సౌత్‌తో పాటు నార్త్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. తాజాగా `సీతారామం`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న అద్భుతమైన ప్రేమ కథా చిత్రమిది.
ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తే.. అఫ్రిన్ అనే ముస్లిమ్ అమ్మాయిగా రెబల్ పాత్రలో నటించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ బ్రేక్ ఈవెన్‌గా దూసుకుపోతోంది.
ఈ చిత్రంలో దుల్కర్, మృణాల్ పాత్రలకే కాదు రష్మిక రోల్‌కు సైతం విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ మూవీ మంచి విజయం సాధించడంతో.. రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. సీతారామం తానుకు ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ అని, ఇందులో తన తన పాత్ర చాలా యునిక్‌గా అనిస్తుందని తెలిపింది. ఇకపై కూడా హీరోయిన్‌గానే కాకుండా ఇలా కొన్ని డిఫరెంట్ రోల్స్ చేస్తానని వెల్లడింది.
అలాగే డ్రీమ్ రోల్స్ గురించి ప్రస్తావన రాగా.. పీరియాడికల్ మూవీ చేయాలని ఉందంటూ రష్మిక తన మనసులో ఉన్నా కోరికను బయట పెట్టింది. అలాగే స్పోర్ట్స్, యాక్షన్, బయోపిక్.. ఇలా డిఫరెంట్ మూవీస్ చేయాలనీ కూడా ఉందంటూ పేర్కొంది. మొత్తానికి రష్మిక మాటల బట్టీ చూస్తుంటే.. పీరియాడికల్ చిత్రాలపై అమ్మడు మోజు పడుతోందని స్పష్టంగా అర్థమైంది. మరి ఆమె కోరిక నెరవేరి అలాంటి చిత్రాల్లో నటించే అవకాశం వస్తుందా..? రాదా..? అన్నది చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!