Malli Nindu Jabili November 04 episode 486: నీ లైఫ్ లో ఉండాల్సింది నేను ఆ మల్లి కాదు అని మాలిని అంటుంది. మనసులో నువ్వు తప్ప వేరే అమ్మాయికి చోటు లేదు అని అంటున్నా అరవింద్.ఎన్నిసార్లు చెప్తావు అరవింద్ నీకు ఆ మాట చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదా అని మాలిని అంటుంది. నిజం చెప్పడానికి నాకు సిగ్గు ఎందుకు మాలిని అని అరవింద్ అంటాడు. కట్ చేస్తే, మల్లికి చీర కట్టుకొని చింగులు సరిగ్గా పోసుకోవడం రాకపోతే నేను పెడతాను చింగులు అని గౌతమ్ సరి చేస్తాడు. ఇంతలో అరవింద్ మల్లికి ఫోన్ చేస్తాడు.ఎవరు మల్లి ఫోన్ ఇప్పుడు చేస్తున్నారు అని గౌతమ్ అంటాడు. అరవింద్ సార్ చేస్తున్నారండి అని మల్లి అంటుంది. ఎందుకు చేస్తున్నాడో ఏమో మాట్లాడు ఆఫీసులో ఏమైనా వర్క్ మిగిలిపోయిందా అని గౌతమ్ అంటాడు. పర్వాలేదండి నేను చూసుకుంటాను పదండి అని మల్లి అంటుంది.

కట్ చేస్తే, అందరూ నేలకొండపల్లి వెళ్లడానికి ఒక దగ్గర మీట్ అవుతారు. గౌతమ్ ఈవిడ నా మరదలు వనజాక్షి అని శరత్ అంటాడు. నా గురించి నేనే చెప్పుకుంటా బావా నువ్వు ఆగు అని వనజాక్షి నా పేరు వరంగల్ వనజాక్షి వరంగల్లో వేయి స్తంభాల గుడి ఎంత ఫేమస్ నేను అంతే మీ అందరి గురించి నాకు తెలుసు అని వనజాక్షి అంటుంది. వనజాక్షి అతను గౌతమ్ మల్లి భర్త అని శరత్ అంటాడు. నా గురించి నేను చెప్పుకుంటాను మామయ్య మీరు ఆగండి అని గౌతమ్ నా పేరు గౌతమ్ నంద హైదరాబాదులో నా గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు అని గౌతమ్ అంటాడు.

ఇగో మిల్క్ బాయ్ మల్లిని నువ్వు పెళ్లి చేసుకోకన్న ముందే అరవింద్ దగ్గర అని వనజాక్షి చెప్పబోతుండగా అత్తయ్య ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అని అరవింద్ అంటాడు. ఏంటండీ ఏదో చెప్పబోయి ఆగిపోయారు చెప్పండి అని నీలిమ అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు మనం నేలకొండపల్లి వెళ్దాం పదండి అని శరత్ అంటాడు. పదండి మా అన్నయ్య మల్లి వదినకు అక్కడ ఏం సప్రైజ్ చేశాడో నేను చూడాలి చాలా ఎక్సైట్ గా ఉంది అని నీలిమ అంటుంది. మల్లి మాత్రం వనజాక్షిని చూస్తూ ఈవిడ గొంతు ఫోన్లో విన్నట్టుంది ఈవిడేనా నాకు ఫోన్ చేసి బెదిరించింది అని తన వైపు చూస్తూ కారు ఎక్కుతుంది.

ఈ బిడ్డకి నేనెవరో తెలిసిపోయినట్టుంది అందుకే నా వైపు అలా చూస్తుంది అని వనజాక్షి తన మనసులో అనుకుంటుంది. భగవంతుడా మల్లి గురించి నిజాలు తెలియకుండా చేయి అని మీరా తన మనసులో అనుకుంటుంది. నేను అక్కడికి ఎందుకు వస్తున్నాను అని ప్రతి క్షణం టెన్షన్ పడుతూ చావాలి మా అక్కను నువ్వు బాధ పెడతావా నీ సంగతి చూస్తానే అని వనజాక్షి అనుకుంటుంది. కట్ చేస్తే,మల్లి మీ ఊరు అందాలను చూసి ఆనందిస్తున్నావా మన పెళ్లయినాక మొదటిసారి మీ ఊరికి వస్తున్నాము చాలా ఆనందిస్తున్నావు అనుకుంటా అని గౌతమ్ అంటాడు. అందరూ నేలకొండపల్లి వస్తారు. కారు దిగి కాలు కింద పెడుతూ వనజాక్షి మల్లి ఇక నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనుకుంటూ వెళ్తుంది వనజాక్షి. ఊళ్లో వాళ్ళందరూ హారతి పట్టుకొని మల్లి వాళ్లకోసం ఎదురు చూస్తూ ఉంటారు.

అందరూ తెలిసిన వాళ్ళే నిలబడ్డారు అమ్మ పోలేరమ్మ ఇక్కడికి ఎట్లా వచ్చినామో అట్లనే పోయేటట్టు చూడు తల్లి అని మీరా తన మనసులో అనుకుంటుంది.బిడ్డ బతుకు బాగుండాలని అమ్మవారికి దండం పెట్టుకుంటున్నావా? నేను ఊరుకోనుగా అని వనజాక్షి తన మనసులో అనుకుంటుంది. మీరా అల్లుడ్ని కూతుర్ని చూడాలని మన ఊర్లో వాళ్ళందరూ ఎదురుచూస్తున్నారు అని అక్కడికి వచ్చిన అతను అంటాడు. అల్లుడు కూతురు అంటున్నారు ఎవరెవరు అని వనజాక్షి అంటుంది.అలా అంటారేంటమ్మ గారు మల్లిని చేసుకున్న బాబు గారు అని అక్కడికి వచ్చిన ఆవిడ హారతి తీస్తుంది. ఆ ఇంటి పెద్దాయన రండి బాబు గారు లోపలికి వెళ్దాము అని అంటాడు. ఆగండి అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాము అని నీలిమ ఫోటో తీస్తుంది.

అరవింద్ నీ టీం తీసుకుని ఇక్కడికి రా అందరం కలిసి ప్రోగ్రాం చేద్దాము అని గౌతమ్ అంటాడు. ఈడికెళ్లి బయలుదేరే లోపు తల్లి బిడ్డలకు సమాధి కట్టిస్తా అని వనజాక్షి తన మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే, మల్లి నీ గురించి అమ్మ అంతా చెప్పింది ఇప్పుడు గౌతమ్ బాబుకి నిజం తెలిస్తే నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు అని జగదాంబ అంటుంది.అందరూ ఇక్కడే ఉన్నారు ఎవరు నోట్లో నుంచి ఏ మాట బయటికి వెళ్లిన మల్లి బ్రతుకు బండలైపోతుంది అని మీరా బాధపడుతుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Pawan Kalyan: NTR అభిమాని సినిమా ఓపెనింగ్ కి వెళ్లి క్లాప్ కొట్టిన పవర్ స్టార్!