Navagrahas: మనకున్న నవగ్రహాలు కేవలం మనల్నే కాదు మన ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి కొన్ని రోజు లలో తినే ఆహారాలు ఔషధ విలువలు కలిగి శరీరం వాటిని పూర్తిగా గ్రహిస్తుంది. అయితే అన్ని సార్లు అలాగే చేయలేకపోయినా ఏ వారం తినవలసినవి ఆ వారం తినడానికి ప్రయత్నించి చూడండి. అసలు ఏ వారం ఏ ఆహారమా తీసుకుంటే మనకు మంచిది అన్నది తెలుసుకుందాం.
మన ఆహారం పై ఆదివారం రోజు సూర్యుని ప్రభావం ఉంటుంది. కనుక మనం ఎలాంటి ఆహారం తిన్నప్పటికి సులువుగా జీర్ణం అయి శరీరం గ్రహించేస్తుంది. గోధుమలతో,రాగులతో చేసిన పదార్థాలు తినడం మంచిది.
సోమవారం రోజు చంద్రుడి ప్రభావం ఉంటుంది. చంద్రుడు నీటి సంబంధిత గ్రహం. కనుక నీరు ఎక్కువగా వుండే, పుచ్చ పండు,గుమ్మడి, దోస, వంటివి తింటే బాగా జీర్ణం అవుతాయి .
మంగళవారం రోజు కుజుడి ప్రభావం ఉంటుంది. కుజుడు వేడి గ్రహం అని అంటారు. కనుక వేడి పుట్టించే ఉల్లిపాయ, పైన్ ఆపిల్, మిరియం, వెల్లుల్లి, మామిడి పండు,మొదలైనవి తినడం వలన వాటిని మన శరీరం బాగా గ్రహించి త్వరగా జీర్ణం చేయబడతాయి.
బుధవారం రోజు బుధుడి ప్రభావం ఉంటుంది. ఈ గ్రహం రెండు రకాలు గా ఉంటుంది కనుక ఏ ఆహారం తీసుకున్నా పరవాలేదు. పచ్చ పెసలు తో ,పచ్చిబఠాని తో చేసిన ఆహారం తీసుకోవచ్చు.గురువారం రోజు గురుగ్రహ ప్రభావం ఉంటుంది. పసుపు లేదా ఆరెంజ్ రంగు ఆహారాలు… అరటిపండు, నిమ్మ, ఆరెంజ్,మొదలైనవి తినడం మంచిది.