NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-25- పాల్గుణ మాసం – గురువారం.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి – 25 – ఫాల్గుణ మాసం – గురువారం.

మేష రాశి Today Horoscope మార్చి – 25 – ఫాల్గుణ మాసం – గురువారం.ఉద్యోగస్తులకు ఆటంకాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు అధికమవుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. ఉద్యోగస్తుల కు కార్యాలయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. స్నేహితుల వల్ల చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటు తనం వల్ల మీకు కావలసిన వారు దూరమవుతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. స్త్రీలకు పని వత్తిడి ఎక్కువ అవుతుంది. ప్రశాంతత కోల్పోతారు.
రెమిడీః ఈరోజు కాలభైరవాష్టకం పారాయణం చేసుకోండి, సాయంత్రం సమయంలో శునకాలకు ఆహారం సమర్పించండి.

వృషభ రాశి Today Horoscope మార్చి – 25 – ఫాల్గుణ మాసం – గురువారం.మిత్రులను కలుసుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణ బాధలు తగ్గిపోతాయి. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆనందంగా ఉంటారు. మితమైన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఆచార సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. కార్యాలయాల్లో పదోన్నతలు పొందుతారు. రెమిడీః ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

మిధున రాశి Today Horoscope మార్చి – 25 – ఫాల్గుణ మాసం – గురువారం.అనారోగ్య సమస్యలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. స్నేహితులతో వివాదాలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు అధికంగా చేస్తారు. సమయానికి చేతిలో డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బంది. పెద్ద వారిని గౌరవించక పోవడం వల్ల నష్టపోతారు. సమయానికి నిద్ర హారాలను తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు.
రెమిడీః విశ్వేశ్వరుని ఆరాధించండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి – 25 – ఫాల్గుణ మాసం – గురువారం.శుభవార్తలు వింటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయట పడతారు. సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప అవకాశాలను అందుకుంటారు. పనిభారం తగ్గించుకుంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు. శుభవార్తలు వింటారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.
రెమిడీః అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

today horoscope in telugu march 25
today horoscope in telugu march 25

సింహరాశి Today Horoscope మార్చి – 25 – ఫాల్గుణ మాసం – గురువారం.ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయలేక నష్టపోతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అతి కష్టం మీద ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. పని వత్తిడి ఎక్కువ అవుతుంది. ప్రశాంతత కోల్పోతారు. స్థిరాస్తులు అనుకూలించక ఇబ్బందులు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను కోల్పోతారు.
రెమిడీః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope మార్చి – 25 – ఫాల్గుణ మాసం – గురువారం.ప్రశాంతంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. తొందరగా ఎదుటివారిని అర్థం చేసుకుంటారు. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకొని బాధ్యతగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తి చేసి ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. విలువైన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు.
రెమిడీః ఈరోజు బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.

తులారాశి Today Horoscope మార్చి – 25 – ఫాల్గుణ మాసం – గురువారం.రుణ బాధలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ కోల్పోవడం వల్ల ఇబ్బందులు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. సంతాన విషయంలో అశ్రద్ధ చూపడం వల్ల సమస్యలు. రుణ బాధలు పెరుగుతాయి. ఆదాయం తక్కువ అవుతుంది. ఆర్థిక నష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. సోదరులతో విభేదాలు.
రెమిడీః ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి – 25 – ఫాల్గుణ మాసం – గురువారం.స్నేహితుల సహకారం పొందుతారు !

ఈరోజు సంతోషకరం గా ఉంటుంది. ఎదుటి వారి తప్పులను సరిదిద్దుతారు. కుటుంబంలో అందరితో కలిసి మెలిసి ఉంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సహకారం పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు పెద్ద వారి సలహాలను తీసుకొని కష్టపడి చదువుకుంటారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వ్యాపారాల్లో అధిక లాభాలు. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి – 25 – ఫాల్గుణ మాసం – గురువారం.పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు అనుకూలంగా లేదు. కొన్ని విషయాల్లో తప్పులు చేసి పశ్చాత్తాప పడతారు. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. మీలో ఉన్న ఓర్పు సహనం దూరమై మీ మీద నిందలు పడతాయి. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. పెట్టుబడులు అనుకూలించవు. ప్రయాణ నష్టం కలుగుతుంది.
రెమిడీః సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

 మకర రాశి Today Horoscope మార్చి – 25 – ఫాల్గుణ మాసం – గురువారం.స్నేహితులకు ప్రాధాన్యతనిస్తారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. స్నేహితులకు ప్రాధాన్యతనిస్తారు. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న సమయానికి సాధించడానికి తపన పడతారు.
రెమిడీః ఈరోజు శ్రీ లలితా అష్టోత్తర శత నామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి Today Horoscope మార్చి – 25 – ఫాల్గుణ మాసం – గురువారం.స్వల్ప నష్టాలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. మనోవేదనకు గురవుతారు. తొందరపడి డబ్బు సంపాదించాలని చిన్నచిన్న అబద్ధాలు చెప్పడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులు స్నేహితులతో కలిసి చదువును నిర్లక్ష్యం చేస్తారు. కార్యాలయాల్లో అనుకోని ఆటంకాలెదురవుతాయి. వ్యాపార భాగస్వాముల వల్ల స్వల్ప నష్టాలు కలుగుతాయి. క్రయవిక్రయాలు అనుకూలించక బాధపడతారు.
రెమిడీః విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మీన రాశి Today Horoscope మార్చి – 25 – ఫాల్గుణ మాసం – గురువారం.స్థిరాస్తులు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. పెద్దవారిని గౌరవిస్తారు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి అధిక లాభాలు పొందుతారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. స్త్రీలు కుటుంబ బాధ్యతలను పెంచుకొని ఆనందంగా ఉంటారు. దైవారాధన చేస్తారు.
రెమిడీః కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju