NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Ayodhya Temple Inauguration: నెరవేరిన 500 ఏళ్ల నాటి శపథం .. తలపాగా, చెప్పులు ధరించనున్న సూర్యవంశ క్షత్రియులు

Ayodhya Temple Inauguration: అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్దమవుతోంది. ఈ నెల 22వ తేదీ రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అదే రోజున మరో కీలక ఘట్టం ఆవిష్కరణ అవుతోంది. అయోధ్య చుట్టుపక్కల ఉన్న 105 గ్రామాలకు చెందిన సూర్యవంశ క్షత్రియుల శపథం నెరవేరనుంది. రామ జన్మభూమి చుట్టుపక్కల ఉన్న లక్షన్నర మంది సూర్యవంశ క్షత్రియులు 500 ఏళ్ల తర్వాత తలపాగా, చెప్పులు ధరించనున్నారు.

16వ శతాబ్దంలో మొఘలుల దండయాత్ర సమయంలో రామ మందిరం కూల్చివేశారు. ఆ సమయంలో వారిని అడ్డుకునేందుకు సూర్యవంశ క్షత్రియులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారు. సాహసోపేతంగా పోరాడినప్పటికీ వారు ఆలయ కూల్చివేతను అడ్డుకోలేకపోయారు. దీంతో మనస్థాపానికి గురైన వారంతా అదే మందిరాన్ని కూల్చిన చోట కొత్త గుడి కట్టే వరకూ తలపాగా ధరించమని, గొడుగులు వాడమని, కాళ్లకు చెప్పులు వేసుకోబోమని ప్రతిజ్ఞ చేసారు.

గత 500 ఏళ్ల నుండి వీరు తమ ఇంట వివాహం, వేడుకలతో పాటు ఎటువంటి సమయంలో కూడా తలపాగా ధరించలేదు సూర్యవంశ క్షత్రియులు. తమ పూర్వికులు చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి, వారి వారసులు కూడా గత అయిదు దశాబ్దాలుగా వివాహ సందర్భాలలో కూడా చెప్పులు, తలపాగా, గొడుగు ధరించకుండానే జీవనం సాగించారు. 2019 లో సుప్రీం కోర్టు రామమందిరంకు అనుకూలంగా తీర్పు వచ్చిన నాటి నుండి 105 గ్రామాల్లోని సూర్యవంశ క్షత్రియులు సంతోషంగా రామమందిర నిర్మాణం కోసం ఎదురుచూపులు చూస్తూ వచ్చారు.

22 జనవరి 2024 న రామందిరం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో అయిదు దశాబ్దాల శపథం నేరవేరనుండటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు నుండి సూర్యవంశ క్షత్రియులు తలపాగా, కాళ్లకు చెప్పులు వేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అయోధ్య చుట్టుపక్కల ఉన్న 105 గ్రామాల్లోని సూర్యవంశ క్షత్రియులకు రామమందిర ప్రారంభోత్సవం రోజున ధరించేందుకు కొత్త తలపాగాలు తయారు చేసి గ్రామాల వారీగా పంపిణీ చేస్తున్నారు.

ఈ  నెల 22న అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరుగనున్న రామమందిరంలో ప్రాణ ప్రతిష్టా మహోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దాస్ సహా వేలాది మంది ప్రముఖులు హజరు కానున్నారు. ట్రస్ ప్రతినిధులు దేశ వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల మందికిపైగా ప్రముఖులు, సెలబ్రిటీలు ఆహ్వానాలు పంపిస్తున్నారు.

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు .. దోషుల క్షమాబిక్ష రద్దు

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N