Nuvvu nenu prema: నిన్నటి ఎపిసోడ్ లో కుచల అను నీ అవమానిస్తుంది. కృష్ణ తన పథకంతో కుచులని ఇంకా రెచ్చగొడతాడు. చివరికి ఆర్య అను ని కాపాడుతాడు. దానికి కూడా కుచల అక్క చెల్లెలు ఇద్దరినీ కలిపి తిడుతుంది.

ఈరోజు 407 ఎపిసోడ్ లో,పద్మావతి విక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా టైం తర్వాత విక్కీ వచ్చి నాకోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు నువ్వు పడుకోవచ్చు కదా, నన్ను ఇంప్రెస్ చేయాలని చూసి నా భారీ స్థానాన్ని పొందాలనుకుంటున్నావేమో అది ఎప్పటికీ జరగదు అని చెప్తాడు విక్కి. ఏదో నేను మీ రూమ్ లో ఉంటున్నాను కదా అని మీరు ఇంకా రాలేదని కంగారు పడ్డాను మీరంటే నాకేం ప్రేమ లేదు అని అంటుంది పద్మావతి. నువ్వు ఈ ఆరు నెలలు మాత్రమే నా భార్యవి తర్వాత నీ దారి నువ్వు చూసుకోవచ్చు అని అంటాడు విక్కి పద్మావతి వికీ ఇద్దరు పడుకున్న తర్వాత పద్మావతి విక్కీ కాలికి గాయాన్ని చూసి, మందు రాద్దామని వెళ్లగా నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను టచ్ చేయొద్దని అయినా నువ్వు నన్ను అంత ఇంప్రెస్ చేసిన నేను మాత్రంనిన్ను భార్య గా అంగీకరించను అని చెప్తాడు. మీ కాలికి దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటే సాటి మనిషిగా సహాయం చేద్దాం అనుకున్నాను మీరు దాన్ని కూడా అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. నువ్వు ఎలా పోతే నాకేంటి అని పడుకుంటుంది.
Nuvvu Nenu prema: అను ని కాపాడిన ఆర్యా..మరోసారి ఫెయిల్ అయిన కృష్ణ ప్లాన్.

అనుని అవమానించిన కుచల..
అరవింద వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా కుచల వచ్చి నువ్వు ఎందుకు అరవిందా ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నావు చేయడానికి తోడేలు ఉన్నారు కదా అని అంటుంది. వెంటనే అరవిందా ఏమన్నారు పిన్ని అని అంటుంది అదే అరవింద తోడుకోడలు ఉన్నారు కదా అక్క చెల్లెలు వాళ్ళు చేస్తారులే నువ్వెందుకు కడుపుతో ఉండి కష్టపడతావు అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ నేను అదే చెప్తున్నాను అత్తయ్య కానీ అరవింద వింటేనే కదా అని అంటాడు. అప్పుడే అక్కడికి అను వచ్చి ఏర్పాట్లన్నీ చేశాను అరవింద్ గారు ఇంకా ఏమన్నా పనులు ఉన్నాయా అని అంటుంది ఇంకా ఏం లేవు అను మీరు వెళ్లి రెడీ అవ్వండి అని అంటుంది. అనుని పిలిచి మీ ఇంటి నుంచి వెండి ప్రతిమ తీసుకురావాలి కదా వచ్చిందా అంటుంది. అరవింద వెండి ప్రతిమ ఏంటి పిన్ని ఇదే కదా ఇప్పుడు మనం చేసేది పూజ అని అంటుంది. అదేంటి అరవిందా నువ్వు మర్చిపోయావా మనకి 16 రోజుల పండగ రోజు ఈ అక్కాచెల్లెళ్ళు వన్ ప్లస్ ఆఫర్ కింద మన ఇంటికి వచ్చారే కానీ ఏమీ ఇవ్వలేదు అని అన్నదానికి వాళ్ళ అమ్మ వెండి ప్రతిమిస్తాను మీ ఇంటి అనవయితీ ప్రకారం పెట్టుకోండి అని అన్నది కదా అని అంటుంది.

