో ఉన్నది ఎవరో తెలుసా అని అడుగుతుంది…

వసుంధరకు అది మల్లి వాళ్ళ అమ్మ మీరా అని చెప్పేస్తుంది. మల్లి వాళ్ళ అమ్మ పెయింటింగ్ మీ నాన్న ఎందుకు వేసాడు అని సందేహిస్తుంది వసుంధర దానికి మాలిని ఎందుకంటే మీరా ని నాన్న ఇష్టపడ్డారు కాబట్టి అని అంటుంది. మల్లి ఎవరో కాదు మీరా కు నాన్నకు పుట్టిన కూతురు మల్లి అని నిజం చెప్పేస్తుంది మాలిని. దీనితో ఊహించని షాక్ లోకి వెళ్ళిపోతుంది వసుంధర. మరి రేపటి మల్లి నిండు జాబిలి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.