శోభిత ధూళిపాళ.. తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్లో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ `గూఢచారి` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత `మేజర్` సినిమాతో ప్రేక్షకులను పలకరించి.. తనదైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇటీవల `పొన్నియన్ సెల్వన్` లోనూ మెరిసిన శోభితా.. తాజాగా తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
ఈ ఫోటోల్లో సాంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కూతురులా అందంగా ముస్తాబై ఓ వ్యక్తి చేతిలో చెయ్యేసి నడుస్తూ కనిపించింది. `వెడ్డింగ్స్ ఇన్ దుబాయ్` అని ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇవ్వడంతో శోభిత పెళ్లి అయిపోయిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు శోభితా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
కానీ అసలు విషయం ఏంటంటే.. శోభితా నిజంగా పెళ్లి చేసుకోలేదట. ఇదొక యాడ్ షూట్ కోసం దిగిన ఫోటోలట. దీంతో ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనైంది, మా ఎమోషన్స్‌తో ఆడుకోవద్ద అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, గతంలో శోభితా ధూళిపాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిందని.. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని జోరుగా వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తలను శోభితా ఖండించింది. మరోవైపు నాగచైతన్య సైతం ఈ వార్తలను పరోక్షంగా కొట్టిపడేశాడు.
https://newsorbit.com/cinema/naga-chaitanya-dating-major-star-sobhita-dhulipala.html
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!