NewsOrbit
Horoscope దైవం

September 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? సెప్టెంబర్ 19 భాద్రపదమాసం రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
Advertisements
Share

September 19: Daily Horoscope in Telugu సెప్టెంబర్ 19 – భాద్రపదమాసం –మంగళవారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
ఇంటా బయట పని ఒత్తిడులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమానంతరం పనులు పూర్తి అవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి.

Advertisements
Daily Horoscope to start your day, August 7 2023 Daily Horoscope, August 7 Rasi Phalalu
Daily Horoscope to start your day september 19 th 2023 Daily Horoscope september 19 th Rasi Phalalu

వృషభం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
మిధునం
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

Advertisements
daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
daily horoscope september 19 th 2023 rasi phalalu Bhadrapadamasam

కర్కాటకం
పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులుంటాయి. మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.
సింహం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు.

కన్య
దూరపు బంధువులు కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
తుల
ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం
వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు.
ధనస్సు
కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.
కుంభం
ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మానసిక బాధను కలిగిస్తుంది.
మీనం
కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share
Advertisements

Related posts

జూలై 24 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

తిరుమలలో సర్వదర్శన టోకెన్లు నిలిపివేత !

Sree matha

Today Horoscope: ఏప్రిల్ 17 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma