NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: రాదు అనుకున్న,జాబ్ వచ్చినందుకు సంతోషపడుతున్న గౌతమ్..

Malli Nindu Jabili Today Episode January 06 2024 Episode  Highlights

Malli Nindu Jabili: కినువ్వు ఎవరే నాకు చెప్పడానికి ఎలా వెళ్లాలో ఎప్పుడు రావాలో నాకు తెలుసు అని గౌతమ్ అంటాడు. ఏవండీ ఇక్కడ ఎందుకండి మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం పదండి అని మల్లి అంటుంది. వద్దులేవే నా జీవితానికి దరిద్రం పట్టినట్టు పట్టుకున్నావు అని ని కోపంగా వెళ్ళిపోతాడు గౌతమ్. కట్ చేస్తే, కౌసల్య గౌతమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంటిదగ్గర. గౌతమ్ తాగి తూలుతూ నడుచుకుంటూ సోయలేకుంట ఇంటికి వస్తాడు. గౌతమ్ ని చూసి కౌసల్య ఏంటి గౌతమ్ ఇలా అయిపోయావు అని అంటుంది. ఏం చేయనమ్మ ఈ మందు తప్ప నాకు వేరే మార్గం కనిపించడం లేదు బాధని మర్చిపోవాలంటే అని గౌతమ్ అంటాడు. అన్నయ్య మన కష్టాలకి పరిష్కారం మందు ఒకటే కాదు అని నీలిమ అంటుంది. ఈ మందు వల్ల ఇంత ఉపయోగం ఉంది అని తెలిస్తే ముందే అలవాటు చేసుకునేవాన్ని ఎంత హాయిగా ఉందో ఇది ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు ఏం చేయను ఏ స్థితిలో ఉన్న నేను ఈ స్థితికి పడిపోయాను అంతా ఈ మహారాణి వల్లనే మన ఇంటికి కోడలుగా వచ్చింది మనం పతనం అయిపోయాం అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 06 2024 Episode  Highlights
Malli Nindu Jabili Today Episode January 06 2024 Episode  Highlights

ఎక్కడ వెతికినా ఉద్యోగం దొరకట్లేదు అంతా నిరాశ ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చిన నేను నాకు ఉద్యోగం ఇవ్వడానికి అందరూ భయపడుతున్నారు నాకు ఉద్యోగం చూసుకోలేని అసమర్ధుడినైపోయాను అని గౌతమ్ బాధని వ్యక్తం చేస్తాడు. బాధపడకండి నా వల్లనే మీకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు నా వల్లనే మీ ఆస్తులని పోయాయి ఇంత కష్టం వచ్చిందని బాధపడుతున్నారు నేను మీరు ఎగిరే గాలిపటం లాంటి వారికి దారం తెంపేశానని అంటున్నారు కానీ తొందరలోనే మీకు కావాల్సినవన్నీ తిరిగి నేనే తెస్తాను నీ గౌరవ మర్యాదలన్నీ మీకు ఇప్పిస్తాను మీరు బాధపడకండి అని మల్లి అంటుంది. ఇదంతా నీ వల్లనే కాదనే జరిగింది ఏదో మంచి నాలుగు మాటలు చెప్పినంత మాత్రాన మంచిగా మారిపోయావు అనుకుంటామా అని కౌసల్య అంటుంది. పగిలిన అద్దం విరిగిపోయిన మనసు అప్పుడే అతుక్కోవని తెలుసు అత్తయ్య నాక్కూడా కానీ ఈ పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటపడేస్తాను ఇప్పుడు మిమ్మల్ని అవమానించిన వాళ్ళతోటే మిమ్మల్ని మెచ్చుకునేలా చేస్తాను నేను దారాన్ని తెంపేశానన్నారు కదా అండి నీ జీవితంలో ఒక ఇంద్రధనస్సు నవ్వుతాను మీరేమీ ఆలోచించకండి మీరు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నేను జాబ్ చేసి మిమ్మల్ని బాగా చూసుకుంటాను మీరు బాధపడకండి అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 06 2024 Episode  Highlights
Malli Nindu Jabili Today Episode January 06 2024 Episode  Highlights

ఏ నువ్వు నన్ను టచ్ చేయొద్దు అని గౌతమ్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, మీరా మల్లి ఫోటో పట్టుకొని ఏడుస్తూ బాధపడుతుంది. ఇంతలో అరవింద్ వచ్చి ఏంటి అత్తయ్య గారు మీరు కూడా ఇలా బాధపడుతున్నారా అని అడుగుతాడు. ఏం చేయను బాబు మల్లి జీవితం ఎంతో అందంగా ఉంటుంది అనుకున్నాను కానీ దాని పరిస్థితి ఎలా దిగజారిపోయిందో చూడండి నీతో పెళ్లి దానికి కలగా మిగిలిపోయింది కానీ గౌతమ్ బాబుతో పెళ్లి ఉదయం పూట వచ్చి నా కలగా మారిపోయి తన జీవితాన్ని మార్చేసింది అనుకున్నాను కానీ మల్లి అదే జీవితం అయ్యే కష్టాలు అయ్యే బాధలు అని మీరా బాధపడుతుంది. మీరేమీ బాధపడకండి అత్తయ్య గారు మల్లి కోసం నేను ఏమైనా చేస్తాను తప్పు చేసింది ఒకరు శిక్ష అనుభవించేది ఇంకొకరు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని అది సరిదిద్దుతాను మల్లి గౌతమ్ మల్లి నీ అర్థం చేసుకొని తన హక్కును చేర్చుకునేలా చేస్తాను నేను మీకు ఎప్పుడో చెప్పాను మల్లి బాధ్యత నాది మీరేమీ బాధపడకండి అని అరవింద్ అంటాడు. అక్కడే నిలబడి చూస్తున్న మాలిని వాళ్ళ మాటలన్నీ వింటుంది.

Malli Nindu Jabili Today Episode January 06 2024 Episode  Highlights
Malli Nindu Jabili Today Episode January 06 2024 Episode  Highlights

తపస్సు చేసుకునే మునులను రాయి పెట్టి తపస్సు భంగం చేస్తే ఎంత పాపం కలుగుతుందో అంత పాపం చేసినట్టున్నాం బాబు అందుకే ఆ పాపం శాపమై మమ్మల్ని ఇన్ని కష్టాలు పాలు చేసింది అని మీరా ఏడుస్తుంది. ఒకరికి మంచి చేయడం తప్ప చెడు చేయలేదు నేను నేలకొండపల్లి రావడమేంటి మల్లి నేను చూడడమేంటి మీ ఊరి ఆచారం ప్రకారం మా ఇద్దరికీ పెళ్లి జరగడం ఏంటి అసలు నేను అంటూ అక్కడికి రాకపోతే మల్లి ఇక్కడ దాకా వచ్చేది కాదు ఇన్ని కష్టాలు పడేది కాదు అత్తయ్య గారు కానీ ఈ సమస్యకి నేనే పరిష్కారం వెతుకుతాను మీరేమీ బాధపడకండి అని అరవింద్ వెళ్ళిపోతాడు.మల్లి గురించి ఎంత ఆలోచించొద్దు అంటున్నా మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న అరవింద్ ఎలా నేను దారిలో పెట్టేది అని మాలిని అనుకుంటుంది. కట్ చేస్తే,  గౌతమ్ ఒక న్యూస్ చానల్స్ దగ్గరికి వెళ్లి జాబ్ కోసం అడుగుతాడు.

Malli Nindu Jabili Today Episode January 06 2024 Episode  Highlights
Malli Nindu Jabili Today Episode January 06 2024 Episode  Highlights

గౌతమ్ నీలాంటి వాడికి జాబు నివ్వడం దేవేంద్రునికి ఉడుత సహాయం చేసినంత నువ్వు ఏమీ అనుకోనంటే మన న్యూస్ ఛానల్ లో నీకు జాబ్ ఇస్తున్నాను రేపే వచ్చి జాయిన్ అయిపో అని అతను అంటాడు. మినిస్టర్ కి భయపడి అందరూ నన్ను రిజెక్ట్ చేసినట్టు మీరు కూడా జాబ్ ఇవ్వరు అనుకున్నాను సార్ చాలా థాంక్స్ అని గౌతమ్ ఆనందంతో పొంగిపోతాడు. వెంటనే కౌశల్ కి ఫోన్ చేసి అమ్మ నాకు జాబ్ వచ్చింది అని చెప్తాడు. అత్తయ్య ఆయనకు జాబ్ వచ్చిందా ఒకసారి ఇవ్వండి నేను మాట్లాడుతాను అని మల్లి అంటుంది. ఏమండీ మీకు జాబ్ దొరికిందా కంగ్రాజులేషన్స్ అండి అని మల్లి అంటుంది. నా హ్యాపీనెస్ అమ్మతో పంచుకోవడానికి ఫోన్ చేశాను అమ్మకి ఫోన్ ఇవ్వు అని మాట్లాడుకుంటూ రోడ్డు మీదకి వస్తాడు. ఏమండీ ఆల్ ద బెస్ట్ తొందరగా ఇంటికి వచ్చేయండి అని మల్లి మాట్లాడుతూ ఉండగా గౌతమ్ కోపంతో అమ్మకి ఫోన్ ఇవ్వమని చెప్తున్నాను కదా అని నడుస్తూ వస్తూ ఉండగా ఒక కారు వచ్చి గుద్దేసి వెళ్ళిపోతుంది.

Malli Nindu Jabili Today Episode January 06 2024 Episode  Highlights
Malli Nindu Jabili Today Episode January 06 2024 Episode  Highlights

గౌతమ్ కింద పడిపోతాడు అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఆ ఫోన్ తీసుకుని యాక్సిడెంట్ అయింది అమ్మ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 40 కి రండి అని చెప్తారు. కట్ చేస్తే, అందరూ హాస్పిటల్లో ఉంటారు. డాక్టర్ గారు మా అబ్బాయికి ఎలా ఉంది కండిషన్ సీరియస్  అని కౌసల్య అడుగుతుంది. లేదమ్మా ఏం పర్వాలేదు అతనికి కాలు విరిగిపోయింది.కొన్ని రోజులు వీడ్ చైర్ లో కూర్చోవాల్సి ఉంటుంది తలకు దెబ్బలు ఏమి తగల్లేదు బాగానే ఉన్నాడు అని డాక్టర్ చెప్తాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N