24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
Entertainment News సినిమా

New Year Resolutions 2023 : ఈ ఏడాది ఓటీటీ లకు అలవాటైన ప్రేక్షకులను.. 2023లో థియేటర్ లకి రప్పించాలంటే.. ఏం చేయాలి..?

Share

New Year Resolutions 2023 : ఒకప్పుడు ధైనిందిన జీవితంలో మనిషి అనేక సమస్యలతో.. ఉన్న టైంలో సినిమా చూసి విశ్రాంతి పొందేవాడు. ఈ క్రమంలో ప్రత్యేకంగా థియేటర్ లకి వెళ్లి టికెట్ల కోసం క్యూలో నిలబడి రెండున్నర గంటలు తనివి తీర సినిమా చూసి ఎంజాయ్ చేసేవాడు. అప్పట్లో పరిస్థితి అలా ఉండేది. అంతేకాదు  వచ్చిన ప్రతి సినిమా మినిమం 50 రోజులు కచ్చితంగా ఆడేది. ఇంకా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అంటే 100,150…200 రోజులు ఆడే పరిస్థితి ఉండేది. పైగా థియేటర్ లో రిలీజ్ అయిన సినిమా టెలివిజన్ లో  ప్రసారం కావడానికి సంవత్సరం పట్టేది. దీంతో సినిమా ధియేటర్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు ఉండేది. సైకిల్ స్టాండ్ వ్యక్తి నుండి థియేటర్ యాజమాన్యం వరకు అందరూ కూడా లాభపడేవాళ్లు. కానీ ఎప్పుడైతే టెక్నాలజీ… రావటం జరిగిందో.. సినిమా థియేటర్ వ్యాపారం డేంజర్ జోన్ లో పడింది అని చెప్పవచ్చు.

What should be done to attract the audience to come back theaters in 2023

యూట్యూబ్..తో పాటు రకరకాల వెబ్ సైట్స్ వచ్చాక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్.. 3g, 4g స్మార్ట్ ఫోన్ రూపంలో మనిషి అరచేతిలోకి వచ్చేసింది. దీంతో థియేటర్ పై సినీ ప్రేమికులు మోజులు తగ్గిపోయాయి. అయినా గాని 3g, 4g స్మార్ట్ ఫోన్ లు వచ్చిన.. అద్భుత రీతిలో సినిమాలు తెరకెక్కించడంతో 2019 వరకు.. సినిమా ధియేటర్ వ్యాపారానికి ఎటువంటి ఢోకా లేదు. కానీ ఎప్పుడైతే మహమ్మారి కరోనా వచ్చిందో.. అనేక రంగాలతో పాటు థియేటర్ వ్యాపారం ప్రమాదంలో పడింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు థియేటర్ వ్యాపారానికి భారీగా నష్టాలు తీసుకొచ్చాయి.

What should be done to attract the audience to come back theaters in 2023

కరోనా ఎఫెక్ట్ ఓటీటీ రంగం పుంజుకోవటం…

ఇక ఇదే సమయంలో ఓటీటీ రంగం పుంజుకోవటం జరిగింది. పైగా ఓటీటీకి సెన్సార్ లేకపోవడంతో మంచి కంటెంట్ లు రావటంతో ప్రేక్షకులు దియేటర్ లో సినిమాకి బదులు ఓటీటీ స్టఫ్ లకి బాగా అలవాటు పడిపోయారు. థియేటర్ లో రెండుసార్లు టికెట్ కొనుగోలు చేసే ఖర్చుకి… ఏడాది పాటు ఓటీటీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు చూసే పరిస్థితి ఉండటంతో ప్రేక్షకులు.. సినిమా థియేటర్ల వైపు చూడటానికి తక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు సినిమా ధియేటర్ కి దూరమైపోయిన ప్రేక్షకులను మళ్లీ తీసుకురావాలంటే ఏం చేయాలి..?..అనేది మిలియన్ డాలర్ సందేహంగా మిగిలిపోయింది.

What should be done to attract the audience to come back theaters in 2023

మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు డోకా లేదు..

అసలు సినిమా వ్యాపారం పడిపోయిందా..? అలా అయితే 1000 కోట్లు కలెక్షన్ ఎలా వస్తున్నాయి..?.  వీటన్నిటి బట్టి చూస్తే సినిమా ధియేటర్ వ్యాపారం ఏమీ పడిపోలేదని.. సరైన కంటెంట్ కలిగిన సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ ఏడాది పలు సినిమాలు రుజువు చేశాయి. ఒకప్పుడు చిన్న సినిమాలకు బిజినెస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా కాదు… విడుదలైన సినిమాలో మంచి కంటెంట్ ఉంటే బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే సందర్భంలో ప్రేక్షకుల ఆలోచన సరళి కూడా మారింది. అందుకు నిదర్శనం సీతారామం, కాంతారా, కార్తికేయ 2.. ఇంకా పలు సినిమాలు. RRR, KGF 2 అయితే ఏకంగా ₹1000 కోట్లకు పైగా కలెక్షన్ సాదించి రికార్డ్స్ క్రియేట్ చేశాయి. 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా మంచి కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాలు  రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి.

What should be done to attract the audience to come back theaters in 2023

 

టెక్నాలజీ పరంగా త్రీడి ఫార్మేట్..

ఈ రీతిగానే 2023లో వైవిధ్యమైన కంటెంట్ కలిగిన సినిమాలు చేస్తే థియేటర్ లకి జనాలు రావడం గ్యారెంటీ. ఇంకా టెక్నాలజీ పరంగా…3D.. తరహాకి పెద్దపీట వేసి సినిమాలు చేస్తే… ఆరు నూరైనా ప్రేక్షకుడు సినిమా ధియేటర్ కి రావాల్సిందే. “అవతార్ 2” డిసెంబర్ 16వ తారీకు రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ఒకరోజు ముందే టెలిగ్రామ్ యాప్ లో లీక్ అయిపోయింది. కానీ సినిమా త్రీడీ రూపంలో తీయడంతో.. ప్రేక్షకులు థియేటర్ కి బ్రహ్మ రథం పట్టారు. జేమ్స్ కామెరూన్.. సినిమాలో సముద్ర గర్భంలో చూపించిన మరో వింత విజువల్ వండర్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ వస్తున్నాయి. సో ఇటువంటి సిత్రీడీ తరహా సబ్జెక్టు కలిగిన మూవీలు చేస్తే.. ప్రేక్షకులు సినిమా ధియేటర్లకు రావాల్సిందే. గత రెండు మూడు సంవత్సరాలు కరోనా భయంతో చాలా వరకు జనాలు బయటికి రాని పరిస్థితి. కానీ ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గటంతో పాటు వ్యాక్సిన్ లు కూడా వచ్చేసాయి. ప్రపంచం మళ్లీ యధావిధిగా ముందుకు సాగుతుంది. ఇలాంటి తరుణంలో సినిమా ధియేటర్లకు మళ్లీ ప్రేక్షకులు రావాలంటే కొత్త కంటెంట్ తో పాటు టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తే… థియేటర్ వ్యాపారానికి మంచి రోజులు ఖాయమని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : బిగ్ బాస్ ను నాశనం చేస్తున్న కంటెస్టెంట్స్…? ప్రేక్షకుల నుండి కంప్లైంట్…. రేటింగ్ హుష్ కాకి

arun kanna

RRR: ఇండియన్ ఫిలిం హిస్టరీ లో డిజిటల్ రైట్స్ విషయంలో “RRR” బ్రేకింగ్ రికార్డ్స్…??

sekhar

Mahesh: ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు..

GRK