NewsOrbit
Entertainment News సినిమా

మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు నాని గ్రీన్ సిగ్న‌ల్‌.. ఇంకో హీరో ఎవ‌రో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని ఇటీవ‌లె `అంటే.. సుంద‌రానికీ`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. టాక్ బాగున్నా.. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ మూవీ హిట్ అవ్వ‌లేదు. ఓటీటీలో మాత్రం సూప‌ర్ స‌క్సెస్ అయింది. ప్ర‌స్తుతం నాని `ద‌స‌రా` అనే మూవీ చేస్తున్నాడు. ఓట్ అండ్ ఓట్ మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న చిద్ర‌మిది.

ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెలా దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌గా.. జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.శ‌ర‌వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం.. త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. నాని తాజాగా ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. నానికి మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు ఏమీ కొత్త కాదు.

గ‌తంలో నిన్నుకోరి, దేవ‌దాసు, వి ఇలా ప‌లు మ‌ల్టీస్టార‌ర్స్ చేసిన నాని.. ఇప్పుడు మ‌రో చిత్రానికి ఓకే చెప్పాడ‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. `సూరారై పొట్రు(తెలుగులో ఆకాశం నీ హద్దురా)` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కురాలు సుధ కొంగరతో `కేజీఎఫ్‌`ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఓ మూవీ చేయ‌బోతోంది.

ఇందులో కోలీవుడ్ స్టార్ సూర్య‌, మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోలుగా న‌టించ‌బోతున్నారు. అయితే ఇందులో మ‌రో హీరో పాత్ర కూడా ఉంటుంద‌ట‌. ఆ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ నానీని సంప్ర‌దించి క‌థ చెప్ప‌గా.. అది న‌చ్చ‌డంతో ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పిన‌ట్లు ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతేకాదు, త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేయ‌నున్నార‌ట‌. మ‌రి ఆ ప్ర‌క‌ట‌న వ‌స్తే గానీ.. ఈ వార్త ఎంత నిజ‌మో తెలియ‌దు.

author avatar
kavya N

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N