NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru November Episode 66: చంగయ్య కి తెలియకుండా ఇంట్లో నే ఉద్యోగాలు చేద్దామంటున్న గంగ…

Mamagaru Today Episode November 27 2023 Episode 66 Highlights

Mamagaru November Episode 66:  నువ్వు సంపాదిస్తానంటే నేనొద్దంటానా అని చెంగయ్య అంటాడు. ఒక ట్యూషన్ సెంటర్ పెడదాము నాన్న మన ఇంట్లో అని అంటాడు వాళ్ళ కొడుకు.ట్యూషన్ ఎవరు చెప్తారు పొద్దున నేను సాయంత్రం వచ్చాక నువ్వు చెప్తావా అని అంటాడు చెంగయ్య. ప్రొఫెషనల్ ని పిలిపిద్దాము మా వద్ద నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారని బోర్డు పెడదాము నాన్న అని అంటాడు. ఎవరు ఆ నిష్ణాతులైన అధ్యాపకులు అని అడుగుతాడు చంగయ్య. మా ఫ్రెండ్ సురేష్ ఉన్నాడు నాన్న వాడు అద్భుతంగా చెబుతాడు అని అంటాడు చెంగయ్య వాళ్ళ కొడుకు. అలాగే మన శ్రీలక్ష్మి అద్భుతంగా మూడు నాలుగు సబ్జెక్టు లు ఈజీగా చెప్పేస్తుంది కదా అని అంటాడు. సంపాదించాలన్న ఆలోచన నీకు ఇంత త్వరగాఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయాను అలాగే సంతోషిస్తున్నాను.

Mamagaru Today Episode November 27 2023 Episode 66 Highlights
Mamagaru Today Episode November 27 2023 Episode 66 Highlights

హనుమంతుడి ముందట కుప్పిగంతులా పుత్ర అని అంటాడు. ఎందుకు నాన్న అలా అంటున్నావ్ అని అంటాడు వాళ్ళ కొడుకు. ట్యూషన్ పెట్టాలి అన్న ఆలోచన రద్దు చేస్తున్నాను ఇక నువ్ వెళ్తే నా లెక్కలు నేను చేసుకుంటాను అని అంటాడు చెంగయ్య. నాన్న ప్రాబ్లం ఏంటి డబ్బులు వస్తున్నాయి కదా అని అడుగుతాడు వాళ్ళ కొడుకు. శ్రీలక్ష్మి ట్యూషన్ చెప్తుంది డబ్బులు వస్తాయి నీకు ఇస్తుంది నువ్వు తెచ్చి నాకు ఇస్తావు అప్పుడు శ్రీలక్ష్మి నా కష్టాన్ని మా ఆయన మా మామయ్యకు ఇస్తున్నాడు అని అనుకుంటుంది కొన్నాళ్ళకు మా నా కష్టాన్ని మా మామయ్య దోచుకుంటున్నాడు అని అనుకుంటుంది ఆ తర్వాత ఏదో ఆలోచన ఇంకేదో తిరుగుబాటు ఇవన్నీ జరుగుతాయి పాండురంగ అని అంటాడు చెంగయ్య.

Mamagaru Today Episode November 27 2023 Episode 66 Highlights
Mamagaru Today Episode November 27 2023 Episode 66 Highlights

