Tasty Teja: స్టార్ హీరోయిన్ల కి పోటీగా తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న వారిలో ప్రియమణి ఒకరు. ఈ ముద్దుగుమ్మ అనేక సినిమాల్లో నటిస్తూ మంచి ఫేమస్ అయింది. ఇక ప్రస్తుత కాలంలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అదేవిధంగా పలు యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తుంది కూడా.
ఇక తాజాగా ఫుడ్ ద్వారా పాపులర్ అయిన టేస్టీ తేజ మనందరికీ సుపరిచితమే. ఇటీవల బిగ్ బాస్ ఉల్టా పుల్టా షో కి వెళ్లి అక్కడ సందడి చేసి వచ్చాడు. ఇక టేస్టీ తేజ తన యూట్యూబ్ ఛానల్ లో సెలబ్రెటీలను లంచ్ కి పిలుస్తూ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే టేస్టీ తేజ ప్రియమణిని లంచ్ కి పిలిచాడు. ఆమె కూడా నో చెప్పకుండా వెళ్ళింది. ఇక వీరిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ కి ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అయ్యారు.
ప్రియమణి మీకు బిర్యాని చేయడం వచ్చా అని టేస్టీ తేజ ని అడగగా.. నాకు తినడం అయితే వచ్చు మేడం అంటూ సమాధానం ఇచ్చాడు తేజ. మరి ఏమి వచ్చు కనీసం పులిహార అయినా వచ్చా అని ప్రియమణి అడగగా.. బలేవారే పులిహారకి పెట్టింది పేరు టేస్టీ తేజ. ప్రియమణితో పులిహార ఈ పూట అదరగొడదాం.. అంటూ అంటాడు తేజ. ఇక చివరికి ఏదోలాగా పులిహార రెడీ చేసినప్పటికీ చిల్లీస్ వేయడం మర్చిపోతాడు టేస్టీ తేజ. దీంతో ప్రియమణి పకపక నవ్వేస్తుంది.
ఇక అనంతరం ఈ పులిహార ని ఎలా తయారు చేశావో తమిళ్లో చెప్పు తేజ అని ప్రియమణి అడగగా… తమిళ్ కూని చేస్తాడు తేజ. దీంతో ప్రియమణి వెరీ గుడ్ అని నవ్వుతుంది. ఇక లాస్ట్ లో ప్రియమణి అ పులిహార ని టేస్ట్ చేసి ఓ రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ప్రస్తుతం ఆందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ గా మారింది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఫుల్ ఫన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!