NewsOrbit
జాతీయం న్యూస్

కరోనా కొత్త వేరియంట్ల భయం …రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం

Corona Cases Increased in India

వదల బొమ్మాలి అన్నట్లు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వదిలి ఇప్పట్లో వెళ్లేలా కనబడటం లేదు. చైనా లోని వ్యూహాన్ లో పురుగు పోసుకుని ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసి కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా పలు దేశాల్లో కొనసాగుతూనే ఉంది. కరోనా కేసులు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భారత్ తో సహా అనేక దేశాల్లో జనాలు సాధారణ జన జీవనానికి అలవాటు పడ్డారు. అయితే చైనా తో సహా పలు దేశాల్లో కోవిడ్ కేసులు మరల భారీ సంఖ్యలో నమోదు అవుతుండటం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తొంది. వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది.

corona

 

కోవిడ్ కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలనీ, పాజిటివ్ కేసుల నమోదును జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని సూచించింది. ఇన్సాకాగ్ నెట్ వర్క్ ద్వారా కొత్త కేసులను ట్రాక్ చేయాలని సూచిస్తూ రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లేఖ రాసింది.

జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనా లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాకేశ్ భూషణ్ పేర్కొన్నారు. కొత్త వేరియంట్ లను ఇన్సకాగ్ నెట్ వర్క్ ద్వారా ట్రాక్ చేసేందుకు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలా చేయడం వల్ల సరైన సమయంలో కొత్త వేరియంట్ లను గుర్తించగలగుతామనీ, దానికి తగినట్లుగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతామని రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు.

ప్రజాగ్రహం నేపథ్యంలో చైనా ఇటీవల కరోనా ఆంక్షలను సడలించింది. దీంతో రోజు వారి కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే మూడు నెలల్లో కరోనా ప్రబలుతున్న దేశాల్లో అక్కడి జనాభాలో 60 శాతం మంది ప్రజలు కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంది దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు 35 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. భారత్ లో మంగళవారం 112 కొత్త కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,490గా ఉంది.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్ ఇది

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju