Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ లో డేంజ‌ర్ డేస్ ఎప్పుడో తెలుసా?

Share

Corona: గ‌త కొద్దిరోజులుగా క‌రోనా థ‌ర్డ్ వేవ్ గురించి ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచం థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించడం దీనికి కార‌ణం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రానున్న 100-125 రోజులు అతి కీలకమని తెలిపింది. కోవిడ్‌కు వ్యతిరేకంగా భారతదేశం ఇంకా హెర్డ్‌ ఇమ్యూనిటీ(సామూహికంగా రోగనిరోధకశక్తి సంతరించుకోవడం) సాధించలేదని పేర్కొన్న కేంద్రం ఈ నేప‌థ్యంలో కొత్త వేరియంట్లు దాడి చేయొచ్చని హెచ్చరిస్తూ ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేసింది.

Read More: Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ పై సంచ‌ల‌న వార్నింగ్‌.. ముప్పు త‌ప్ప‌దా?

కేంద్రం ఏమంటుందంటే…

కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో నీతిఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకేపాల్‌ మాట్లాడుతూ, ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్‌వేవ్‌ దిశగా కదులుతున్నామనడానికి ఇది సంకేతమన్నారు. కొవిడ్‌-19 నిబంధనలను కచ్చితంగా పాటిస్తేనే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే గ్లోబల్‌ హెచ్చరికను జారీ చేసిందని, దాని పట్ల మనం అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యరంగంలో మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఆయ‌న తెలిపారు.

Read More: Corona: షాక్ః మ‌ళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు… మ‌న సంగ‌తి ఏందంటే…

కేంద్రం ఏం చెప్తోందంటే…
ఈ సంద‌ర్భంగా కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. అనేక దేశాలలో కోవిడ్ కేసులు మరోసారి పెరిగాయన్నారు. పొరుగు దేశాలైన మయన్మార్, ఇండోనేషియా, మలేషియా, బంగ్లాదేశ్‌లలో కూడా కేసులలో పెరుగుదల కనిపిస్తుందని చెప్పారు. ముఖ్యంగా మయన్మార్‌, బంగ్లాదేశ్‌లో సెకండ్‌వేవ్‌తో పోలిస్తే థర్డ్‌వేవ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నదన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక, మాస్కుల వాడకం దాదాపు 74 శాతం తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర‌జ‌లు క‌రోనా మార్గద‌ర్శ‌కాలు పాటించాల‌న్నారు.


Share

Related posts

Pooja hegde: పూజా హెగ్డేకి ప్రొడ్యూసర్ వార్నింగ్..నెమ్మదిగా అమ్మడిని సైడ్ చేసేస్తారా..?

GRK

ఎన్‌టి‌ఆర్ – చరణ్ కి భారీ డ్యామేజ్ చేసిన బాలయ్య – నాగబాబు

siddhu

తమన్నా కోసమే అంటున్న అల్లు అరవింద్ ..ప్లాన్ మాత్రం వేరే ఉందట ..?

GRK