Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కి అత్యంత సన్నిహితుడు నమ్మకమైన స్నేహితుడు త్రివిక్రమ్ అని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని చాలా వేదికలపై స్వయంగా పవన్నే తెలియజేయడం జరిగింది. త్రివిక్రమ్ కాంబినేషన్ లో పవన్ ఇప్పటికి మూడు సినిమాలు చేయడం తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి. ఈ మూడు సినిమాలలో మొదటి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్, రెండవది అట్టర్ ఫ్లాప్. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజకీయంగా పవన్ ఫుల్ బిజీగా ఉండటం తెలిసిందే. దీంతో పవన్ సినిమాలకు సంబంధించి చాలా విషయాలు త్రివిక్రమ్ బాధ్యత తీసుకుని చూసుకుంటున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీనిలో భాగంగానే “భీమ్లా నాయక్” సినిమాని సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన.. సినిమాకి సంబంధించి డైలాగులు మరియు స్క్రీన్ ప్లే ఇంకా చాలా విషయాలలో త్రివిక్రమ్ చొరవ తీసుకోవడం జరిగింది. ఫలితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు “వినోదయ సీతం” అనే మరో రీమేక్ పవన్ చేస్తున్న క్రమంలో ఈ సినిమాకి త్రివిక్రమ్ నిర్మాత గా బాధ్యతలు చేపట్టినున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు పవన్ కోసం మరో యంగ్ డైరెక్టర్ ని త్రివిక్రమ్ రంగంలోకి దింపుతున్నారు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. మేటర్ లోకి వెళితే ఇటీవల సాయి పల్లవి ప్రధాన పాత్రలో “విరాటపర్వం” అనే సినిమానీ డైరెక్టర్ వేణు తెరకెక్కించడం తెలిసిందే. ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో త్రివిక్రమ్ ఇటీవల వేణు ని పిలిచి పవన్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయాలని.. సూచించినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అంతా ఓకే అయితే త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!