బిగ్ బాస్ ఇంటి ద్వారా బాగా ఫేమస్ అయిన అఖిల్ సార్థక్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు, గెస్ట్ గా షోలకు విచ్చేస్తూ మరింత ప్రేక్షకాదరణ పొందుతున్నాడు. ఇక ఈ సీజన్ ఫైనలిస్ట్ అయిన అఖిల్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక అంతే కాకుండా అతని ఆట తీరు తోడు తో మోనాల్ తో ప్రేమ వ్యవహారం ద్వారా కూడా మంచి క్రేజ్ వచ్చింది.
మొత్తానికి షో అయిపోయిన తర్వాత కూడా వీరిద్దరూ కలిసి తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అఖిల్-మోనాల్ వాట్సాప్ చాట్ లీక్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే ఇంటిలో రొమాన్స్ చేసి విపరీతంగా పాపులర్ అయిన అఖిల్, మోనాల్ ప్రస్తుతం మంచి ఆఫర్లు అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇంటి లో రొమాన్స్ చేస్తూ ముద్దులు కౌగిలింతలతో వీరిద్దరూ ఆటలో కన్నా పర్సనల్ విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ కావడం విశేషం.
ఇక తాజాగా అల్లుడు సినిమాలో మోనాల్ ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఇప్పుడు అఖిల్ గెస్ట్ గా ఒక షో కి ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు. డేర్ చేయడానికి అఖిల్ సిద్ధమని చెప్పగా మీ చివరి మూడు వాట్సాప్ చాట్స్ ఎవరితో చేశారో చూపించండి అని అడిగారు. అఖిల్ ఫోను చూపించగా అందులో మోనాల్ పేరు ఉంది. ఈ విషయాన్ని యాంకర్ లీక్ చేసి షాక్ ఇచ్చేసింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!