NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 30 2023 Episode 1139: సుగుణ ఆర్య కి అను కి పెళ్లి చేయాలని పంతులు గారికి వాళ్ళ జాతకం చూపిస్తుందా లేదా..

Prema Entha Madhuram Today Episode December 30 2023 Episode 1139 Highlights

Prema Entha Madhuram December 30 2023 Episode 1139: పంతులుగారు లగ్నపత్రిక పెడుతూ ఉంటారు. అను అక్కడ అన్ని సదురుతూ ఉంటుంది. పంతులుగారు మీరు వేళ్ళ మీద లెక్కపెడుతుంటే లగ్న పత్రిక వేస్తున్నారా గాల్లో లెక్కబెడుతున్నారా అని యాదగిరి అంటాడు. బాబు లగ్నపత్రిక రాయాలంటే ఇలాగే చేస్తారు కొన్ని లెక్కలు వేయాలి బాబు అని పంతులు అంటాడు. అమ్మ లగ్నపత్రిక మీద అక్షంతలు పసుపు కుంకుమ వేయాలి తీసుకురండి అని సుగుణమ్మతో చెప్తాడు పంతులుగారు. అను వెళ్లి అవి తీసుకువచ్చి పంతులు గారికి ఇస్తుంది. అమ్మ మీ కోడలు అన్ని పనులు చక చకా చేస్తుంది మీరు చాలా అదృష్టవంతురాలమ్మ అని పంతులు అంటాడు.ఇదిగో పంతులుగారు మా బావ గారికి ఇంకా పెళ్లి కాలేదు ఆ అమ్మాయి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని యాదగిరి అంటాడు. క్షమించండి అమ్మ నేను అలా అనుకోలేదు పనులన్నీ సక్రమంగా చేస్తుంటే ఇంటి కూడలేము అనుకొని నోరు జారాను అని పంతులు అంటాడు. పర్వాలేదులే పంతులుగారు అని సుగుణ అంటుంది. అమ్మ ఇంకొక 15 నిమిషాలు ఆగితే మంచి ముహూర్తం వస్తుంది అప్పుడు లగ్నపత్రిక చదువుతాను అని పంతులుగారు అంటాడు. అలాగే పంతులుగారు నేను దేవుడి దర్శనం చేసుకుని వస్తాను అని సుగుణ వెళ్ళిపోతుంది.

Prema Entha Madhuram Today Episode December 30 2023 Episode 1139 Highlights
Prema Entha Madhuram Today Episode December 30 2023 Episode 1139 Highlights

ఇదిగోండి పంతులుగారు 15 నిమిషాల దాకా మీరు ఖాళీనే కదా మా దివ్య జాతకం ఎలా ఉందో చెప్పండి అని అంటాడు. బాబు గ్రహాలు అనుకూలించనప్పుడు ఎవరి గురించి మాట్లాడకూడదు అని పంతులుగారు అంటాడు. ఇదిగో పిన్ని గారు మా దివ్య ను పెళ్లి చేసుకుంటే నీకు అదృష్టం పట్టినట్టే అని యాదగిరి అంటాడు. అంటే అంత అదృష్టవంతురాలా బాబు అని ఆవిడ అంటుంది. మీ వాడికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టుకుంటుంది మా దివ్య మీ ఇంట్లో అడుగుపెడితే అని యాదగిరి అంటాడు. కట్ చేస్తే, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావ్ ఏమైనా ప్రాబ్లమా అని ఆర్య అడుగుతాడు. ఏమీ లేదు నాన్న నేను భగవంతుణ్ణి ఒక కోరిక కోరుకుందాం అనుకుంటున్నాను అందుకే దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని సుగుణ అంటుంది.ఏంటమ్మా అది అని ఆర్య అడుగుతాడు. మన కుటుంబం గురించి నాన్న ఆ సమాధానం కోసం భగవంతుడు దగ్గర కోరుకుందామని వెళ్తున్నాను నువ్వు వెళ్ళు నేను వస్తాను అని సుగుణ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, భగవంతుడా నీకు సర్వం తెలుసు నేను మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను కానీ రాధకి ఇంతకుముందే పెళ్లయింది ఆ అమ్మాయికి తోడుగా ఉంటాడనికి సూర్య నిచి పెళ్లి చేస్తే నా స్వార్థం అవుతుంది అలాగని సూర్యకి వేరే సంబంధం చూద్దామంటే వాడి గతాన్ని తలుచుకొని అందరూ పిల్లని ఇవ్వమంటున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలా వద్దా అని నా మనసులో కొట్టుమిట్టాడుతుంది దీనికి నువ్వే పరిష్కారం చూపించు అని సుగుణ అడుగుతుంది.

Prema Entha Madhuram Today Episode December 30 2023 Episode 1139 Highlights
Prema Entha Madhuram Today Episode December 30 2023 Episode 1139 Highlights

అప్పుడు ఈశ్వరుడి తల నుంచి రెండు పూలు కింద పడతాయి. భగవంతుడా నీ మాటని ఇలా తెలియజేసావా అని సుగుణ సంతోషపడుతుంది. ఇంతలో అను వచ్చి ఆంటీ తాంబూలాలు మార్చుకోవడానికి బట్టలు కావాలి అవి ఎక్కడ పెట్టారు అని అడుగుతుంది. అన్నీ జ్యోతి దగ్గరే ఉన్నాయమ్మా అని సుగుణ చెప్తుంది. అను సుగుణ తో మాట్లాడుతూ ఉండగా సుగుణకు తెలిసిన వాళ్ళు పిలిచి సుగుణ మీ అబ్బాయికి పెళ్లెప్పుడు చేశావు చెప్పనేలేదు ఏంటి అని అంటారు. మా అబ్బాయికి పెళ్లి చేయలేదండి ఆ అమ్మాయి తెలిసిన వాళ్ళ అమ్మాయి అని సుగుణాలు చెప్తుంది.అవునా అమ్మాయిని చూస్తే చాలా ముచ్చటేసింది మీ కోడలేము అనుకున్నాము అని వాళ్లు అంటారు. భగవంతుడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమని అన్ని శుభశకునాలు చూపిస్తున్నావా అని సుగుణ అనుకుంటుంది. కట్ చేస్తే, ఉష ఇలా రా అని సుగుణ పిలుస్తుంది. ఏంటమ్మా అని ఉషా వస్తుంది. పొద్దున జాతకాలు నీ దగ్గర ఉంచమన్నాను కదా అవి చూపించుకొని వస్తాను పంతులు గారి దగ్గర అని సుగుణ అంటుంది. వదిన గారు ఇక్కడ లగ్నపత్రిక చదవబోతున్నారు మీరు అక్కడ ఏం చేస్తున్నారు రండి అని వాళ్ళ వియ్యపురాలు పిలుస్తుంది. అమ్మ నేను వెళ్లి ఈ జాతకాలు చూపించుకొస్తాను. నువ్వు వేల్లమ్మ అని ఉష అంటుంది. జాగ్రత్తగా చూపించమ్మా అని సుగుణ వెళ్ళిపోతుంది.

Prema Entha Madhuram Today Episode December 30 2023 Episode 1139 Highlights
Prema Entha Madhuram Today Episode December 30 2023 Episode 1139 Highlights

కట్ చేస్తే,  జాతకం చూపించడానికి పంతులు గారి దగ్గరికి వెళుతుంది ఆ లోపే ఒక ఇద్దరికీ జాతకం చూసి తిడుతూ ఉంటారు పంతులుగారు అది చూసిన ఉష వామ్మో ఈ జాతకాలు చూపియకపోవడం మంచిది అని వెనుకకు తిరుగుతుంది. పంతులుగారు ఉషాన్ని చూసి ఏంటమ్మా జాతకాలు చూపియడానికి నాదాక వచ్చి చూపించకుండానే వెళ్ళిపోతున్నావ్ ఇటు రా అని పిలుస్తాడు. ఏవీ జాతకాలు ఇవ్వు చెప్తాను అని పంతులుగారు అంటాడు. ఉష జాతకాలు ఇస్తుంది అవి చూసి పంతులుగారు ఆ మంగళం జరగకుండు గాక అని చెవి పట్టుకుని అంటాడు. వామ్మో ఈయన ఏదో చెప్పబోతున్నాడు అని ఉష పంతులుగారు ఆ జాతకాలు ఏమీ చెప్పొద్దు కానీ నా జాతకం చూసి చెప్పండి అని ఉష అంటుంది. సరే అమ్మ నీ ఇష్టం అని ఉషా జాతకం చూసి పంతులుగారు నువ్వు వ0ద అబద్దాలు ఆడిన ఒక పెళ్లి చేయాలనుకుంటున్నావ్ అని పంతులుగారు అంటాడు. వామ్మో ఈ పంతులు నా జాతకమంతా చెప్పేలా ఉన్నాడు అని పంతులుగారు నేను ఇంటర్ రెండు సార్లు ఫెయిల్ అయ్యాను ఈ సంవత్సరమైనా పాస్ అవుతానో లేదో చూసి చెప్పండి అని అంటుంది ఉష. నీ గ్రహ దోషాలు అని తొలగిపోయి గ్రహాలు అన్ని అనుకూలించాయి అమ్మ నువ్వు ఈ సంవత్సరం పాస్ అవుతావు అని పంతులుగారు అంటాడు. నేను చెప్తే మా అమ్మ నమ్మదు మా అమ్మని తీసుకు వచ్చినప్పుడు అదే మాట చెప్పండి అని ఉష అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 30 2023 Episode 1139 Highlights
Prema Entha Madhuram Today Episode December 30 2023 Episode 1139 Highlights

అలాగే అమ్మ బల్లగుద్ది చెప్తాను నాకేంటి భయం అని పంతులుగారు అంటాడు. కట్ చేస్తే, అమ్మ లగ్నపత్రిక చదవడం అయిపోయింది పెద్దవాళ్లు తాంబూలాలు మార్చుకుంటే ఈ కార్యక్రమం అయిపోతుంది అని పంతులుగారు అంటారు. అలాగే అని సూర్య ఇలా రా నాన్న తాంబూలాలు పుచ్చుకో అని సుగుణ అంటుంది. వదిన గారు మీ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు కదా ఎలా తాంబూలాలు పుచ్చుకుంటాడు అని వాళ్ళవియపురాలు అంటుంది. బావగారు మీరు ఇలా రండి జ్యోతి నువ్వు బావగారు తాంబూలాలు పుచ్చుకోండి అని ఆర్య అంటాడు. అదేంటి బాబు వాళ్లు అక్క బావలు కదా వాళ్ళేలా అందుకుంటారు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. మా బావగారు ఇంటికి పెద్దల్లుడు బావ అక్క కూడా అమ్మానాన్న స్థానంలో ఉండి తాంబూలం అందుకోవచ్చు వాళ్లే ఇంటికి పెద్దదిక్కు అని ఆర్య  అంటాడు. సరే అని జ్యోతి యాదగిరి తాంబూలాలు మార్చుకుంటారు. ఆర్య వచ్చి అను పక్కన నిలబడతాడు. తన మొహం ఎక్కడ కనపడుతుందోననే ఇంకా మూసుకు వేసుకుంటుంది అను. పంతులుగారు వాళ్ళందరి మీద అక్షంతలు వేస్తాడు అప్పుడు ఆర్య అను ల మీద కూడా అక్షంతలు పడతాయి అవి చూసి వాళ్ళ జంట బాగుంది అని సుగుణ మురిసిపోతుంది.

Prema Entha Madhuram Today Episode December 30 2023 Episode 1139 Highlights
Prema Entha Madhuram Today Episode December 30 2023 Episode 1139 Highlights

కట్ చేస్తే, ఉష పంతులు గారికి జాతకాలు చూపించావా ఏమన్నారు అని అంటుంది సుగుణ. వాళ్ళ ఇద్దరిదీ జన్మజన్మల బంధం అని చెప్పాడమ్మా వాళ్లకు పెళ్లి చేస్తే జీవితాంతం కలిసి ఉంటారని చెప్పాడు పంతులుగారు అని ఉష చెప్తుంది. మరి రాధ మొదటి పెళ్లి గురించి ఏమన్నాడు అని సుగుణ అడుగుతుంది. అది ఏదో గ్రహ స్థితులు బాగోలేక వాళ్ళు విడిపోయారు ఇప్పుడు వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటే మంచిగుంటారని చెప్పాడు అమ్మ అని ఉష చెప్తుంది. ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయని చెప్పాడా చెప్పు అని సుగుణ అంటుంది. నేను చెబితే నువ్వు నమ్మవు కదా పంతులు గారిని అడుగుతాను నువ్వు విను అని ఉషా పంతులు పిలిచి పంతులుగారు మా అమ్మకి ఇందాక చెప్పింది చెప్పండి అని అంటుంది. పంతులుగారు మీ అమ్మాయి జాతకం బాగుంది గ్రహ దోషాలు కూడా బాగానే ఉన్నాయి అంతా మంచే జరుగుతుంది అని అంటాడు. అది విని సుగుణ సంతోష పడిపోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri