Unstoppable 2: ఫిబ్రవరి మూడవ తారీకు ఆహా ఓటీటీలో “అన్ స్టాపబుల్” టాకీ షో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఒకరోజు ముందుగానే అనగా ఫిబ్రవరి 2వ తారీఖు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మొదటి పార్ట్ కి సంబంధించి మరో ప్రోమోలో చూపించడం జరిగింది.ఈ ఎపిసోడ్ కోసం మెగా మరియు నందమూరి అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ నెలలో ఈ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న.. క్రమంలో సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ అవుతుందని అందరూ లెక్కలు వేసుకున్నారు. కానీ అందరి లెక్కలు తారుమారు చేసి ఫిబ్రవరి మూడో తారీకు పవన్ మొదటి పార్ట్ ఆహా “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ స్ట్రీమింగ్ స్టార్ట్ కానుంది.
అయితే ఈ ఎపిసోడ్ మొదటి ప్రోమో ఇంతకుముందే రిలీజ్ కావటం తెలిసిందే. దానిలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఇంకా చిరంజీవితో అనుబంధం కుటుంబ విశేషాలు.. డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి.. పొలిటికల్ స్పీచ్ లో ఆవేశం గురించి పలు విషయాలపై బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నలు వేశారు. ఇదే సమయంలో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొనడం జరిగింది. ఇదిలా ఉంటే పవన్ ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పుడు మరో ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ “తమ్ముడు” సినిమాలో చేసిన ఫైట్స్ గురించి బాలకృష్ణ ప్రశ్నలు వేశారు.
ఆ సినిమాలో ఫైట్స్ మొత్తం డూప్లికేట్ అని వెటకారంగా ప్రశ్న వేస్తే… పవన్ దానికి తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు. నిజంగా స్తంభాన్ని గుద్దినట్టు తర్వాత రక్తం రావడంతో…షార్ట్ అయిన వెంటనే ఆర్ట్ డైరెక్టర్ ఎవరు..? అనీ అనడంతో సెట్ లో ఉన్న స్టాఫ్ మొత్తం సైలెంట్ అయిపోయారు అనీ పవన్ చెప్పుకొచ్చాడు. సరిగ్గా ఇంకో రోజు ఉందన్నగా… ఆహా టీం రిలీజ్ చేసిన ఈ చిన్నపాటి ప్రోమో.. కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. ఈ ప్రోమోలో బాలయ్య మరియు పవన్ కళ్యాణ్ బాగా ఎంజాయ్ చేసిన స్మైలింగ్ వీడియోలను… హైలెట్ చేసి చూపించడం జరిగింది. “ఆహా” సెకండ్ సీజన్ కి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ యే చివరిది అని సమాచారం.