NewsOrbit
హెల్త్

యాపిల్ తొక్కను తీసి తింటున్నారా? అయితే ఇది చదవండి….

యాపిల్ ఒకప్పుడు అధిక ధరలతో ధనవంతుల పండుగా ఉండేది , ప్రస్తుత కాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చి నిత్య ఆహారంలో భాగమైంది . భూమి మీద అధిక పోషక విలువలు కలిగిన పండ్లలో యాపిల్ ఒకటి అని చెప్పవచ్చు. యాపిల్ పండ్లు మన శరీరానికి అవసరమైన విటమిన్ C , కార్బోహైడ్రేట్స్, ఫైబర్ పుష్కలంగా లభిస్తున్నాయి. అంతేకాకుండా మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తున్నాయి.

యాపిల్ ను తొక్కతో తినాలా? తొక్కతీసి తినాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది . అయితే చాలామంది యాపిల్స్ నీ తొక్క తీసి తినడానికి ఇష్టపడతారు, అది పొరపాటే . ఆపిల్ కండ భాగంలో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్ని ఉన్నాయో అన్ని తొక్క భాగంలో కూడా ఉంటాయి. యాపిల్ తొక్కను తీసి తింటున్నాము అంటే పోషక విలువలను తీసిపారేసినట్లే లెక్క.

యాపిల్ తొక్కతో తింటే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం. ఆపిల్ లో అధికంగా విటమిన్ సి ఉంటుందని మనకు తెలుసు. అధికభాగం తొక్క భాగంలోనే ఉంటుంది. యాపిల్ తొక్క తో పాటు తింటే విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తుంది. యాపిల్ తొక్క లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి దీన్ని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ , రొమ్ము క్యాన్సర్, వంటి క్యాన్సర్ లక్షణాలను మనం సమృద్ధిగా ఎదుర్కొనవచ్చు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. యాపిల్ తొక్క ఉండే ఉర్సోలిక్ ఆమ్లం , మన శరీరములో వుడే కొవ్వు కణాలను కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆపిల్ తొక్కలో క్యాల్షియం పాస్పరస్ అధిక మొత్తంలో ఉండటంవల్ల ఎముకల దృఢత్వానికి సహాయ పడుతుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి.యాపిల్ తోక్కలో పీచుపదార్ధం అధికంగా ఉంటుంది. వాటిలో అధిక భాగం కరగని పీచుపదార్ధం నీటితో బైండింగ్ చెంది, మలబద్ధకాన్ని నిరోధిస్తుంది . కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.. కాబట్టి యాపిల్ ని తొక్క తో తింటే మన శరీరానికి సంపూర్ణ పోషణ లభిస్తుంది.

ముఖ్య విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో ఆపిల్ కాంతి వంతంగా కనపడాలని మైనపు పూత వేస్తున్నారు మనకు తెలుసు, కొన్ని రకాల రసాయనాలు, క్రిమిసంహారక మందులు వాడుతూ ఉండటం వల్ల యాపిల్స్ నీ తినేముందు మంచి నీటితో శుభ్ర పరచుకోవడం మర్చిపోవద్దు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri