The Kerala story: ప్రస్తుత కాలంలో ఒక్క సినిమాలకే కాదు వెబ్ సిరీస్ లకి కూడా మంచి ఆదరణ దక్కుతుంది. అందులోనూ ఆ వెబ్ సిరీస్ లో మంచి కంటెంట్ ఉంటుంటే సినిమాలకి మించిన ఆదరణ పొందుతున్నారు. అలా ఓటీటీలో రిలీజ్ అయి కొన్ని వెబ్ సిరీస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. వాటిలో ఒకటే ది కేరళ స్టోరీ. అదా శర్మ హీరోయిన్గా నటించిన ఈ వెబ్ సిరీస్ మంచి ప్రేక్షక ఆదరణ పొందుతుంది. ఇక అదా శర్మ కి తల్లి పాత్రలో నటించిన దేవదర్శని కి కూడా మంచి పాపులారిటీ ఏర్పడింది. అదేవిధంగా ఈ సినిమాలో ఆదాశర్మ తో పాటు మరో ముగ్గురు లేడీ క్యారెక్టర్స్ లో నటించారు.
ఈ సినిమా కథాంశం వచ్చేసరికి.. ముస్లిమ్స్ మరియు హిందువుల మధ్య జరిగే గాధ. ఒక ముస్లిం అమ్మాయి తమ కులాన్ని దేశవ్యాప్తంగా నమ్మాలనే సిద్ధాంతంతో కొందరు కుట్రతో ఆదాశర్మ అలియాస్ ఫాతిమా నీ వారి కులంలో కలుపుకుని ఆమెని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అలా కొందరిని ట్రాప్ చేసి నాలుగు దేశాలను దాటిస్తూ తమ ఫ్యామిలీకి తమకి సంబంధం లేకుండా చేస్తూ ఉంటారు. ఇక అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరిని చంపేస్తారు. అంతకుముందే తన తెలివితేటలతో మ్యాప్ ని పరిశీలించి వచ్చిన ఫాతిమాకి దారులు తెలియడంతో ఎడారులలో తప్పించుకుంటుంది.
ఆమెతో వెళ్లేందుకు సిద్ధమైన మరో ఇద్దరిని చంపేసినప్పటికీ ఆమె తప్పించుకుని ఇంగ్లీష్ బోర్డర్ లో పడుతుంది. ఇక అక్కడున్న సిబ్బందులు ఆమెని డ్రోన్ ద్వారా చూసి అక్కడి నుంచి వైద్యం అందించి ఆమెని బ్రతికిస్తారు. అనంతరం ఆమె జరిగిన విషయాన్ని వెల్లడిస్తుంది. అలా ఈ వెబ్ సిరీస్ కదా అంశం అద్భుతంగా సాగింది. ఈ వెబ్ సిరీస్ ని చూసిన పలువురు కంటతడి సైతం పెడుతున్నారు. అంత అద్భుతంగా తెరకెక్కించారు మరి. సుదీప్తా సేమ్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటిని షేక్ చేస్తున్నాయి. ఇక ఈ వెబ్ సిరీస్ ని కొనుగోలు చేసిన జి ఫైవ్ కి ఇదొక మంచి సక్సెస్ తెచ్చి పెట్టిందని చెప్పొచ్చు.
దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ అయిన ఈ కేరళ స్టోరీ ప్రస్తుతం ప్రతి ఒక్క హృదయాలను కుదిపేస్తుంది. ఇది నిజ జీవితంలో కథ కావడం గమన్నారహం. ప్రస్తుత కాలంలో కూడా ఫాతిమా బ్రతికే ఉంది. ఆమె చేసిన తప్పు మరెవ్వరూ చేయకూడదు అనే ఆలోచనతోనే ఈ సినిమాకి అంగీకరించినట్లు ఆమె సినిమా ఆఖరి నిమిషంలో ఒక ముసుగు వేసుకొని వెల్లడించింది. తన తల్లిదండ్రులు కూడా ఇలా జరగడం చాలా బాధాకరం ఇటువంటి తప్పు మరెవ్వరూ చేయకూడదని ఈ సినిమాకి మేము ఒప్పుకున్నాం అని సంబోధించారు. ప్రస్తుతం ది కేరళ స్టోరీ పాన్ ఇండియా రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటుంది.