Pulipirlu : పులిపిరి కాయల గురించి మీరు వినే ఉంటారు..చర్మ సంబంధిత సమస్యల్లో పులిపిర్లు సమస్య కూడా ఒకటి. ఆడవాళ్లు, మగవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేదిస్తూ ఉంటాయి ఇవి. నిజానికి పులిపిర్ల వల్ల మనకు ఎటువంటి హాని జరగదు కానీ వీటిని చూడడానికి మాత్రం అందవిహీనంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ పులిపిర్లు మెడ భాగంలో, ముఖం మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి.అంతేకాకుండా శరీరంలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా పులిపిర్లు వస్తాయి. ఈ పులిపుర్లను తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వీటిని తిలగించుకోవడానికి పెద్దగా కష్టపడాలిసిన పని లేదు. మేము చెప్పే ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు పులిపిర్లు సులభంగా తగ్గిపోతాయి.మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లులి రసం :
పులిపిర్లను తొలగించడంలో వెల్లుల్లి రసం బాగా ఉపయోగపడుతుంది.ఇందుకోసం ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మెత్తగా నూరి ఆ రసాన్ని తీసి దాన్ని పులిపిర్ల మీద రాయాలి. ఇలా తరచూ చేయడం వల్ల పులిపిర్లు కొన్ని రోజులకు వాటంతటా అవి రాలిపోతాయి.
ఆపిల్ సైడ్ వెనిగర్ :
మరొక చిట్కా ఏంటంటే ఆపిల్ సైడ్ వెనిగర్ చిట్కా. ఈ ఆపిల్ సైడ్ వెనిగర్ ను ఉపయోగించి కూడా మనం పులిపిర్లను తగ్గించుకోవచ్చు. ఒక గిన్నెలో నీటిని తీసుకుని దానిలో ఆపిల్ సైడ్ వెనిగర్ ను వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో దూదిని ముంచి పులిపిర్ల మీద రాయాలి. ఇలా క్రమం తప్పకుండా పులిపిర్ల మీద రాస్తూ ఉండడం వల్ల పులిపిర్లు తొలగిపోతాయి.
అరటిపండు తొక్క :
అలాగే పులిపిర్లను తగ్గించడంలో అరటి పండు బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక అరటి పండు తొక్కను తీసుకుని దానిని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఇప్పుడు రాత్రి పడుకునే ముందు పులిపిర్లు ఉన్న దగ్గర అరటి పండు తొక్కను ఉంచి అది పడిపోకుండా ప్లాస్టర్ ను వేయాలి. ఉదయం లేవగానే దీనిని తీసి వేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల పులిపిర్లు తగ్గిపోతాయి.