NewsOrbit
జాతీయం న్యూస్

PM Modi: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం .. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం .. స్వాగతించిన బీఆర్ఎస్

Advertisements
Share

PM Modi: మరో ఎనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ డిమాండ్ ను మోడీ ప్రభుత్వం నెరవేరుస్తుందని, మహిళా రిజర్వేషన్ డిమాండ్ ను నెరవేర్చే ధైర్యం మోడీ సర్కార్ కే ఉందని పేర్కొన్నారు. మంత్రివర్గ ఆమోదంతో ఇది రుజువైందని అన్నారు.

Advertisements

ఈ సందర్భంగా మోడీ సర్కార్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్. అయితే ప్రహ్లాద్ సింగ్ పటేల్ కొద్దిసేపటికే ఆ ట్వీట్ ను తొలగించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న వేళ కేంద్రం ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు ఇంకే నిర్ణయాలు తీసుకున్నారో బహిరంగ పర్చలేదు. దీంతో సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే కేంద్రం కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిందన్న విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత స్పందించారు.

Advertisements

తమ పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ బిల్లుకు మద్దతు తెలియజేస్తుందని చెప్పారు కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ గతంలో ప్రధాని మోడీకి లేఖ రాశారని చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్ఎస్ కృషి ఉందన్నారు. బలమైన పార్టీల డిమాండ్ వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ట్వీట్ చేశారు. అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతుందని అన్నారు. మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కవిత నివాసం వద్ద మహిళలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్ డీ దేవగౌడ్ సారధ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వాజ్ పేయ్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు ఆమోదానికి నోటుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్ సభలో మాత్రం పెండింగ్ లోనే ఉండిపోయింది. 2014లో లోక్ సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో మోడీ సారధ్యంలోని కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. ఎన్డీఏ సర్కార్ లోక్ సభలో పూర్తి మెజార్టీ ఉండటంతో బిల్లు పాస్ కావడం అనేది లాంఛనమే.

CM YS Jagan: తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్


Share
Advertisements

Related posts

నో డౌట్ …నా పై దాడి యత్నం వెనక ఉన్నది చంద్రబాబే:బాపట్ల ఎంపీ సురేష్ బాబు

Yandamuri

బిగ్ బాస్ 4: అఖిల్ బ్రదర్ అభిజిత్ విషయంలో హోస్ట్ నాగార్జున కే షాక్ ఇచ్చాడు..!!

sekhar

TDP ; చంద్రబాబు – చారిత్రక కష్టాలు..! అటు పరువు – ఇటు నమ్మకం..!!

Srinivas Manem