Akhanda: అఖండ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త ఆశలు..ఇక సరికొత్త రికార్డులు రాసుకోవాల్సిందే..

Share

Akhanda: గత ఏడాది నుంచి అన్నీ ఇండస్ట్రీస్‌ను కరోనా వెంటాడి ఆర్ధిక సంక్షోభంలో నెట్టేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి వేలకోట్లలో నష్ఠం వాటిల్లింది. ఈ కారణంగా ఇప్పటికే చాలా థియేటర్స్ గోదాములుగానూ, కళ్యాణ మండపాలుగాను మారాయి. సినిమాను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యాయి. వీటన్నిటిని తట్టుకొని గత ఏడాది కాస్త ధైర్యాన్ని ఇచ్చిన సినిమా మెగా హీరో సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్. మన మెగా హీరో ధైర్యం చేసి తన సినిమాను థియోటర్స్‌కు తీసుకువచ్చాడు.

akhanda-created new record

ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులను చూసి ఈ ఏడాది ప్రారంభంలో మాస్ మహారాజ రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో క్రాక్ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇండస్ట్రీకి కొత్త ఆశలు కలిగించింది. క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్ఠించిన సునుమిని ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కరోనా నుంచి బయటపడుతూ థియేటర్స్‌కు వచ్చిన జనాలు క్రాక్ సినిమాకు నీరాజనాలు పలికారు. ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ వసూళ్ళు రాబట్టిన సినిమాగా నిలిచింది.

Akhanda: ఇంతలోనే మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చి అందరినీ వణికించింది.

ఇంతలోనే మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చి అందరినీ వణికించింది. ఇలాంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమా అంటే థియేటర్స్‌కు ప్రేక్షకులు వస్తారా అనే సందేహాలు మొదలయ్యాయి. వాటన్నిటిని బాలయ్య అఖండ సినిమా పటాపంచలు చేసేసింది. ఏపీలో టికెట్ రేట్స్ సమస్య ఉన్నా కూడా అఖండ సినిమా భారీ వసూళ్ళను రాబట్టి అఖండ విజయాన్ని సాధించింది. ఇప్పటికే బ్రేకీవెన్ టార్గెట్ దాటేసింది అఖండ సినిమా. బోయపాటి – బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియన్ సినిమాల విషయంలో భయపడుతున్న మేకర్స్‌కు అఖండ కొండంత ధైర్యాన్నిచ్చింది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

25 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

28 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago