న్యూస్ సినిమా

శాకుంతలంగా అక్కినేని సమంత ..మోషన్ పోస్టర్ తో సర్‌ప్రైజ్ చేసిన గుణ శేఖర్ ..!

Share

శాకుంతలం గా అక్కినేని సమంత నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాలలో గాని .. అక్కినేని ఫ్యాన్స్ లో గాని.. కామన్ ఆడియన్స్ గాని ఎంత మాత్రం ఊహించలేదు. ఎందుకంటే సమంత ఇప్పటి వరకు ఇలాంటి కథ లు చేసింది లేదు. శాకుంతలం సినిమా ని దర్శకుడు గుణ శేఖర్ ప్రకటించగానే అందరూ ఈ సినిమాలో నటించేది ఖచ్చితంగా అనుష్క శెట్టి అని గట్టిగా ఫిక్సైపోయారు. ఎందుకంటే గుణశేఖర్ అనుష్క శెట్టి తో రుద్రమదేవి అన్న సినిమా చేశాడు. ఈ సినిమాలో అనుష్క పర్ఫార్మెన్స్ కి గుణశేఖర్ ఫిదా అయ్యాడు.

Samantha Akkineni to essay the lead role in Gunashekar's Shakuntalam!? -  ManaTeluguMovies.net

అంతేకాదు ఇలాంటి కథలకి అనుష్క శెట్టి కేరాఫ్ అడ్రస్ గా మారింది. అరుంధతి, భాగమతి, రుద్రమదేవి లాంటి సినిమాలు చేసి ఉండటం తో దాదాపు ఈ సినిమాలో అనుష్క ని మైండ్ లో ఫిక్స్ చేసుకున్నారు. కాని మధ్యలో గుణశేఖర్ శాకుంతలంగా అనుష్క శెట్టి కాదన్న టాక్ వచ్చింది. దాంతో పలువురు సౌత్ హీరోయిన్స్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ .. అలాగే కొత్త అమ్మాయిని శాకుంతలంగా పరిచయం చేయబోతున్నారు అని ప్రచారం జరిగింది.

కాని గుణ శేఖర్ ఇంత పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తారని మాత్రం ఎవరూ ఊహించలేదు. న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా గుణశేఖర్ శాకుంలంగా అక్కినేని సమంత నటిస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించి మోషన్ టీజర్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ మోషన్ టీజర్ .. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం తో పాటు భారీగా అంచనాలు పెంచేస్తోంది. ఇక సమంత జాను లాంటి భారీ డిజ్సాస్టర్ తర్వాత ఏకంగా శాకుంతలం లాంటి భారీ ప్రాజెక్ట్ లో నటించబోతుండటం విశేషం.


Share

Related posts

15 తిథులలో ఎప్పుడు ఏమి చేస్తే మంచిదో తెలుసుకోండి!!

Kumar

AP Govt: ఏపి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కీలక నిర్ణయం

somaraju sharma

Urvashi Rautela Striptease : నైట్ పార్టీలో బట్టలు విప్పి అందాలు ఆరబోసిన ఊర్వశి… వైరల్ గా మారిన వీడియో!

Teja