New OTT Releases: ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రస్తుతం OTT హవా నడుస్తోంది. కరోనా రాకముందు వరకు OTT చాలా వరకు చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అన్నట్టు ఉండేది. మహమ్మారి కరోనా ఎఫెక్ట్ తో థియేటర్ వ్యాపార రంగం ప్రమాదంలో పడటంతో..OTT రంగం పుంజుకుంది. చిన్న హీరోలు మొదలుకొని పెద్ద హీరోల వరకు… చాలామంది సినిమాలు OTT లలోనే విడుదల చేస్తున్నారు. స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయింది అంటే… రెండు వారాల లోపే OTTలో స్ట్రీమింగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో OTT సంస్థలు ప్రతి వారం తమ సబ్స్క్రైబర్స్ ని అలరించడానికి సరికొత్త కంటెంట్ కలిగిన సినిమాలతో రెడీ అవుతున్నయి. దీనిలో భాగంగా మే 5వ తారీఖు OTT లలో విడుదలయ్యే సినిమాల వివరాలు.
సన్ నెక్స్ట్:
నాగశౌర్య – మాళవిక నాయర్ జంటగా ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ ఈ ఏడాది మార్చి 17వ తారీకు విడుదల అయింది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించాడు. కల్యాణి మాలిక్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా..సన్ నెక్స్ట్ వారు మే 5వ తారీఖు నుండి స్ట్రీమింగ్ చేస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్:
మీటర్….
రమేష్ కాడూరి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా ఏప్రిల్ 7వ తారీకు విడుదల అయింది. థియేటర్లో పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కిరణ్ అబ్బవరం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మరి ఓటీడీలో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.
యోగి..
వివి వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా.. అప్పట్లో పెద్దగా కట్టుకోలేకపోయింది. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ నీ చాలా స్టైలిష్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయించిన డైరెక్టర్ వినాయక్ కథని సక్సెస్ఫుల్ గా నడిపించడంలో.. విఫలమయ్యారని చెప్పవచ్చు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మరి ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.
త్రీ..
శృతిహాసన్ ధనుష్ జంటగా కలిసి నటించిన “త్రీ” సినిమా 2012లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో వైదిస్ కొలవరి సాంగ్ అప్పట్లో దేశాన్ని ఒక ఊపు ఊపింది. కానీ సినిమా పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా మే ఐదవ తారీఖు నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
రౌడీ ఫెలో:
రౌడీ ఫెలో 2014 లో పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని మూవీమిల్స్ & సినిమా 5 పతాకంపై టి. ప్రకాష్ రెడ్డి నిర్మించాడు. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో నారా రోహిత్, విశాఖ సింగ్ ప్రధాన పాత్రలని పోషించగా రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, ప్రవీణ్, ఆహుతి ప్రసాద్, మధునందన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్ సంగీతాన్ని అందించగా, అరవిందన్ పి. గాందీ ఛాయాగ్రాహకుడిగా పనిచేసాడు. ఈ చిత్రం 21 నవంబర్ 2014న విడుదలయ్యింది. మే 5వ తారీఖు నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
అమృతం చందమామలో:
అమృతం చందమామలో 2014, మే 17న విడుదలయ్యింది. జస్ట్ ఎల్లో మీడియా పతాకంపై గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, హరీష్, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, ధన్య బాలకృష్ణ, సుచిత్ర తదితరులు నటించగా, శ్రీ సంగీతం అందించాడు. అంతరిక్ష హస్య నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు చిత్రమిది. మే ఐదు నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
“తమ్ముడు”..
1999లో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో.. పవన్ హీరోగా “తమ్ముడు” సినిమా తెరకెక్కింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో… ప్రీతిజింగానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో యూత్ ని అంతగానో పవన్ ఆకట్టుకోవడం జరిగింది. మే 5వ తారీఖు నుండి “తమ్ముడు” సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ది ఏమోజి అన్న ఇంగ్లీష్ సినిమా…
తు జోతి మై మక్కర్ అనే హిందీ సినిమా…నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతున్నాయి.
హాట్ స్టార్ లో:
“సాస్ బహు ఔర్ ఫ్లెమింగో” అని హిందీ వెబ్ సిరీస్.
“కరోనా పేపర్స్” అనే మలయాళం సినిమా విడుదల కానున్నాయి.
ఈటీవీ విన్:
మ్యాచ్ ఫిక్సింగ్ అనే తెలుగు సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.
ZEE5:
“శభాష్ ఫెలుధా” అనే బెంగాలీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
ఫైర్ ఫ్లైస్ : పార్థ్ ఔర్ జుగ్ను హిందీ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు ఆహా:
గీతా సుబ్రహ్మణ్యం.. అనే తెలుగు వెబ్ సిరీస్ సీజన్ 3 స్ట్రీమింగ్ కాబోతుంది.
తమిళ్ ఆహా:
రిపీట్ అనే తమిళ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.