ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Migraine: మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్నారా..!? అయితే వెంటనే వీటిని తినడం మానేయండి..!

Share

Migraine: మైగ్రేయిన్ తలనొప్పితో బాధపడేవారు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.. ప్రపంచంలో 100 మిలియన్ల మంది మైగ్రేయిన్ తలనొప్పితో బాధపడుతున్నారని అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ తెలిపింది.. కొన్ని రకాల ఆహార పదార్థాలు పానీయాలు తీసుకోవడం వలన మైగ్రేన్ తలనొప్పి ఇంకా తీవ్రమవుతుంది.. అవేంటంటే..!?

Avoid These Foods Suffering Migraine: Headache
Avoid These Foods Suffering Migraine: Headache

మద్యం సేవించన తరువాత మైగ్రేన్ తలనొప్పికి గురవుతున్నారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ద్వారా తెలిపింది . ముఖ్యంగా రెడ్ వైన్ తాగేవారిలో 77 శాతం మంది మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్నారు. మద్యం తాగడం వలన శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. తలనొప్పి రావడానికి డీహైడ్రేషన్ ప్రధాన కారణం. మద్యం తర్వాత మైగ్రేన్ ప్రేరేపించే అత్యంత సాధారణ ఆహారం చాక్లెట్. ఇందులో మైగ్రేన్ నొప్పి పెంచే బీటా ఫెనిలేథైలమైన్ అనే రసాయనం ఉంటుంది. ఇక టీ, కాఫీ లలో కూడా కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువగా తీసుకోకూడదు.

Avoid These Foods Suffering Migraine: Headache
Avoid These Foods Suffering Migraine: Headache

ఐస్ క్రీమ్, చల్లటి పదార్థాలు తీసుకోవడం వలన తీవ్రమైన తలనొప్పి వస్తుంది. పచ్చళ్ళు, పుల్లగా ఉండే ఆహారం, పులియబెట్టిన ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకింగ్ ఫుడ్, బయట దొరికే చిరుతిళ్లు తీసుకోవడం వల్ల మైగ్రేన్ పై ప్రభావం చూపిస్తుంది. చీజ్ కూడా మైగ్రేన్ పై దాడి చేస్తుంది. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, నిల్వ ఉంచిన మాంసాహారం తినడం, ప్రాసెస్ చేసిన మాంసం కూడా మైగ్రేన్ లకు దారి తీస్తుంది. మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్న వారు వీటన్నింటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.


Share

Related posts

Panjab Elections: ఈసీకి పంజాబ్ సీఎం కీలక సూచన..! ఈసీ ఆ సూచన ఆమోదిస్తుందా..?

somaraju sharma

AP High Court: ఏపి హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు

somaraju sharma

Vijaya Sai Reddy: అశోక్ గజపతిరాజుపై మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపి విజయసాయిరెడ్డి

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar