NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 25 2023 Episode 1134:  నేల మీద అన్నం తింటున్న ఆర్య వర్ధన్..

Prema Entha Madhuram Today Episode December 25 2023 Episode 1134 Highlights

Prema Entha Madhuram December 25 2023 Episode 1134:  తనను మోసం చేసి మీరు తన ల్యాండ్ దక్కించుకుందాం అనుకుంటున్నారేమో తన డబ్బు తనకి చేస్తే వెళ్ళిపోతాం అని అను అంటుంది. చూడు మేము మోసం చేస్తున్నాం అంటున్నావు కదా మరి నువ్వు చేస్తున్నది ఏంటి అనురాధ మిస్సెస్ ఆర్య వర్ధన్ ఉండాల్సిన నువ్వు ఉట్టి రాధ గా వాళ్లతో ఉండి నువ్వు మోసం చేయట్లేదా దాన్నేమంటారు అది కాదా నమ్మకద్రోహం అని మానస అంటుంది. చూడండి ఇప్పుడు విషయం నాది కాదు తను ల్యాండ్ మీకు ఇచ్చింది తన డబ్బులు తను ఇచ్చేయండి లేదంటే ప్రమాదంలో పడతారు అని అను అంటుంది. చూడు అను ఆవిడ మాకు ల్యాండ్ ను అమ్మినట్టు మా దగ్గర పేపర్లు ఉన్నాయి నువ్వేమీ చేయలేవు కేసు పెడతావా పెట్టిన అది నిలబడదు ఇక్కడి నుంచి తనని తీసుకొని వెళ్ళిపో లేదంటే నేను నోరు విప్పాను అనుకో నీ గుట్టు బయట పడిపోతుంది ఏంటి చెప్పమంటావా నువ్వు ఆర్య వర్ధన్ భార్యవని ఛాయా అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 25 2023 Episode 1134 Highlights
Prema Entha Madhuram Today Episode December 25 2023 Episode 1134 Highlights

వాళ్ల మాటలు విన్న అను చేసేది ఏమీ లేక సుగునని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏంటమ్మా వాళ్ళు డబ్బు ఇవ్వనన్నార అని సుగుణ అంటుంది. ఆంటీ వాళ్లని ఇప్పుడు మనం ఏమీ అనలేము మీ అబ్బాయి ఎలాగైనా ఆ ల్యాండ్ ని దక్కించుకుంటాడు మనం వెళ్దాం పదండి అని అను సుగుణ ని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, పిల్లలిద్దరూ అయ్యప్ప స్వామి పూజ చేస్తారు.అభాయ్ అయ్యప్ప కి హారతి ఇచ్చి అందరిని తీసుకోమంటాడు. అందరూ హారతి తీసుకుంటారు.అను పిల్లలకు బిక్ష రెడీ చేసావా తెచ్చి పెట్టు అని సుగుణ అంటుంది. అను లోపలికి వెళ్లి భిక్ష పట్టుకు వచ్చి పిల్లలిద్దరికీ పెట్టబోతుంది.అమ్మ మేము అరిటాకుల్లో అన్నం తినము నేల మీద తింటాము అని ఆభయ్ అంటాడు. అదేంటి నాన్న ఇప్పటికే మీరు చాలా కఠోరమైన దీక్ష చేస్తున్నారు చన్నీళ్ళతో స్నానం చేస్తున్నారు ఇక చాలు ఇక నేల మీద కూడా తినడం వద్దు అని అను అంటుంది. పిల్లలు నమ్మకం ఉండాలి కానీ మూఢనమ్మకం ఉండకూడదు అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 25 2023 Episode 1134 Highlights
Prema Entha Madhuram Today Episode December 25 2023 Episode 1134 Highlights

మూఢనమ్మకం కాదు ఫ్రెండ్ మాకు మాల వేసిన గురువుగారు చెప్పారు మనం ఏదైనా సరే నమ్మకంతో దీక్షా తీసుకొని చేస్తే అది కచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పాడు మా గురువుగారు అని అక్కి చెప్తుంది. నమ్మకం ఉండొచ్చు కానీ అంతకంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి అని ఆర్య అంటాడు. ఫ్రెండ్ మనం రోజు సుఖమైన జీవితానికి అలవాటు పడిపోయాము కాబట్టి మనం అలా మూఢనమ్మకమని కొట్టి పారేస్తున్నాను కానీ చల్లనీలతో స్నానం చేసి కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి నేల మీద అన్నం తిని కఠోరమైన దీక్ష చేస్తే అప్పుడు స్వామి నేను తప్ప వీళ్లకు దిక్కు ఇంకెవరూ లేరని నమ్మే మనం కోరుకున్న కోరిక తీరుస్తాడంట అందుకే మేము గురు స్వామి చెప్పింది నమ్మి కఠోరమైన దీక్ష చేస్తున్నాము మా నాన్న కచ్చితంగా మాకు దొరుకుతాడు అని అక్కి అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 25 2023 Episode 1134 Highlights
Prema Entha Madhuram Today Episode December 25 2023 Episode 1134 Highlights

అలాగని చెప్పి నేల మీద అన్నం తిన్నంత మాత్రాన దేవుడు కోరికలు నెరవేరుస్తాడా అని ఆర్య అంటాడు. ఫ్రెండ్ మన మీద మనకు నమ్మకం ఉండాలని మీరు అంటున్నారు కానీ మేము ఎంతో నమ్మకంతో మా నాన్న మాకు దొరకాలి మేము ఆయనతో సంతోషంగా ఉండాలని ఎన్నోసార్లు గట్టిగా అనుకున్నాం నువ్వు కూడా మా నాన్నని వెతికి తెచ్చి ఇస్తానని మాకు మాట నమ్మకంగా చెప్పావు కానీ మనం అనుకున్నవన్నీ జరిగాయా ఫ్రెండ్ జరగలేదు కదా దేనికైనా ఒక పరిమితి ఉంటుంది మనిషి కొంతవరకే చేయగలడు కానీ భగవంతుడు ఏదైనా చేయగలడు కాబట్టి మేము భగవంతుని శరణాగతి కోరుతున్నాము ఈ నేల మీద భోజనం చేస్తే మాకు తప్పకుండా మా నాన్నగారు దొరుకుతాడు అని మేము నమ్ముతున్నాం అని అభాయ్ అంటాడు. పిల్లల లాగే అను కూడా భగవంతుని నమ్మేది కానీ నేను తనను నమ్మేవాన్ని నేను కూడా అనులాగే భగవంతుని గట్టిగా నమ్మి ఉంటే నాకు వాళ్ళు దూరమై ఉండేవాళ్ళు కాదు కావచ్చు అని ఆర్య అనుకుంటాడు. దేవుడా నా అను నా పిల్లలు నాకు దొరికలి అని నిన్ను దృఢంగా నమ్ముతున్నాను అని ఆర్య అనుకుంటాడు.

Prema Entha Madhuram Today Episode December 25 2023 Episode 1134 Highlights
Prema Entha Madhuram Today Episode December 25 2023 Episode 1134 Highlights

సరే అను పిల్లలు అంతలా అంటుంటే వాళ్ళ నమ్మకాన్ని ఎందుకు కాదనాలి వాళ్లకు నేల మీదే భోజనం పెట్టు అని సుగుణ అంటుంది. ఉష నేను కూడా నేల మీదనే భోజనం చేస్తాను అని ఆర్య అంటాడు. మీరెందుకు అన్నయ్య నేల మీద భోజనం చేయడం అని ఉష అంటుంది. నేను కూడా భగవంతుని ఒక కోరిక గట్టిగా కోరుకున్నాను అది నెరవేరాలంటే నేల మీద భోజనం నేను కూడా చేస్తాను అని ఆర్య నేల మీద భోజనం చేస్తాడు. అమ్మ పిల్లల దగ్గర నేను ఉంటాను మీరు వెళ్లి పడుకోండి అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, పిల్లలిద్దరూ ఆర్య చేతుల మీద నిద్రపోతారు ఆర్య అలాగే కూర్చుని నిద్రపోతాడు.అను గాఢమైన నిద్రలోకి వెళ్లిపోగానే రాజనందిని కలలో కనపడుతుంది. అను ఏం చేస్తున్నావ్ నీ భయాందోళనతో ఆర్య సార్  ప్రేమకి నన్ను దూరం చేస్తున్నావ్ నేను తన ప్రేమ పొందడం కోసమే మళ్లీ నీ రూపంలో పుట్టానని నీకు తెలియదా అని రాజనందిని అంటుంది. నేను సార్ కి దగ్గర అవుదామనుకున్న ప్రతిసారి తనకు ఏదో ఒక ప్రాణగండం వస్తుంది అందుకే నేను తనకు దూరంగా వెళ్ళిపోతున్నాను తన ప్రేమను దక్కించుకోవడం కంటే తన ప్రాణాలు కాపాడుకోవడమే నాకు ముఖ్యం అని అను అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 25 2023 Episode 1134 Highlights
Prema Entha Madhuram Today Episode December 25 2023 Episode 1134 Highlights

అదంతా నీ బ్రహ్మ నువ్వు భయపడినంత కాలం నీకు అలాగే జరుగుతుంది అయినా నా ప్రేమ ఆయన వెంట ఉండగా ఆయనకు ఏ ప్రమాదము రాదు వెళ్ళు వెళ్లి సార్ ప్రేమకి నన్ను దగ్గర చేయి మళ్ళీ జన్మ ఎత్తిన నాకు సార్ ప్రేమను దూరం చేయకు వెళ్లి ఆర్య సార్ కి కనపడు అని రాజనందిని అంటుంది. కనపడి పోరాడే శత్రువుతోటైనా మనం ఎదిరించొచ్చు కాలని నైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు కానీ వీధిని ఎవరు తప్పించలేరు విధిని ఎలా ఎదిరించగలను అని అను అంటుంది. పిచ్చిదానా ఆర్య సార్ ప్రాణం నీ ప్రేమ నువ్వు భయపడుతూ ఉంటే కాలం ఇంకా నిన్ను భయపెడుతూనే ఉంటుంది ఎదిరించి తన ప్రేమను సొంతం చేసుకో అని రాజనందిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N