Rajamouli: భారతీయ సంచలన దర్శకుడు రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. “RRR” సినిమాతో రాజమౌళి తిరుగులేని గుర్తింపు సాధించారు. పైగా ఈ సినిమా చాలా అంతర్జాతీయ అవార్డులు సాధించటంతో పాటు ఆస్కార్ రేసులో కూడా ఉంది. ఈనెల 13వ తారీకు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ అమెరికాలో పర్యటిస్తూ ఉన్నారు. పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. “RRR” కీ ఆస్కార్ వచ్చే రీతిలో భారీ ఎత్తున ప్రమోషన్లు జరుపుతున్నారు. ఇలా ఉంటే సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలని రాజమౌళి టీం ఏకంగా 80 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందట.
అయితే ఈ ఖర్చుపై రాజమౌళి ఉద్దేశించి నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఆస్కార్ ఫ్లైట్ చార్జీలకే “RRR” టీం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదే 80 కోట్ల డబ్బు మాకిస్తే 8, 10 సినిమాలు చేసి వాళ్ళ మొహాన పడతాం.. అని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. మరోపక్క “RRR” ఆస్కార్ అవార్డు గెలిస్తే తెలుగు చలనచిత్రా రంగం యొక్క స్థాయి మరింతగా పెరుగుతుంది అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒకప్పుడు ప్రపంచ సినిమా రంగం బాలీవుడ్ గురించి మాట్లాడేది.. “RRR” ఆస్కార్ గెలిస్తే టాలీవుడ్ గురించి మాట్లాడుకునే రోజులు భవిష్యత్తులో ఉంటాయని చెబుతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులు గెలవడంతోపాటు ఆస్కార్ అవార్డుకి సరి సమానంగా ఉండే గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలవడం జరిగింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో “నాటు నాటు” సాంగ్ గెలిచింది. ఇప్పుడు ఇదే క్యాటగిరిలో ఆస్కార్ బరిలో నిలిచింది. దీంతో తప్పకుండా అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.