Malli Nindu Jabili: మల్లి నిండు జాబిలి సీరియల్ తాజా ఎపిసోడ్ E353 అప్డేట్ లోకి వెళ్తే…అందరూ కలిసి భోజనం కి డైనింగ్ టేబుల్ దెగ్గర కూర్చుంటారు అందరూ మాట్లాడుతూ ఉండగా మాలిని అరవింద్ కుటుంబసభ్యులతో ఇలా అంటుంది… ‘నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఏదో ఒక వెలితి గా కూడా ఉంది’ అని అంటుంది. ఏమిటి మాలిని అది అని అడుగుతే మల్లి మన తో ఉండకపోవడం అని సమాధానం చెప్తుంది. ఇది విన్న అందరూ మాలిని ఉద్దేశం అర్ధం కాక ఒకరి మొఖం ఒకరు చూసుకుంటారు.

Malli Nindu Jabili May 9 Episode Update: మల్లిని పని మనిషిలా చూడటం ఆపేద్దాం మావయ్య… మల్లి నిండు జాబిలి మే 9 ఎపిసోడ్ లో మాలిని మాటలు

అక్కడ ఉన్న రూప కూతురు మధ్యలో ఇలా అంటుంది, మల్లి అక్క ఇక్కడ ఉంది కానీ ఎవ్వరం మాట్లాడట్లేదు ఇంతకు ముందు నాతో ఆడుకునేది ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు అని చెప్తుంది. అప్పుడు మాలిని అరవింద్ తండ్రి రామకృష్ణ తో ఇలా అంటుంది ‘మామయ్య మనం మల్లిని పని మనిషి లా చూడటం మానేద్దాం ఇంతక ముందు అరవింద్ విషయం లో మల్లి తో నాకు ప్రాబ్లెమ్ ఉన్నప్పుడు నేను అలా ఉన్నాను కానీ ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లమ్ లేదు ఎందుకంటే అరవింద్ ఇంకెప్పుడు నాకు దూరం కాడు’ అని అంటుంది. నేను మల్లిని ఇక్కడకు మనతో తినటానికి పిలుస్తాను దయచేసి ఎవ్వరు ఏమి అనుకోకండి అని మాలిని మల్లిని అక్కడకు పిలుస్తుంది. ఇది చూసి అరవింద్ ‘మాలిని ఎందుకు మల్లి పై ఇలా ప్రేమ చూపిస్తుంది అని అనుమానిస్తాడు’.

పక్క రూమ్ లో చదువుకుంటున్న మల్లి ఏంటక్కా అంటూ అక్కడకు వస్తుంది. మల్లిని అందరితో కలిసి భోజనం చేయమని చెప్తుంది మాలిని. నేను తరువాత తింటాను అక్క మీరు తినండి అని ఇబ్బందిగా చెప్తుంది మల్లి. మల్లి మాటలు వినకుండా బలవంతంగా అక్కడ కూర్చోపెడుతుంది మాలిని. కోపం తో ఉన్న అనుపమ ‘మాలిని చాలా పెద్ద మనసు చేసుకుని నిన్ను చేరతీస్తుంది కాస్త జాగర్తగా ఉంటె మంచిది’ అని మల్లికి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఇంత పాజిటివ్ గా ఆలోచించడం మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మాలిని వి అర్ ప్రౌడ్ అని అంటదు రామకృష్ణ.
Malli Nindu Jabili: అత్తయ్య అరవింద్ కు మాలిని ఎంతో మల్లి కూడా అంతే
మల్లిని తన బ్యాగ్ తీసుకుని రమ్మని హాల్ లోకి తీసుకువెళ్తుంది మాలిని. అక్కడ అనుపమ తో మాట్లాడుతూ అత్తయ్య అరవింద్ కు మల్లి ఎంతో మాలిని కూడా అంతే అనడం తో అందరూ మల్లి షాక్ అవుతారు. మాలిని వెంటనే అరవింద్ కు నా మీద ఉన్నదీ ప్రేమ అయితే మల్లి మీద ఉన్నదీ మల్లిని చదివించాలి అని బాధ్యత అని కవర్ చేస్తుంది. మల్లిని కిచెన్ రూమ్ లో ఉండమనడం చాలా తప్పు అందుకే మల్లి రూమ్ ని మల్లి కి ఇచ్చేద్దాం అని అందరితో అంటుంది మాలిని. ఇదంతా చూసి మాలిని అసలు ప్లాన్ తెలియని అరవింద్ కుటుంబం మాలిని పట్ల చాలా గర్వంగా అనుకుంటారు.

హాయ్ మామ్… నేను ఇక్కడ దేవతను అయిపోయాను
తన రూమ్ లోకి వెళ్లిన తరువాత మాలిని వసుంధరకు కాల్ చేస్తుంది. ఫోన్ తీసిన వసుంధర మాలిని తో నీ గేమ్ మొదలయిందా అని అడుగుతుంది. ఏస్ మామ్, నాకు అత్తగారి ఇల్లు కొత్తగా ఉంది. నేను ఇక్కడ దేవత అయిపోయాను అని వారి ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు మాలిని ఇంకా వసుంధర. నీ ఆట నువ్వు ఆడుతూ నే ఒకకంట ఆ మల్లిని కనిపెడుతూ ఉండు, ఏ మాత్రం ఏమరుపాటు అయినా ఆ పని మనిషి ఇంటి మనిషి అవుతుంది అని మాలినికి సలహా ఇస్తుంది వసుంధర.

ఇంతలో వసుంధర ఫోన్ లో మాలిని తో మాట్లాడుతున్న కీచక ప్లాన్ వినేస్తాడు అక్కడికి వొచ్చిన శరత్. వెంటనే మల్లి కి అన్యాయం చేయడానికి వేస్తున్న ప్లన్స్ గురించి వసుంధరను నిలదీస్తాడు శరత్.

మరోపక్క అరవింద్ ఇంట్లో మల్లి తో మాట్లాడుతూ ఉండగా మల్లి వసుంధర తనను కొట్టడం రికార్డు అయిన వీడియో తనకి చూపిస్తుంది, ఇదంతా పక్కనుంచి వినేసిన మాలిని ఎలా అయినా మల్లి మెడలోంచి తాళి తీసివేయాలి అని కొత్త ప్లాన్ రెడీ చేసుకుంటుంది…మరి అది ఏంటో చూడాలి అంటే మల్లి నిండు జాబిలి సీరియల్ తరువాతి ఎపిసోడ్ డిస్నీ+ హాట్ స్టార్ లో చూడాల్సిందే.