అవును పిన్ని మర్చిపోయాను మీరు అన్నదే కరెక్టు అని అంటుంది అరవింద అప్పుడు అను మా అమ్మ వస్తూ వస్తూ తీసుకొస్తున్నానండి వ్రతానికి అని అంటుంది ఓహో మీ అమ్మ వచ్చి మూడు పూటలా తినడానికి వ్రతం పేరు చెప్పుకొని అని అవమానిస్తుంది కుచల వెంటనే అరవిందా ఏంటి పిన్ని అలా మాట్లాడతారు అంటే అదే అరవింద నేనేం తప్పుగా అనట్లేదు. వాళ్ళ అమ్మ వచ్చి మూడు పూటలా వాళ్ళ పిల్లల్ని ప్రేమగా చూసుకొని వెళుతుంది కదా అలా అన్నాను అంతే అని అంటుంది. దానికి అను చాలా బాధపడుతుంది ఇంకా కుచలా ఫోన్ వచ్చిందని పక్కకు వెళ్ళగానే అరవింద పిన్ని మాటలు నువ్వు ఏం పట్టించుకోకు, నువ్వు వెళ్లి రెడీ అయ్యారా అని అంటుంది. అక్కడే ఉన్న కృష్ణ ఎలా ఈ ప్రపంచం చెడగొట్టాలి వికీ పద్మావతిని ఎలా విడదీయాలో అని అనుకుంటే టయానికి మంచి ఐడియా ఇచ్చింది. ఇప్పుడు ఆ వ్రతం చెడగొట్టడానికి ఆ వెండి ప్రతిమ లేకపోతే ఈ వ్రతం ఆగిపోతుంది కాబట్టి ఎలాగైనా సరే పధకం ప్రకారం ఆ వెండి ప్రతిమని
ఈ ఇంటికి రాకుండా చేయాలి ఈ వ్రతం ఆగిపోవాలి దానికి నేను ఇప్పుడే ఏర్పాటు చేయాలి అని మనసులో అనుకుంటాడు కృష్ణ.
Krishna mukunda Murari: రేవతికి వార్నింగ్ ఇచ్చిన ముకుంద..మురారి తోనే ముకుంద నిజం చెప్పించనుందా?

విక్కీ పద్మావతిల గొడవ..
పద్మావతి వ్రతానికి రెడీ అవుతూ ఉంటుంది విక్కీ అక్కడే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఈలోపు అనుకోకుండా పద్మావతి తల తుడుచుకుంటూ నీళ్లు దాని మీద పడతాయి నీకు ఎన్ని సార్లు చెప్పాను.నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇది నీ ఇల్లు కాదు అని అరుస్తాడు. దూరంగా వెళ్డమని అయినా కానీ ఇక్కడే ఉంటావు అని అంటాడు. ఇంతలో నీళ్లు మీద పడితే నేను తుడుస్తాను ఉండండి అని అంటుంది ఏం అక్కర్లేదు అని అంటాడు విక్కి.పోనీలే పాపం నీవు అనుకున్నాను కదా దానికి నిజంగా నాకు బుద్ధి లేదు అని అంటుంది పద్మావతి. పద్మావతి జుట్టు విక్కీ బటన్ కి పట్టుకుంటుంది. అది చూసుకోకుండా పద్మావతి టెంపరడ ఎందుకు నా జుట్టు పెట్టుకున్నావు అంటుంది. బటన్ కి పట్టుకుంటే నేను చేశాను అని అనుకుంటావు. నేనేమన్నా కావాలని చేశాను అని అంటుంది. బటన్ లో నుంచి హెయిర్ తీసేయ్ అని అరుస్తాడు తీసేదాకా ఆగలేరా ఎందుకు అరుస్తారు అంటుంది పద్మావతి. ఎంతసేపు తీస్తావు తీ అని అంటాడు విక్కీ కనబడట్లేదా తీయాలనే కదా చూస్తుంది.నేను తీస్తా ఉండని విక్కీ ట్రై చేస్తాడు కానీ విక్కీకి రాదు.

పద్మావతి మళ్లీ నేనే ట్రై చేస్తాను మీరు అడగకుండా ఉండండి అని అంటుంది. నీవల్ల ఏది కాదు గాని అని విక్కి సీజర్ తీసుకొని ఈ జుట్టును కట్ చేసేసాను అనుకో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటాడు సార్ ఏంటి మీ ముష్టి బటన్ కోసం నా జుట్టును కట్ చేస్తారా చిన్నప్పటి నుంచి ఎంతో ప్రాణంగా చూసుకున్నాను నా జుట్టుని, మీరు ఒక్క నిమిషం గమ్మున ఉండండి నేనే తీస్తాను అని అంటుంది. ఈ జుట్టు వచ్చేలా లేదు గానీ మీ బటన్ కట్ చేసుకోండి అని అంటుంది నా బటన్ ఎందుకు కట్ చేసుకుంటే చెక్కుకుంది నీ జుట్టు అయితే, నీ జుట్టునే కట్ చేస్తాను అని అంటాడు. నీకు ఒక్క నిమిషం టైం ఇస్తాను నువ్వు తీయకపోతే నువ్వు ఎంత అరిచి గీపెట్టేడ్ చిన్న నేను మాత్రం జుట్టు కట్ చేస్తాను. విక్కీ షర్ట్ తీసి పద్మావతికి ఇచ్చేసి ఇప్పుడు కూర్చుని మెల్లిగా తియ్యి అని అంటాడు. ఇదేదో ముందే చేయొచ్చు కదా అని అంటుంది. ఇప్పుడు నువ్వు రెడీ అవ్వాలి కదా నీ నటనతో అందరి ముందు మార్కులు కొట్టేయాలి కదా, అని అంటాడు. ఈ నటన మీరు నేర్పించింది కదా, మీ కన్నా ఎవరు బాగా నటించలేరు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు బానే మాట్లాడతావు ముందుచెప్పిన పని చెయ్,అని అంటాడు విక్కీ.పద్మావతి విక్కి కి షర్ట్ ఇచ్చేసి రెడీ అవుతూ ఉంటుంది.
Bramhamudi: కావ్య ని పుట్టింటికి వెళ్లకుండా చేసేందుకు రాజ్ ప్రయత్నాలు..చివరికి ఏమైందంటే!

పద్మావతి మీద పార్వతి ప్రేమ.
అను రెడీ అవుతూ ఉండగా వాళ్ళమ్మ పార్వతి అను కి ఫోన్ చేస్తుంది. పద్మావతి నువ్వు ఎలా ఉన్నారు అని అంటుంది బానే ఉన్నాము అంటుంది అను పద్మావతి ఏమన్నా బాధ పడుతుందా అని అంటుంది. తనెందుకు బాధపడుతుంది అమ్మ నాయన మాట్లాడలేదు అన్న ఒక బాధ తప్పితే అన్ని బానే ఉన్నాయి. నిజం చెప్పు తను నిజంగానే బాధపడకుండా ఉందా అని అంటుంది పార్వతి నిజంగా చెప్తున్నాను అమ్మ చెల్లికి ఏమన్నా అయితే నాకు తెలుస్తుంది కదా, ఎందుకమ్మా అన్ని సార్లు అడుగుతున్నావ్ పద్మావతి గురించి అని అంటుంది పార్వతి. అంటే పద్మావతి ఒక్కతే మనసులో బాధపడుతుంది కదా అని అనుకుంటుంది పార్వతి. ఏం లేదమ్మా పద్మావతి చిన్నపిల్లలాగా ఇంకా ఏమన్నా అల్లరి చేస్తుందేమో అక్కడ ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని అడుగుతున్నా అంటుంది పార్వతి ఏం లేదమ్మా తను బానే ఉంది వాళ్ళ భర్తతో సంతోషంగా ఉంది అని అంటుంది అను అమ్మ వచ్చేటప్పుడు వెండి ప్రతిని తీసుకురావడం మర్చిపోవద్దు అని అంటుంది అలాగే అమ్మ తీసుకొస్తాను అంటుంది పార్వతి.
అను ని పొగిడిన ఆర్య..
అనువాలమ్మతో ఫోన్ మాట్లాడి వ్రతానికి రెడీ అవుతూ ఉండగా ఆర్య వస్తాడు. అలానే చూస్తూ నిలబడి ఉంటాడు ఏంటండీ అలానే చూస్తున్నారు అంటుంది. అచ్చం బుట్ట బొమ్మ లాగా ఉన్నావు. రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది. నువ్వు అలా ఉంటే నేను ఎలా అడగను అని అంటాడు. అనూ కంటికి ఉన్న కాటుకను తీసి, నీకు నాదిష్టే కాదు ఎవరి దిష్టి తగలకూడదని అరికాల్లోదిష్టి చుక్క పెడతాడు.మీ ప్రేమ నా మీద ఎప్పటికీ ఇలానే ఉండాలి అంటుంది అను. నా ప్రాణం ఉన్నంతవరకు నీ పై ప్రేమ చావదు స్వీట్ హార్ట్ అంటాడు ఆర్య. ఇంత ప్రేమిస్తున్న మిమ్మల్ని నేను కూడా ఎప్పటికీ వదులుకోనండి అని అంటుంది. ఇక కృష్ణ అరవింద అన్ని ఏర్పాట్లు చేస్తుంటే అందరి ముందు తనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటాడు.
రేపటి ఎపిసోడ్ లో, వ్రతానికి వచ్చి పార్వతి వెండి ప్రతిమ ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్తుంది. అది విని కృష్ణ చాలా సంతోషపడతాడు. కుచల వెండి ప్రతిమ లేకుండా ఇప్పుడు అమ్మవారి పూజ ఎలా చేస్తాము అని అంటుంది. పద్మావతి వెండి ప్రతిమ లేకపోయినా పూజ చేయొచ్చు నేను చేస్తాను అని అమ్మవారి బొమ్మని తయారు చేస్తుంది. అది చూసి విక్కి హ్యాపీగా ఫీల్ అవుతాడు.