NewsOrbit
న్యూస్

అడ్వెంచర్ ప్రియులారా.. మీ కోసమే.. ఈ గ్రూప్..!

 

ఇంట్లో ఉన్నది చాలు కాసింత ఊపిరి పీల్చుకుందామన్న ఆమె పిలుపుకు
ఇండోర్ కి చెందిన మహిళలు ఏకంగా డ్రైవింగ్ చేసి వారి అనుభవాలను పంచుకున్నారు ..! అసలు ఎవరు పిలుపునిచ్చారు ..? వాటి సంగతులేంటో..? ఇప్పుడు తెలుసుకుందాం ..!

 

 

మహిళలు ఒకప్పుడు వంటగదికే పరిమితమయ్యారు. కాలం మారటంతో ఇప్పుడిప్పుడే ఉద్యోగరీత్యా బయటకు వస్తున్నారు. స్త్రీలు వివిధ కారణాల వల్ల కలిసి ప్రయాణం చేస్తారు.ఆ ప్రయాణం సురక్షితంగా, సరదాగా, ఒత్తిడి లేకుండా ఉంటే అలా ప్రయాణించినప్పుడు వారు మార్పు కోసం తమపై దృష్టి పెడతారు.

‘అడ్వంచరస్‌ ఉమెన్‌ గ్రూప్‌’ దీని స్థాపకురాలు ఇండోర్‌ వ్యాపారవేత్త శ్రేష్టా గోయల్.‌ ఈ గ్రూప్‌ను ఈమె నిర్వహిస్తారు.ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం స్త్రీలను పర్యటనలు, విహార యాత్రలుచేసేందుకు ప్రోత్సహిస్తుంటారు. కరోనా కారణంగా కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉంది. సెప్టెంబర్ 20,2020 న “డ్రైవింగ్ ఈజ్ మై పేషన్” ఈవెంట్ ను సెప్టెంబర్ 10 నుంచి 30వ తేదీ నిర్వహించారు.ఇందులో దేశంలోని ఆరు రాష్ట్రాల నుంచి స్త్రీలు వచ్చారు. పలు రంగాలకు చెందిన వాళ్లు, గృహిణులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు వచ్చి ఇండోర్ లో తమ వాహనాలతో తిరిగారు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే వాహనం నడపాలంటూ, ఈ స్కిల్స్ స్త్రీలకు చాలా అవసరం కూడ. పురుషులతో పాటు సమానంగా గా స్త్రీలు కూడా కార్ డ్రైవింగ్ అడ్వెంచర్ లు చేయగలరంటూ వారు చేసి చూపించారు..

 

 

రాక్‌ ది రోడ్స్‌’ అంటూ కారులో జైపూర్‌ నుంచి బద్రీనాథ్‌కు, మంగళూరు నుంచి కేరళకు కారులో డ్రైవ్‌ చేసుకుంటూ ఇండోర్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ డైరెక్టర్‌ అర్యామా సన్యాల్‌ ఒక వీడియో విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రమహిళా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు శిఖ డ్రైవింగ్‌ చేయడం వలన ఫోకస్‌ పెరుగుతుంది. వాహనాన్నే కాదు జీవితాన్ని కూడా కంట్రోల్‌ చేయడం తెలుస్తుంది.అంతేకాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’ అని ఒక వీడియో ను పోస్ట్ చేశారు.స్త్రీలు తమ డ్రైవింగ్‌ అనుభవాలు పంచుకుని మహిళలను ఉత్సాహపరుస్తూ ఈవెంట్ ను విజయవంతం చేశారు.

జీవితమే ఒక సాహసం. ప్రయాణాల ద్వారా ఆ సాహసాన్ని కొనసాగించాలి’ అందుకనే ఇండోర్‌లో ఆమె ‘అడ్వంచరస్‌ ఉమెన్‌ గ్రూప్‌’ అనే సంస్థను స్థాపించినట్లు తెలిపారు.ఈమె ఇండోర్‌లోని ఒక ఫార్మాసూటికల్‌ కంపెనీ సీఈఓ. ఇంటికి, ఉపాధికి రెండింటిని సమన్వయం చేసుకుంటూనే తమ జీవితాన్ని లోకం చూసేందుకు గడపడానికి ఇష్టపడే స్త్రీలు ఈ గ్రూప్‌ ద్వారా ఒక దగ్గర చేరారు.కాళ్లకు చక్రాలున్నాయని నమ్మే స్త్రీలే ఈ గ్రూప్‌లో సభ్యులు. వీరు ఇండోర్‌ నుంచి కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూనే ఒకరోజు విహారానికి బయలుదేరారు. యాభైకిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాలు చూసి వచ్చారు.‘మేము పర్యటించడమే కాదు పర్యటించమని స్త్రీలకు స్ఫూర్తినిస్తాం’ అంటారు వాళ్లు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక పర్యటనను చేస్తుంటామని తెలిపారు. వీరిని చూస్తుంటే ప్రతిచోటా ఇలాంటి బృందాలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju