Malli Nindu Jabili ఆగస్టు 10 ఎపిసోడ్ 420: ఉదయం నుంచి మాకు కనిపించలేదు గౌతమ్ ఇంటి నుండి వెళ్లిపోయినట్టుంది అని కౌసల్య అంటుంది. నైట్ నోటికి వచ్చినట్టు వాగారు కదా సార్ అందుకే బాగా కోపం వచ్చి వెళ్లిపోయినట్టుంది అని నీలిమ అంటుంది. కోపంలో అన్నాను అని గౌతమ్ అంటాడు. కోపనికైనా హద్దు ఉండాలి నీకు కోపం ఎక్కువ తనకి అభిమానం ఎక్కువ ఆవు పులి ఒకే బోన్ లో ఉండలేవు కదా అందుకే వెళ్ళిపోయి ఉంటుంది అని కౌసల్య అంటుంది. మీరు గమనించాలి కదా మల్లి వెళ్తుంటే నన్ను పిలవాలి కదా అని గౌతమ్ అంటాడు. ఎంత కోప్పడితే మాత్రం నాకు చెప్పకుండా వెళ్ళిపోవాలా అంటాడు.

మల్లి వెళ్ళిపోయినందుకు నీకు నిజంగా అంత బాధగా ఉందా.మాట అనే ముందు కాసేపు ఆలోచించుకొని ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా అని నీలిమ అంటుంది.తొందరగా పెళ్లి చేసుకొని నీ భార్య మీద అరుచుకో అంతేకానీ ఎవరి మీద అరిచినా పద్ధతి కాదు అని కౌసల్య అంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి నాకు పెళ్లి దగ్గరికి ఎందుకు వస్తావు అమ్మ. అదే పరిష్కారం కాబట్టి ఆ మాట అంటున్నాను అని కౌసల్య అంటుంది. మల్లి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను అంటాడు గౌతమ్.

గౌతమ్ నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు మల్లి లాన్ లో బయట ఉంది అని కౌసల్య అంటుంది. గౌతమ్ మల్లి మీద నీకు ప్రేమ చిగురించింది అది నువ్వు చెప్పుకోలేకపోతున్నావు అని అంటుంది కౌసల్య. లేదంటున్నాడు కానీ అన్నయ్యకు మల్లి మీద ప్రేమ మొదలైంది అని నీలిమ అంటుంది. గౌతమ్ మల్లి దగ్గరికి వెళ్తాడు,మల్లి అని పిలుస్తాడు. మల్లి కంగారులో చెట్లకి పోస్తున్న నీళ్ళు గౌతమ్ మీద పడతాయి. గౌతమ్ చిన్న చిరునవ్వుతో ఉంటాడు. హమ్మయ్య ఏమంటారు అని భయమేసింది అని మల్లి అంటుంది.

రాత్రి నేను అన్న మాటలకు ఇంట్లో నుండి వెళ్లిపోయావు అనుకున్నాను అని గౌతమ్ అంటాడు. నేను ప్రవర్తించిన తీరు మా అమ్మకి చెల్లికే నచ్చలేదంటే నీకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను సారీ అంటాడు గౌతం. పర్వాలేదు బాసుగారు ఎవరికి సారీ చెప్పే అలవాటు లేని మీరు ఈ మధ్య నాకు సారీ చెబుతున్నారు అలా చెప్పకండి నాకు ఇబ్బందిగా ఉంటుంది అని మల్లి అంటుంది.నా తప్పు లేకుండా తిట్టు తినడం చిన్నప్పటినుంచి అలవాటే,తిట్టిన వారు తర్వాత తమ తప్పు తెలుసుకుంటారు అందుకే నేను ఎవరిని తప్పు పట్టను సర్దుకుపోతూ ఉంటాను నేను మల్లి అంటుంది.

నేను నీలో అబ్జర్వ్ చేసిన గొప్ప విషయం ఏంటో తెలుసా నీకు ఓపిక ఎక్కువ. ఆడపిల్లకి ఉండాల్సిన మొదటి లక్షణం అదే అని మల్లి అంటుంది. ఇంకోసారి నేను నిన్ను ఇబ్బంది పెట్టను నాకు కోపం వచ్చినప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేను అది నా వీక్నెస్ ఈ పనులు నువ్వు చేయకూడదు లోపలికి పద అని గౌతమ్ అంటాడు. ఏ సంబంధం లేని నన్ను మీ ఇంట్లో చోటు ఇచ్చి సొంత మనిషిలా చూసుకుంటున్నారు నేను కూడా దీన్ని పరాయి ఇల్లు అనుకోవడం లేదు అని మల్లి అంటుంది. నీ ఇల్లు అనుకున్నప్పుడు నువ్వు పనులు చేయకూడదు అని గౌతమ్ అంటాడు.

