సీనియర్ కాంగ్రెస్ నేత పవన్ ఖేడా సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేడాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా, గంటల వ్యవదిలోనే ఆయనకు సుప్రీం కోర్టు ఉపశమనం ఇచ్చింది. అరెస్టు అయిన కొద్దిసేపటికే ఆయనకు మద్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయనను హైడ్రామా మధ్య ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అసొం పోలీసుల కోరిక మేరకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ పార్టీ నేతలతో విమానం ఎక్కిన పవన్ ఖేడాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మరో పక్క కాంగ్రెస్ ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్ పిటిషన్ ను అత్యవసరంగా విచారణ స్వీకరించిన సీజే జస్టిస్ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం .. పవన్ కు తాత్కాలిక ఊరట కలిగేలా ఆదేశాలు జారీ చేసింది. పవన్ కు మథ్యంతర బెయిల్ వచ్చే మంగళవారం వరకూ అమల్లో ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పవన్ భేడాపై దాఖలైన కేసులన్నింటిని కలిపి ఒకే కోర్టులో విచారించాలనే అభ్యర్ధనపై తమ సమాధానం చెప్పాలంటూ అస్సాం, యూపీ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 27వ తేదీకి వాయిదగా వేసింది.
ఇంతకూ పవన్ ఖేడా ఏమి వ్యాఖ్యలు చేశారంటే .. ఈ నెల 17న ముంబాయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ప్రధాని పేరును నరేంద్ర దామోదర్ దాస్ మోడీకి బదులు నరేంద్ర గౌతమ్ దాస్ మోడీ అని పలికారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. మోడీ తండ్రి పేరును అవమానించారంటూ పలువురు బీజేపీ నేతలు మండిపడ్డారు. అసోంలోని దిమా హసావో జిల్లాలోని హప్లాంగ్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేత పవన్ ఖేడాపై ఓ బీజేపీ నేత ఫిర్యాదు చేశారు. అదే విధంగా వారణాసి, లక్నో నగరాల్లో కూడా పవన్ పై ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. ఇందులో ఆరోపణలు, పరువు నష్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
టీడీపీ తీర్ధం పుచ్చుకున్న కన్నా .. కన్నా చేరిక సందర్భంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు