Rajamouli: దిగ్గజ దర్శకుడు రాజమౌళి బాహుబలి 2, RRR సినిమాలతో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో మార్చి నెలలో రిలీజ్ అయిన RRR వేయి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం జరిగింది. సినిమాలో రాజమౌళి టేకింగ్ కి సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు సైతం ఫిదా కావడం తెలిసిందే. అయితే ఇప్పుడు RRR నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుండటంతో అంతర్జాతీయస్థాయిలో హాలీవుడ్ ఇంకా చాలా దేశాలకు చెందిన వాళ్ళు రాజమౌళి పనితనం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
RRR సక్సెస్ ఎంజాయ్ చేసి ఇటీవలే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లి వచ్చిన రాజమౌళి.. తాజాగా “అన్య స్ ట్యూటరియల్” అనే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. రెజీనా నివేదిత ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్..నీ ఆహా..లో తెలుగు, తమిళ భాషల్లో జూలై 1 నుండి స్ట్రీమింగ్ కానుంది. హర్రర్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కడంతో ఈ సందర్భంగా.. రాజమౌళి హర్రర్ సినిమాలు గురించి మాట్లాడుతూ.. హర్రర్ సినిమాలు అంటే పెద్దగా ఇష్టం ఉండదని తెలిపారు. కానీ రెండో హార్రర్ సినిమాలంటే ఇష్టమని కొత్త విషయాన్ని రాజమౌళి తెలియజేశారు.
ఒకటి “ద వుమెన్” కాగా.. మరొకటి “పరనిర్మల్ యాక్టివిటీ 7” అని అన్నారు. రెండు కూడా హాలీవుడ్ సినిమాలే. హర్రర్ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు చాలా మందికి ఇష్టం. అవే కూడా రాజమౌళి తెలియజేయడం విశేషం. ఇదంతా పక్కన పెడితే రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబు ప్రాజెక్టు పై ఫోకస్ పెట్టడం తెలిసిందే. ప్రస్తుతం తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో మహేష్ బాబు మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పై గట్టిగా వర్క్ చేస్తున్నారట. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించి మహేష్ సినిమా ఉండనున్నట్లు సమాచారం. అంతమాత్రమే కాకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. “బాహుబలి 2”, “RRR” సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకోవడంతో… జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ స్టార్లు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ -రాజమౌళి సినిమా వచ్చే ఏడాది ప్రారంభం నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నయి.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…