NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili January 08 2024 Episode 541: అరవింద్ ని మీరా ని  దయచేసి  హాస్పిటల్ కి రావద్దు అంటున్న మల్లి..

Malli Nindu Jabili Today Episode January 08 2024 Episode 541 Highlights

Malli Nindu Jabili January 08 2024 Episode 541: ఏమీ చేయలేము కొన్నాళ్లు వీల్ చైర్ లో కూర్చోవాల్సిందే అని డాక్టర్ చెప్తాడు. వాళ్లు లోపలికి వెళ్లి గౌతమ్ చూసి బాధపడతారు. మల్లి గౌతమ్ కాలు పట్టుకునే సరికి కౌసల్య కోపంగా చూస్తుంది దానితో మల్లి కాలు వదిలిపెట్టి పక్కకు జరిగి నిలబడి చూస్తూ ఉంటుంది. గౌతమ్ పరిస్థితి చూసి కౌసల్య ఈ శిక్ష ఏదో నాకు పడొచ్చు కదా అని కౌసల్య ఏడుస్తుంది. దీనికంతటికి కారణం ఇదే బయటికి పో వద్దంటున్నా గానీ వాడు ఫోన్ తీసుకుని మాట్లాడి ఇడిటేషన్ తెప్పించావు వాడు నీ కోపంలో చూసుకోకుండా ఏ పరధ్యానంలో నడిచాడొ ఏమో యాక్సిడెంట్ అయింది అని కౌసల్య తిడుతుంది. అమ్మ వదినని తిట్టడానికి ఇల్లు హాస్పిటల్ అనేది ఏమీ ఉండదా పదండి మనం బయటికి వెళ్దాం అని నీలిమ అంటుంది. అమ్మ నన్ను కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వండి అని గౌతమ్ అంటాడు. మల్లి గౌతమ్ పరిస్థితిని చూసి వెనకకు ముందుకు చూస్తూ బాధపడుతూ కళ్లనిండా నీళ్లు తెచ్చుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ప్రశాంతంగా కూరగాయలు కట్ చేసుకుంటున్నావా మీరా నేను చెప్పే మాట వింటే నీకు గుండె ఆగిపోతుంది అని వసుంధర మీరా  దగ్గరికి వస్తుంది, గౌతమ్ కి యాక్సిడెంట్ అయ్యిందంట ప్రమాదం ఏమీ లేదు కానీ వీల్ చేరికే పరిమితమయ్యాడంట అని వసుంధర చెప్తుంది.

Malli Nindu Jabili Today Episode January 08 2024 Episode 541 Highlights
Malli Nindu Jabili Today Episode January 08 2024 Episode 541 Highlights

నేను వెంటనే వెళ్లి చూసి వస్తాను అని మీరా వెళుతుంది. మేన అల్లుడా నువ్వు నాతో పెట్టుకున్నావు నినఅంటే ఏంటో చూపిస్తున్నాను చూడు అని వసుంధర  అంటుంది. ఆత్మీయులుగా మనం వెళ్లి పలకరించాల్సిన సమయం కానీ గౌతమ్ మనల్ని చూస్తేనే కోపంతో మండి పడతాడు అని మాలిని అంటుంది. దెబ్బ మీద దెబ్బ వాళ్ళకే తగులుతుంది ఈ పరిస్థితులు నుంచి కోల్ కొక ముందే  ఇంకొక ప్రమాదంలో పడ్డారు అని అరవింద్ అంటాడు. బాబు గారు గౌతమ్ బాబుని చూసి వద్దాం రండి అని మీరా అంటుంది. ఇప్పుడు మీరు వెళ్తే వాడు నడవలేని పరిస్థితిలో ఉన్నా కానీ లేచి మిమ్మల్ని బయటకు వెళ్ళమని కోపంతో  అంటాడు అని వసుంధర అంటుంది. ఇలా భయపడుతూ ఎన్నాళ్ళు దూరంగా ఉంటాం బాబు గారు అని మీరా అంటుంది. కట్ చేస్తే, ఇంతలో మల్లి అక్కడికి వచ్చి మీరు ఎవరు అక్కడికి రావద్దు అని అంటుంది. మల్లి ని చూసిన మీరా గుండెలకు హగ్ చేసుకుని గుండెలు పగిలేలా ఏడ్చి అల్లుడుగారు ని  చూడడానికి వస్తాం అమ్మ కాదనకు అని అంటుంది మీరా. జరిగింది తెలిసిన తర్వాత కచ్చితంగా వస్తారని తెలుసు అందుకే రావద్దని చెప్పడానికి వచ్చాను అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 08 2024 Episode 541 Highlights
Malli Nindu Jabili Today Episode January 08 2024 Episode 541 Highlights

ఇలా పట్టు విడుపు లేకుండా ఎంతకాలం ఉంటారు అని మీరా అంటుంది. నా చేతిలో ఏమీ లేదు అంత భగవంతుడు దయ అని మల్లి అంటది. మంచికి మంచిని ఇస్తాడు చెడుకు చెడుని ఇస్తాడు అంతా భగవంతునికి తెలుసు మల్లి అని వసుంధర అంటుంది. మేము హాస్పిటల్ కి రాకపోయినా ట్రీట్మెంట్ కి డబ్బులు కావాలి కదా అని శరత్ అంటాడు. వద్దు మా కష్టాలు ఏవో మేమే పడతాం అని మల్లి అంటుంది. నాన్న దగ్గర నుంచి డబ్బు తీసుకోవడానికి మా ఆయన ఎలా ఉంటాడో నీకు తెలుసు కదా ఆ మాటల్ని నాన్న నువ్వు స్వీకరించగలరా అని మల్లి అంటుంది. గౌతమ్ తో మించామని చెప్పొద్దు అని అరవింద్ అంటాడు. నా భర్త అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని మల్లి అంటుంది. ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పు అని మాలిని అంటుంది. ఇప్పటికే నా బ్రతుకంతా అబద్ధాలు అని మాట్లాడుతున్నారు ఇంకొక అబద్ధం చెప్పి తీసుకువెళ్లన అని మల్లి అంటుంది.నీకు ఇలాంటి పరిస్థితి వచ్చినా గాని మేము ఆదుకోలేని పరిస్థితి నిన్ను పూర్తిగా మేము వదిలేసినట్టయింది అని అరవింద్ అంటాడు. మీరు ఇలా మాట్లాడితే నామీద ఇంకా ఆశ పడుతున్నట్టు అనిపిస్తుంది అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode January 08 2024 Episode 541 Highlights
Malli Nindu Jabili Today Episode January 08 2024 Episode 541 Highlights

అరవింద్ ఎలాంటి వాడో తెలిసి కూడా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా అని శరత్ అంటాడు. మీరంతా నా గతం నా భర్త నా భవిష్యత్తు అనుకుంటున్నాను దయచేసి మీరు ఎవరు రావద్దు అని మల్లి వెళ్ళిపోతుంది. మల్లి నన్ను ఇలా నిందిస్తుందని అనుకోలేదు మామయ్య గారు అని అరవింద్ అంటాడు. ఏదో కోపంలో అలా అని ఉంటుందిలే అరవింద్ మల్లి కి నీ మీద మంచి ఉద్దేశమే ఉంది పరిస్థితుల వల్ల అలా అని ఉంటుది అని శరత్ అంటాడు. విన్నావా మాలిని మల్లి కి అరవింద్ మీద మంచి అభిప్రాయం ఉందంట అని వసుంధర అంటుంది. నువ్వేమీ బాధపడకు మీరా గౌతమ్ తిట్టినా సరే వీలు చూసుకుని నేను హాస్పిటల్ కి వెళ్ళొస్తాను అనే శరత్ అంటాడు.అరవింద్ రోజు రోజుకి మల్లి మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో చూసావు కదా వాళ్ళని మల్లి ని అని వసుంధర అంటుంది. గౌతమ్ కి ఎన్నిసార్లు చెప్పినా మల్లి మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నాడు అని మాలిని అనుకుంటుంది. కట్ చేస్తే, మల్లి ఇంటికి వస్తుంది అయ్యాయమ్మ నీ పెత్తనాలు అని కౌసల్య అంటుంది. మన ఐక్య న్యూస్ పేపర్ ఇంటర్ కాకముందు వేరే పేపర్లు రాజ్యమేలేవి కానీ మన పేపర్ వచ్చిన తరువాత అన్ని వెనక్కి తగ్గాయి అలాంటిది నా పేపర్ కాకుండా వేరే వాళ్ళ పేపర్ చదవాల్సి వస్తుంది అది కూడా వీల్ చైర్ లో కూర్చొని ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇవ్వాలి నా భార్య మనకి ఇవ్వాలి అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 08 2024 Episode 541 Highlights
Malli Nindu Jabili Today Episode January 08 2024 Episode 541 Highlights

అనుమానం ఏముంది మొత్తం క్రెడిట్ అంతా నీ భార్యకే ఇవ్వాలి ఇంత గొప్ప భార్య ఏ భర్తకి దొరకదు అని కౌసల్య ఎత్తిపోటు మాటలతో అంటుంది. ఏమండీ మీరు రెస్ట్ తీసుకోవాలి ఇదంతా అనవసరంగా ఎందుకు బాధపడతారు అని మల్లి ని అంటుంది. నువ్వు నా కళ్ళ ముందు ఉంటేనే నాకు పెద్ద బాధ వెళ్ళిపో అని గౌతమ్ అంటాడు. చెప్పింది అర్థమైంది కదా వెళ్ళుఅని కౌసల్య అంటుంది.నీకు జ్యూస్ తీసుకొస్తాను ఉండు అని మల్లి వెళ్ళిపోతుంది. రాత్రి పగలు నా జీవితంలో మూడు జరుగుతయి అని అనుకోలేదమ్మా నన్ను ప్రాణంగా ప్రేమించిన స్వప్న ను కాదని వేరే దాన్ని పెళ్లి చేసుకోవడం సంపాదించిన ఆస్తినంత ఒక్కరోజులోనే పోగొట్టుకోవడం ఏ రకంగా సరిపడని ఆడదానిమీద ఆధారపడడం ఇలా మూడు దెబ్బ మీద దెబ్బ కొట్టాయి అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode January 08 2024 Episode 541 Highlights
Malli Nindu Jabili Today Episode January 08 2024 Episode 541 Highlights

ఆధారపడ్డామని అనుకోవద్దు గౌతమ్ రాయిని తీసుకువచ్చి రత్నంలా మార్చావు ఆ రుణం తీర్చుకోవాలంటే తను ఎంత కష్టపడినా తీర్చుకోలేదు కుటుంబాన్ని ఎలా పోషిస్తుందో చూద్దాం ఇందులో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు మీ హాస్పిటల్ ఖర్చు కి కూడా డబ్బులు కావాలి కదా అవి ఎలా తీసుకొస్తుందో చూద్దాం అని కౌసల్య అంటుంది. మనసు మెలిపెట్టినట్టు అవుతుందా వదిన అమ్మగాని అన్నయ్యగాని ఇంతవరకు ఎవరిని బాధ పెట్టింది లేదు నిన్ను చాలా మాటలు అంటున్నారు అని నిలిమ అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N