మల్లి చేత పని చేపించినందుకు పని వాళ్ళను ఒకే కాలు మీద నిలబడమని చెప్తాడు ఇంకోసారి ఇది మళ్ళీ జరగకూడదు అని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మీరా మల్లి గురించి మాలిని చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. ఇంతలో శరత్ వస్తాడు. ఎందుకు పిలిచావు అని అంటాడు. మల్లి విషయం మీతో మాట్లాడాలి, మల్లి భవిష్యత్తు గురించి మీరేం ఆలోచించారు. ఇంతకాలం మీ కంటికి చేతకాని వాడిలా కనిపించొచ్చు నా పరిస్థితి గురించి ఎన్నిసార్లు చెప్పినా సమర్ధించుకున్నట్టే ఉంటుంది నేను గతం గురించి కంటే భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాను ఒక తండ్రిగా మల్లి విషయంలో ఏ దశలో నేను చేయాల్సినవి చేయలేదు కానీ నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అని శరత్ అంటాడు.

అటు మల్లి మాటలు ఇటు మాలిని మాటలు వింటుంటే మల్లి అరవింద్ బాబులు తిరిగి కలుస్తారు అని అనిపించడం లేదు అని మీరా అంటుంది. పక్కనుండి వసుంధర ఈ మాటలన్నీ వింటుంది, ఇన్ని రోజులకు నీకు ఈ విషయం అర్థమైంది అని అనుకుంటుంది. నేను ఇద్దరి తండ్రిని నాకు ఎలాంటి పక్షపాతం లేదు అని శరత్ అంటాడు. నాకు ఇద్దరు రెండు కళ్ళ లాంటివారు ఇద్దరి మంచి కోసం నేను ఏమైనా చేస్తాను మీరా అన్నీ ఉన్న మాలిని విషయంలోనైనా ఏమీ లేని మల్లి విషయంలోనైనా నీ తండ్రి ప్రేమలో ఎలాంటి తేడా ఉండదు అని శరత్ అంటాడు. నా ముందు ఎలా ప్రమాణం చేశారో అవసరం వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడండి తప్పించుకోడానికి ప్రయత్నించకండి అని మీరా అంటుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కొంచెం ఆలస్యం జరిగితే వాళ్ల జీవితాలు నాశనం అయిపోతాయి ఏం చేద్దాం చెప్పు అని శరత్ అంటాడు. ఇంతకుముందు చెప్పినట్టు మల్లి పెళ్లి విషయంలో మీరు తోడుంటే చాలు బాబు గారు. రేపు మల్లి ని గుడి దగ్గరికి రమ్మని పిలుస్తాను మీరు కూడా రేపు గుడి దగ్గరికి రండి మల్లి తో మాట్లాడదాం.

మల్లి కి పెళ్లైపోతే మాలిని జీవితం బాగుంటుంది ఈ విషయం వెంటనే మాలిన కి చెప్పాలి అని వెళ్తుంది వసుంధర. కట్ చేస్తే, మాలిని వచ్చి త్వరలో మల్లి కి పెళ్లి అంటుంది. నువ్వు చెప్పింది అబద్ధం అని అంటుంది. మల్లి కి ఇంకో పెళ్లి జరగదు మల్లి చేసుకోదు కూడా.మీరా గారికి మల్లికి ఇలాంటి ఆలోచన రాదు అని అరవింద్ అంటాడు. నేను వెళ్లి వాళ్ళతో మాట్లాడాను మీరా దానికి కనెక్ట్ అయింది అంటే తనకి ఆలోచన ఉన్నట్టే కదా అని మాలిని అంటుంది.

ఇంకో విషయం కూడా చెప్పను అరవింద్ మల్లి ని ఎవరికో ఇచ్చి చేయడం ఎందుకు, మల్లి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న గౌతం కే ఇచ్చి చేయండి అని చెప్పాను.అసలు నీ ఉద్దేశం ఏంటి అరవింద్ వెల్విషర్ అనే ఇంకా మైంటైన్ చేద్దాం అనుకుంటున్నావా అలాంటి ఆలోచనతో ఉంటే మల్లి ని భార్య అనరు కీప్ అంటారు అని అంటుంది మాలిని. మాలిని ఇంకోసారి ఆ మాట అనడానికి ప్రయత్నించకు అని అరవింద్ అంటాడు. మీరందరూ కలిసి మల్లి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారు అని వెళ్ళిపోతాడు. వాళ్ళ అక్క వచ్చి మల్లి భవిష్యత్తు గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అరవింద్ అని అడుగుతుంది.