Malli Nindu Jabili సెప్టెంబర్ 16 ఎపిసోడ్ 446: అరవింద్ ఫోన్ చేస్తూ ఉంటే ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఈ శంకర్ ని ఎలాగైనా సరే పట్టుకోవాలి ఫోటోలు మాత్రమే నేను తీశాను ఆర్టికల్ నేను రాయలేదని గౌతమ్ కి చెప్పించాలి అప్పుడైనా గౌతమ్ కి నామీద కోపం పోయి మల్లి తో బాగుంటాడేమో అని అరవింద్ అనుకుంటాడు. కట్ చేస్తే మల్లి సీతారాములని ఇంటికి తీసుకువచ్చి పూజ చేస్తుంది మల్లి పూజ చేస్తుండగా తనకు తెలియకుండా వచ్చి పక్కనే నిలబడతాడు గౌతమ్.

తనని చూసుకొని మల్లి ముందుకు వెళుతుంది అక్కడ గౌతమ్ ని చూసి భయపడుతుంది. ఏంటి మల్లి ని ఇంట్లో నీకు భయమా దయ్యాలు భూతాలు తిరగడుతున్నాయా అని గౌతమ్ అంటాడు.అది కాదండి ఒకసారి మిమ్మల్ని చూసేసరికి అలా అనిపించింది అంతే సరే పదండి డిన్నర్ చేద్దాం అని మల్లి అంటుంది.డిన్నర్ తర్వాత చేద్దాంలే కానీ నీతో ఒక పని ఉంది నిన్ను ఒకటి సూటిగా అడుగుతాను నిజం చెప్తావా మల్లి నీకు అరవింద్ అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా అని గౌతమ్ అంటాడు.

అదేంటండీ అలా అంటారు అని మల్లి అంటుంది. ఇష్టాలలో చాలా రకాలు ఉంటాయి మల్లి దానికి ఎందుకు అంతలా కంగారు పడతావు నువ్వు ఇబ్బంది పడతావని నేను పేపర్ మీద రెండు పేర్లు రాసుకు వచ్చాను ఈ రెండిట్లో నా పేరు అరవింద్ పేరు ఉన్నాయి నువ్వు దీంట్లో ఒకటి తీస్తే నీకు ఇష్టమైన వారు ఎవరో తెలుస్తుంది అని గౌతమ్ అంటాడు. ఇది కరెక్ట్ కాదండి మీకు పెళ్లికి ముందే అన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు ఇలా మాట్లాడుతారు ఏంటి అని మల్లి అంటుంది. మల్లి ఎందుకు భయపడుతున్నావు అగ్రిమెంట్ వద్దు ముందు ఒక చిట్టి తియి అని గౌతమ్ బెదిరిస్తాడు.

మల్లి భయపడుకుంటూ తీస్తుంది అందులో అరవింద్ పేరు ఉంటుంది అరవింద్ బాబు నన్ను చదివించాడు వాళ్ల ఇంట్లో కొన్నాళ్లు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి తన మీద అభిమానమే కానీ ప్రేమ కాదు అని మల్లి అంటుంది. మల్లి అన్నీ చెప్పాను అని అంటున్నావు కానీ ఇంకేదైనా మర్చిపోయావేమో గుర్తుకు తెచ్చుకో ని చెప్పు నేను అడిగితే వేరే లాగా ఉంటుంది నాతో చెప్పాల్సింది ఇంకేమైనా మిగిలిపోయింద అని గౌతమ్ గుచ్చి గుచ్చి అడుగుతాడు ఆ మాటలు అర్థం కాని మల్లి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని మల్లి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. మల్లి ఇంత అడిగినా నిజం మాత్రం చెప్పట్లేదు ఇంతలా మోసం చేస్తారా మల్లి అరవింద్ వాళ్ళ సంగతి చూస్తాను మల్లి ఇంత అమాయకంగా కనిపిస్తున్నావు పెళ్లికి ముందు నువ్వు నాకు నచ్చావు కానీ ఇప్పుడు నచ్చడం లేదు ఎందుకు అంటే అరవింద్ తో పెళ్లి అయ్యిందని నువ్వు నాకు చెప్పకుండా దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నావు ఇంత మోసం చేసిన నిన్ను ఊరికే వదిలిపెట్టను ఇంకా లేట్ చెయ్యకూడదు లాయర్ గారికి ఫోన్ చేసి మా విడాకుల గురించి మాట్లాడాలి అని గౌతమ్ అనుకుంటాడు. కట్ చేస్తే అరవింద్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో మాలిని వెనకాల నుంచి వచ్చి వాటేసుకుంటుంది.

