`ఆచార్య` వంటి బిగ్ డిజాస్టర్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రం `గాడ్ ఫాదర్` . మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్`కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, పూరీ జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. దసరా పండగ కానుకగా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. తాజాగా ఈ సినిమాకు ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ను యాడ్ చేశాడు. వాస్తవానికి చిరు-సల్మాన్ లపై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. కానీ అది కథలో సెట్ కాకపోవడంతో రోలింగ్ టైటిల్స్ మీదకు మార్చేశారు.
దీంతో సినిమాలో ఐటెం సాంగ్ ఉండాలని అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఓ పాటను చిత్రీకరించారు. బింబిసార సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసిన వరినా హుస్సేన్ `గాడ్ ఫాదర్` ఐటెం సాంగ్‌ను చేసిందట. ఇక ఈ సాంగ్ కోసం మేకర్స్ ఏకంగా కోటిన్నరకు పైగా ఖర్చు చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఇంత ఖర్చు పెట్టిన తీసిన ఆ సాంగ్ ఎలా ఉండబోతోందో చూడాలి.
https://twitter.com/UrsVamsiShekar/status/1574023711707234304?s=20&t=qnyOlvRjye8xqLx00D4DyQ
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!