Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ స్టార్ మా సీరియల్, ఈ సీరియల్లో మెయిన్ హీరో క్యారెక్టర్ చేస్తున్న విక్కీ. ఇతని అసలు పేరుస్వామినాథన్ అనంతరామన్,మనందరికీ విక్కీ విక్రమ్ ఆదిత్య గాపరిచయం.ఇతను 1995 వ సంవత్సరంలో స్వామినాథన్ అనంతరామన్ బెంగళూరులో జన్మించారు. ఇండియన్ పబ్లిక్ స్కూల్లో బెంగళూరులో స్వామినాథన్ తన చదువుని కంప్లీట్ చేశాడు. తన కాలేజీ చదువుని తమిళనాడులో చేశాడు విక్కీ.ఇతను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. ఇతను కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు. కాలేజీ చదివే రోజుల్లోనే మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ తో కొన్ని మోడలింగ్ షోస్ లోనూ, కొన్ని యాడ్లలోను నటించాడు స్వామినాథన్. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించాడు.

స్వామినాథన్ ఫ్రెండ్ స్వామినాథన్ ఫొటోస్ ను ఒక ఏజెన్సీకి పంపించగా ఒక కన్నడ సీరియల్ ప్రొడ్యూసర్ ఫొటోస్ చూసి నచ్చి విక్కీని ఒక కన్నడ సీరియల్ కి హీరోగా తీసుకున్నారు. అలా ఇంజనీర్ నుండి మన విక్కీ సీరియల్ లో ఆడ్ చేయడానికి వచ్చాడు. మిధున రాశి అనే కన్నడ సీరియల్ ద్వారా, అందులో మిథున్ పాత్రకి మొదటిసారి నటించి మెప్పించాడు మన స్వామినాథన్. ఆ సీరియల్ లో నటించిన స్వామినాథన్ కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సీరియల్ లో ఆ పాత్రకి తగ్గట్టుగా నటించినందుకు మంచి ఆఫర్స్ ఏ వచ్చాయి మనస్వామినాథన్ కి,కన్నడంలో కొమరట్వ అనే కన్నడ సీరియల్ లో కూడా నటించారు. తరువాత 2021 వ సంవత్సరంలోతమిళ్ ఛానల్ స్టార్ విజయలో ప్రసారమవుతున్న కాట్రవెన్నకి అనే సీరియల్ లో మరొక హీరోకి రీప్లేస్గా సూర్య పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు స్వామినాథన్. ఆ సీరియల్ లో నటిస్తున్న స్వామినాథనికి, తమిళనాడులో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గుప్పెడంత మనసుకి రీప్లేస్ గా వచ్చిన సీరియల్ ఈ కాట్రవెన్నకి, ఈ సీరియల్ లో హీరోగా స్వామినాథన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం తెలుగులో నువ్వు నేను ప్రేమ సీరియల్ లో విక్కీ గా యాంగ్రీ యంగ్ మెన్ పాత్ర ద్వారా అందరినీ ఆకట్టుకుంటున్నాడు మన స్వామినాథన్, అటు తమిళంలో సూర్యాగా ఇటు తెలుగులో విక్రమాదిత్యగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు స్వామినాథన్. కన్నడంలో మొదలుపెట్టి తమిళంలో ఆక్ట్ చేస్తూ తెలుగులో కూడా కంటిన్యూ చేస్తూ అందరి మనల్ని పొందుతున్న స్వామినాథన్, ఇతను సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటాడు.

హాలీవుడ్ హీరోలని తల తన్నే అందంతో,సిక్స్ ప్యాక్ బాడీ తో, హ్యాండ్సమ్ లుక్ తో, చూడముచ్చటగా ఉంటాడు. స్వామినాథన్ ఫోటోలను, ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ ఫోటోలకి తన అభిమానులు లైక్ కొట్టి షేర్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ హీరో ఫొటోస్ ని మీరు కూడా చూసేయండి.