Malli Nindu Jabili ఆగస్టు 17 ఎపిసోడ్ 425: మల్లి నిండు జాబిలి ఈ రోజు ఎపిసోడ్ ఇలా మొదలవుతుంది…చాలా ఆనందంగా ఉంది అమ్మ ఎల్లుండి ఏకాదశి, మా స్వామీజీ చెప్పినట్టు ఆ రోజే పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటాను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసేయ్ అమ్మ అని కౌసల్య అంటుంది. మల్లిలాంటి మంచి అమ్మాయి దొరకడం నీ అదృష్టం బ్రో అని నీలిమ అంటుంది. గౌతమ్ ఇలా రా మల్లి పక్కన నిలబడు మీ ఇద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉందో అని కౌసల్య అంటుంది. సీతమ్మ తల్లి నా జీవితం ఎటువైపు వెళుతుందో అని మల్లి అనుకుంటుంది. కట్ చేస్తే ఈ గుడికి ఎందుకు రమ్మన్నావు మాలిని అని వసుంధర అడుగుతుంది. ఈ గుడిలోనే మల్లిని పెళ్లికి ఒప్పించాను అందుకే ఇక్కడికి రమ్మన్నాను అని మాలిని అంటుంది.విషయమేంటి అని వసుంధర అడుగుతుంది.

మల్లి పెళ్లికి ఒప్పుకుంది అందరూ ఇంట్లో ఆనందంగా ఉన్నారు అని మాలిని అంటుంది. ఇంట్లో కూడా అందరూ ఆనందంగా ఉన్నారు కానీ అరవింద్ తో జాగ్రత్తగా ఉండాలి అని వసుంధర అంటుంది. అంతా అయిపోయింది ఆయన ఆరాటం, ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు అని మాలిని అంటుంది. నాదొక చిన్న అనుమానం మల్లి తన జీవితాన్ని అంత లెటర్ లో రాసి అది గౌతం కి ఇస్తే అది చదివి కూడా గౌతం పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు అని వసుంధర అంటుంది. మల్లి ఏ లెటర్ అయితే రాసుకుందో ఏ లెటర్ అయితే గౌతమ్ కి ఇవ్వాలని అనుకుందో అది మారిపోయింది అమ్మ అది ఎలా అంటే నేనే ఆ లెటర్ మార్చి నేను రాసిన లెటర్ ని పెట్టాను, మల్లి గతం తెలిస్తే గౌతమ్ పెళ్లికి ఒప్పుకోడు అందుకని అలా చేయవలసి వచ్చింది అని మాలిని అంటుంది.

ఇప్పుడు పెళ్లయ్యాక తెలిస్తే దాని పరిస్థితి ఏంటి అని వసుందర అంటుంది. నువ్వు అనుకున్నట్టు పెళ్లయిన తర్వాత నిజం తెలిస్తే మల్లి ఆ బాధని భరించాల్సిందే అమ్మ అని మాలిని అంటుంది. అంతా మంచే జరగాలి అని వసుంధర అంటుంది.నువ్వు ఈ పెళ్లికి రావాల్సిందే అమ్మ అని మాలిని అంటుంది. చి నేను దాని పెళ్లికి రావడం ఏంటి అసలు ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు నీకు మంచి జరుగుతుందేమో కానీ నాకైతే నచ్చట్లేదు నేను జీర్ణించుకోలేక పోతున్నాను మాలిని అది గౌతమ్ తో కలిసి కారులో నుండి దిగుతుంటే కలెక్టర్ లాగా నేను భరించలేక పోతాను మాలిని అని అంటుంది వసుంధర. ప్లీజ్ అమ్మ నా గురించి ఒక్కసారి ఆలోచించు డాడీని పంపించు అని మాలిన అంటుంది. ఫైనల్ గా నాకు నీ జీవితం ముఖ్యం అలాగని మీ డాడీని పంపించలేను రేపు ఏదైతే అదే అవుతుంది అని వసుంధర వెళ్ళిపోతుంది.

కట్ చేస్తే మీరా మల్లిని పెళ్లి కూతుర్ని చేస్తుంది. రండి రండి అని కౌసల్య పెళ్లి మండపంలో ఉండి అందరిని ఆహ్వానిస్తుంది. కౌసల్య గారు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎన్నోసార్లు మేము అడిగాము. కానీ మీరు గౌతమ్ కి పెళ్లి ఇంట్రెస్ట్ లేదని అన్నారు కానీ ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తున్నారని నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు పెళ్లి కి వచ్చిన ఒక వ్యక్తి . ఏకాదశి లోపు గౌతమ్ కి పెళ్లి జరుగుతుందని మా గురుజి చెప్పారు ఆ విధంగానే మా గౌతమ్ తను ఇష్టపడిన మల్లి ని పెళ్లి చేసుకుంటున్నాడు ఆ ఇద్దరినీ దీవించి వెళ్ళండి అని కౌసల్య అంటుంది. ఏమైంది శరత్ చంద్ర ఏడుస్తున్నావ్ అని వాళ్ళ అమ్మ అడిగింది.

నా భార్య బిడ్డలకు గుర్తింపు ఇవ్వబోతున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా ఇంత కాలం తండ్రి స్థానంలో సత్య ఉన్నాడు నా స్థానాన్ని చాలా కాలం సత్య మోసాడు అందుకని నాకు వాడి మీద చాలా గౌరవం ఉందమ్మా ఇకమీదట నేనే చూసుకుంటాను అని శరత్చంద్ర అంటాడు. కట్ చేస్తే జైల్లో సత్యని విడుదల చేస్తారు. అరవింద్ గౌతమ్ తో పెళ్లి మల్లి కి జరగకూడదని చాలా రకాలుగా ప్రయత్నించాడు కానీ ఇప్పుడు అదే జరుగుతుంది మాతో అరవింద్ పెళ్లికి రాకుండా ఉండిపోయాడు అని వాళ్ళ అక్క అనుకుంటుంది.

నువ్వు అనుకున్నట్టే మల్లి పెళ్లి జరుగుతుంది కదా మాలిని ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని వాళ్ళ అత్తయ్య అడుగుతుంది. నా టెన్షన్ అంతా అరవింద్ గురించే అత్తయ్య అని మాలిని అంటుంది. అరవిందు పెళ్లికి రావట్లేదు కదమ్మా కానీ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని వాళ్ళ మామయ్య అంటాడు. పెళ్లికి వస్తే ఎలాగో అలా కంట్రోల్ చేసే దాన్ని కానీ పెళ్లి టైం కి వచ్చి ఏం చేస్తాడో అని టెన్షన్ గా ఉంది మామయ్య అని మాలిని అంటుంది. కట్ చేస్తే సత్య వాళ్ళ ఇంటికి వెళ్లి మీరా మల్లి ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు వాళ్లు సిటీలో ఉన్నారో ఊళ్లో ఉన్నారో తెలియదు అన్న అని వాళ్ళ ఇంటి పక్కన అబ్బాయి అంటాడు.

సరే నేను అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్లి మల్లి కి న్యాయం జరిగిందో లేదో తెలుసుకుంటాను అని సత్య అంటాడు. కట్ చేస్తే మల్లి పెద్దింటి కోడలు కాబోతుంది చాల అదృష్టం అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. నా కూతురు కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుంది ఈ మూడు ముళ్ళు పడగానే నా కూతురు జీవితంలోకి వెలుగులు వస్తాయి గౌతమ్ బాబు గారు నా కూతురు చేయిని ఎప్పుడు వదిలిపెట్టరు అని మీరా అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది రేపు ఏం జరుగుతుందో చూద్దాం