వదులు మాలిని అని కోపంగా అరవింద్ అంటాడు. ఎంతసేపు ఆ మల్లి గురించి ఆలోచిస్తావు కానీ నా గురించి ఆలోచించవా నీకు బాధ కలిగిన నేనే దగ్గరికి రావాలి నిన్ను ఓదార్చడానికి నేనే దగ్గరికి రావాలి నిన్ను సంతోష పెట్టడానికి నేనే దగ్గరికి రావాలి నువ్వు మాత్రం అలా బండరాయి లాగానే ఉండిపోతావు ఎందుకు నాకు ఫీలింగ్స్ ఉండవా అని మాలిని అంటుంది.నేను ఎప్పుడు మల్లి గురించి మాట్లాడినా మీరు అపార్థ మే చేసుకుంటారు అని అరవింద్ అంటాడు. అయినా నువ్వు అక్కడ జాబ్ చేయాల్సిన పని లేదు అక్కడ ఉద్యోగం మానేస్తావా లేదా అని మాలిని అంటుంది. లేదు నేను మానేయ్యను మల్లి జీవితం బాగుపడే దాకా నేను అక్కడ జాబ్ మానేయను ఎందుకు అంటే అపార్థంతో మల్లి నీ పెళ్లి చేసుకున్న గౌతమ్ గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతుంటే తనకు ఏమీ అర్థం కాక నవ్వాలా ఏడవాలా తెలియని పరిస్థితిలో మల్లి ఉంది మల్లి అంటే నాకు అభిమానం కానీ మీరు దానిని కామంతో చూస్తారు ఇప్పుడు తనని ఆ బాధలో వదిలేసి నేను వేరే జాబ్ చూసుకోలేను అని అరవింద్ అంటాడు.

నేను మాత్రం సంతోషంలో మునిగి తేలుతున్నానా అని ఏడుచుకుంటూ మాలిని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది గౌతమ్ లాయర్ కి ఫోన్ చేసి లాయర్ గారు మీరు పంపించిన నోటీసు నాకు అందాయి దానిమీద మల్లి సంతకం పెడితే మాకు విడాకులు వచ్చేస్తాయా అని లాయర్ గారిని అడుగుతాడు గౌతమ్.. ఆ మాటలు విన్న అరవింద్ ఈ విషయం వెంటనే మల్లి కి చెప్పాలి అని వెళ్తాడు మల్లి నీతో ఒక విషయం మాట్లాడాలి అని అరవింద్ అంటాడు. నన్ను గౌతమ్ ఎందుకో రమ్మన్నాడు నేను వెళ్ళాలి పక్కకు తప్పుకోండి అని మల్లి వెళ్ళిపోతుంది.

మల్లి నీ మాటలకు నీ మనసుకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు పైకి అమాయకంగా కనిపిస్తావు కానీ నన్ను ఇంత మోసం చేస్తావా నేను ఇప్పుడు ఊరుకుంటే నన్ను నేనే మోసం చేసుకున్నట్టు అవుతుంది అందుకనే నీకు విడాకులు ఇచ్చేస్తాను అని తన మనసులో గౌతమ్ అనుకుంటాడు. ఏంటండీ ఇంత అర్జెంటుగా రమ్మన్నారు అని మల్లి అంటుంది. రా మల్లి ముందు నువ్వు కూర్చో అని గౌతమ్ తన చెయ్యి పట్టుకుని నేను ఏం చేయమంటే అది చేస్తావా మల్లి అయితే నీ బంగారు చేతులతో ఈ పేపర్ల మీద సంతకం పెట్టు అని మెత్తగా మాట్లాడి మల్లి తో సంతకం పెట్టించుకుంటాడు గౌతమ్. ఆ పేపర్లు ఏంటి ఏమిటి అని అడగకుండా మల్లి సంతకం పెడుతుంది. మల్లి ఏమీ ఆలోచించకుండా సంతకం పెడుతుంది ఎలాగైనా ఆపాలి అని అరవింద్ అనుకుంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది