Entertainment News సినిమా

నాగార్జున `ది ఘోస్ట్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ లాక్‌.. ఇంత‌కీ ఎక్క‌డో తెలుసా?

Share

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్ర‌మే `ది ఘోస్ట్‌`. ప్రవీణ్‌ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్ న‌టి గుల్ ప‌నాగ్‌, అనిఖా సురేంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైంది. భ‌ర‌త్-సౌరభ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌గా ప‌నిచేస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌ ప‌నుల‌ను సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ద‌స‌రా పండ‌గ కానుక‌గా అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే `ది ఘోస్ట్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మేక‌ర్స్‌ డేట్ లాక్ చేశారు.

సెప్టెంబ‌ర్ 25న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌బోతోంది. క‌ర్నూలులోని ఎస్‌టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్‌ను సాయంత్రం 6 గంట‌ల నుంచి అట్ట‌హాసంగా నిర్వ‌హించ‌బోతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు స్పెష‌ల్ గెస్ట్ ఎవ‌రు అన్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.


Share

Related posts

SaiPallavi Shyam Singarai: కాళికాదేవి గా సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ అదిరింది..!!

bharani jella

Venu sriram : వేణు శ్రీరామ్ నిజంగానే అలా అయిపోతాడా..?

GRK

క్లియర్ కట్ ఇన్‌ఫర్మేషన్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇక అలాంటి రూమర్స్ కి నో ఛాన్స్ ..?

GRK