NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఒక్కసారిగా పెరిగిపోయిన పల్లవి ప్రశాంత్ గ్రాఫ్..!!

Share

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ ప్రారంభమైన నాటి నుండి హౌస్ లో పోటీ వాతావరణం ఉండే విధంగా నిర్వాహకులు జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో మొదటి నాలుగు వారాలు పవరాస్త్రాకి సంబంధించి వివిధ టాస్కులు పెట్టి ఇమ్యూనిటీ గెలుచుకునే విధంగా.. హౌస్ లో సరికొత్త వాతావరణం సృష్టించారు. ఈ దెబ్బతో మొదటి వారం నుండే గ్రూపులు స్టార్ట్ కావడంతో పాటు గొడవలు కూడా భారీగా అయ్యాయి. అయితే షో ప్రారంభం అయ్యాక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఆట తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. సింపతి సంపాదించుకుంటున్నాడని, బిగ్ బాస్ నీ మెప్పించే విధంగా కెమెరా గేమ్ ఆడుతున్నాడు అని, కాస్త ఓవరాక్షన్ ఎక్కువైపోయిందని చాలామంది నానా రకాల కామెంట్లు చేశారు.

Pallavi Prashanth graph has increased dramatically in Bigg Boss season seven

కానీ ప్రజెంట్ పరిస్తితి చుస్తే పల్లవి ప్రశాంత్ ఆట తీరుని అందరూ ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. మొదటివారం ఓటింగ్ లో టాప్ లో నిలిచిన రెండో వారం పల్లవి ప్రశాంత్ కి కాస్త ఓట్లు తగ్గాయి. ఈ క్రమంలో కొన్ని చీవాట్లు పడటంతో.. నాగార్జున ఇచ్చిన క్లాసులకు అదేవిధంగా శివాజీ ఇచ్చిన సూచనలకు మనోడు ఆట తీరు పూర్తిగా మార్చుకున్నాడు. పూర్తి గేమ్ లోకి లీనమై.. సీజన్ సెవెన్ మొదటి కెప్టెన్ గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ లో తనని తక్కువ చూసిన సీరియల్ బ్యాచ్ సభ్యులందరికీ తలదన్నేలా గేమ్ లో మంచి పోటీ ఇవ్వడం జరిగింది. రోజు రోజుకి ప్రశాంత్ బిగ్ బాస్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాడు.

Pallavi Prashanth graph has increased dramatically in Bigg Boss season seven

తాజాగా హౌస్ లో అంతమంది సెలబ్రిటీలు ఉన్నాగాని వాళ్ళందరిని వెనక్కి నెట్టి టాస్కులలో కష్టపడి.. కెప్టెన్ కావటంతో పల్లవి ప్రశాంత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కచ్చితంగా ఈసారి టైటిల్ పల్లవి ప్రశాంత్ లేదా శివాజీ ఇద్దరిలో ఒకరు కొడతారని జనాలు భావిస్తున్నారు. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కూడా ప్రశాంత్ ఆట తీరునీ ప్రశంసించారు.


Share

Related posts

విజ‌య్ దేర‌కొండ‌తో డేటింగ్ చేస్తాన‌న్న‌ బాలీవుడ్ స్టార్ కిడ్‌.. షాక్‌లో జాన్వీ!

kavya N

పాపం నాగార్జున‌.. సొంత అభిమానులే అలా చేస్తున్నారు!?

kavya N

Ennenno Janmala Bandam: వేదస్విని వంధ్యత్వం గురించి హేళన చేసిన మాళవిక…అభిమన్యు గురించి కైలాష్ ను ఆడుకున్న నీలాంబరి!

Deepak Rajula