మహానటి సినిమా కీర్తి సురేష్ కెరీర్ నే మార్చేసింది. అంతక ముందు చేసిన నేను శైల, నేను లోకల్ సినిమాల కంటే ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీ అసాధారణం. చెప్పాలంటే మహానటి కీర్తి సురేష్ కి కొన్ని సినిమాలలో నటించే ధైర్యాన్నిచ్చింది. అందుకే పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ లాంటి లేడి ఓరియెంటెడ్ సినిమాలు కమిటయింది. ఒకపక్క స్టార్ హీరోలతో హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ షాకిస్తోంది.
తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే అన్న సినిమాలోను నటిస్తున్న కీర్తి కి మనసు మాత్రం ఆ ఒక్క సినిమా మీదే ఉందట. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట. ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సింది. కీర్తి సురేష్ కూడా సర్కారు వారి పాట కోసం డేట్స్ ఇచ్చేసింది. కాని అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ మొదలవకుండా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది.
దాంతో కీర్తి కి ఈ సినిమా మీద విపరీతంగా ఆతృత పెరిగిపోతుందట. ఇక సర్కారు వారి పాట ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మహేష్ లుక్ మీద .. టైటిల్ మీద ఎంతగా హైప్ వచ్చిందో ఈ సినిమాలో మహేష్ కి జంటగా నటించే హీరోయిన్ ఎవరన్న క్యూరియాసిటీ అంతకంతా పెరుగుతూ వచ్చింది. అందరికీ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫిక్సైందని తెలినప్పటికి ఆ విషయం అధికారకంగా వెల్లడి కాకపోయోసరికి కొంత సందేహాలు మొదలయ్యాయి.
ఎట్టకేలకి ఆ సందేహాలన్ని బద్దలైపోయాయి. కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా స్వయంగా మహేష్ బాబు కీర్తి విషెస్ తెలుపుతూ సర్కారు వారి పాట లో హీరోయిన్ గా ప్రకటించేశారు. ఇక మహేష్ బాబు విషెస్ తెలినందుకు బదులుగా కీర్తి సురేష్ ఈ సినిమా సెట్స్ లో ఎపుడెప్పుడు జాయిన్ అవుతానా అన్న అతృత ని వెల్లడించింది. కాగా ఈ సినిమా యూనివర్సల్ పాయింట్ తో పాన్ ఇండియన్ సినిమగా తెరకెక్కబోతుంది.