ఆడవాళ్లు సంపాదన కోసం అడుగు బయట పెట్టకూడదని నేను ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాను అది తూచా తప్పకుండా అమలు చేయాల్సిందే, ఏ రకంగా సంపాదించిన సరే డబ్బు చేతికొచ్చాక మనసు మారుతుంది ఆలోచనలు మారుతాయి అహం పెరుగుతుంది అంతా నేనే అనుకుంటారు వెళ్లి పని చూసుకో పోరా అని అంటాడు చెంగయ్య.కట్ చేస్తే,గంగ గంగాధర్ కలిసి బైక్ మీద ఇంటికి వెళ్తూ ఉంటారు.అక్కడ ఊళ్లో వాళ్ళు గంగ దగ్గరికి వచ్చి ఏంటి గంగ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవు అప్పుడేమో డబ్బులు కడతానని చెప్పావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావ్ ఏంటి అని అడుగుతాడు. మీ నెంబర్ నా దగ్గర లేదండి నాకు తెలియని నెంబరు కదా అని నేను ఫోన్ ఎత్తలేదు అండి అని గంగ అంటుంది. పంచాయతీలో మీ మామగారిని ఎదిరించి చెప్పావు అలాంటప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వాలి కదమ్మా అని అంటాడు. మీకు అవసరం అని మీరు తీసుకున్నారు కానీ మాకు కూడా అవసరం ఉంటాయి కదా అమ్మ మా బాకీ తీర్చమ్మ అని అంటాడు. ఎప్పుడిస్తావో చెప్పమ్మ అని అంటారు అందరూ. మా పరిస్థితి ఎలా ఉందంటే వరిగడ్డిలో సూది వేసి వెతుక్కుంటున్నట్టు ఉంది అని అంటారు.

Mamagaru Today Episode November 27 2023 Episode 66 Highlights
Mamagaru Today Episode November 27 2023 Episode 66 Highlights

మేము మీకు డబ్బులు ఇచ్చి మేము బ్రతిమిలాడడం ఏంటమ్మా.వచ్చే నెల నుంచి తల ఒకరికి 20,000 ఇస్తాము అని గంగాధర్ చెప్తాడు. బాబు మాటిచ్చారు వాయిదాలు వేయొద్దు అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకండీ అలా మాటిచ్చారు అని గంగ అడుగుతుంది. గంగ రోడ్డు మీద అందరూ నిన్ను అలా అడుగుతుంటే నేను చూడలేక వాళ్ళ మాటిచ్చాను అని అంటాడు గంగాధర్. నువ్వు భయపడకు గంగ నేను చూసుకుంటాను కదా అని అంటాడు గంగాధర్.కట్ చేస్తే,గంగ గంగాధర్ కలిసివాళ్ళ బావతో వాళ్ళ అక్కలతో మాట్లాడుతూ ఉంటుంది. అక్కలు నేను కలిసి ఆన్లైన్ వరకు చేయాలి అని చెప్తుంది. అదంతా కుదరని పని అని పాండురంగ అంటాడు. కుదరడం కుదరక పోవడం పక్కన పెడితే నాన ఒప్పుకోవాలి కదా అని అంటాడు వాళ్ళ అన్నయ్య.

Mamagaru Today Episode November 27 2023 Episode 66 Highlights
Mamagaru Today Episode November 27 2023 Episode 66 Highlights

ఇదంతా నాన్నకి తెలియకుండా చేయాలి అని గంగాధర్ అంటాడు. నేను ఫ్రీలాన్సర్ లో జాబ్ వెతుక్కుంటాను మీరు ఆన్లైన్లో ట్యూషన్ చెప్పొచ్చు అని అంటుంది గంగ. బాగుంది గంగ కానీ ఇలాంటి వర్కులన్నీ ఎలా అప్లై చేయాలి అని అడుగుతుంది శ్రీలక్ష్మి. నాన్నకి తెలియకుండా ఏ పని చేయలేము అని వాళ్ళ పెద్దన్నయ్య అంటాడు. ఎప్పుడో ఒకప్పుడు ధైర్యం చేయాలి కదా అన్నయ్య అని గంగాధర్ చెప్తాడు.

Mamagaru Today Episode November 27 2023 Episode 66 Highlights
Mamagaru Today Episode November 27 2023 Episode 66 Highlights

మా వల్ల కాదురా అని అంటాడు వాళ్ళ అన్నయ్య. వీళ్ళు భయపడుతున్నారో లేక మనల్ని భయపెడుతున్నారు తెలియదు కానీ వీళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము గంగ అని వసంత అంటుంది. మీరేమంటారు అత్తయ్య అని శ్రీలక్ష్మి అడుగుతుంది. మిమ్మల్ని మీ మామయ్య మిమ్మల్ని పనిచేయొద్దు అంటున్నా మీరు ఆయనని ఎక్కడ తిట్టుకోవడం లేదు నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు తెలిసి మీ పనులు మీరు చేసుకోవడంలో తప్పేమీ లేదనిపిస్తుంది అని అంటుంది దేవమ్మ. ఆయనకి తెలిసి చేస్తారా తెలియకుండా చేస్తారా పక్కన పెట్టండి, అసలు పనులు చేస్తారా లేదా అని మీ భార్య భర్తలు మాట్లాడుకోండి అని అంటుంది. ఎంతకాలం మీ భార్యలని అణిగిమనిగి ఉంచుతారు ఎంతకాలం వాళ్ళ జ్ఞానాన్ని అలా  అణగదొక్కుకోమంటారు,ఇప్పటికైనా మించి పోయింది లేదు ఆన్లైన్ జాబ్ చేయనివ్వండి అని అంటుంది దేవమ్మ. సరే మేము ఒప్పుకుంటున్నాము అని అందరూ అంటారు. గంగ అందరి రెస్యూమ్ తోని జాబ్ కి అప్లై చేస్తు ఉంటుంది . ఇంతలో చెంగయ్య వాళ్ళున్న గది తలుపు కొడతాడు.

Related posts

Nindu Noorella Saavasam February 23 2024 Episode 167: భాగమతిని ముద్దు పెట్టుకోబోతున్న అమరేంద్ర, నగ ముట్టుకోవద్దుని బెదిరించిన అరుంధతి.

siddhu

Kumkuma Puvvu February 23 2024 Episode 2112: అంజలి బంటి ఇద్దరూ శాంభవి కి దొరికిపోతారా లేదా.

siddhu

Guppedantha Manasu February 23  2024 Episode 1007: వసుధారను కాలేజ్ నుండి పంపించడానికి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Madhuranagarilo February 23 2024 Episode 295: శోభనానికి ముహూర్తం పెట్టిన గురువుగారు, శోభనానికి ఏర్పాటు చేస్తున్న మధుర..

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ కి జోడిగా నటించబోతున్న కంగనా..?

sekhar

Kalki 2898 AD: ప్రభాస్ “కల్కి 2898 AD” సినిమా టీజర్ ఫుల్ రన్ టైం వివరాలు…?

sekhar

Paluke Bangaramayenaa February 23 2024 Episode 159: విశాల్ కి బేయిల్ ఇవ్వడానికి వచ్చిన బాబ్జి, జైల్లో ఉన్న వైజయంతిని పలకరిస్తున్న స్వర..

siddhu

Soundarya: మహేష్ – సౌందర్య కాంబోలో ఒక్క సినిమా కూడా రాకపోవడానికి కారణం ఇదేనా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Jagadhatri February 23 2024 Episode 161:  యువరాజ్ బాంబ్ పెట్టాడని తెలుసుకున్న జగదాత్రి ఏం చేయనున్నది.

siddhu

Shanmukh: షణ్ముఖ్ అరెస్టుపై స్పందించిన గీతు – ధనుష్… అసలు గుట్టు రివిల్ (video)..!

Saranya Koduri

Chiranjeevi: ” విశ్వంభరా ” సెట్స్ లో జాయిన్ అయిన ఇద్దరు బ్యూటీస్.. ఊచకోత స్టార్ట్..!

Saranya Koduri

Malli Nindu Jabili February 23 2024 Episode 580: అరవింద్ లేని జీవితం నాకు అక్కర్లేదు చచ్చిపోతాను అంటున్న మాలిని..

siddhu

Trinayani February 23 2024 Episode 1171: విష ప్రయోగం జరిగితే అందరూ నిన్నే అనుమానిస్తారు నైని అంటున్న విశాల్, సుమనని అనుమానిస్తున్న విక్రాంత్..

siddhu

Sri Leela: పూజ హెగ్డే, రష్మిక అడుగుజాడల్లో శ్రీ లీల.. పెద్ద ప్లానేగా..!

Saranya Koduri

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar