బాలీవుడ్ బ్యూటీ స్టార్ ఆలియా భట్ మొదటిసారి టాలీవుడ్ లో అడుగుపెట్టి నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ ఆర్ ఆర్. ఆర్ ఆర్ ఆర్ లో రాజమౌళి ఆలియా భట్ ని తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అయితే పాన్ ఇండియన్ సినిమా కాబట్టి హీరోలిద్దరు టాలీవుడ్ స్టార్స్ అయిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాబట్టి ఖచ్చితంగా బాలీవుడ్ స్టార్స్ అయితే ప్రాజెక్ట్ కి పర్ఫెక్ట్ గా ఉంటుందని పూర్తి స్థాయిలో పాన్ ఇండియన్ సినిమాగా తయారవుతుందని రాజమౌళి ఇలా ప్లాన్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.
తారక్, చరణ్ శక్తివంతమైన పోరాట యోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు రిలీజ్ చేసిన భీం ఫర్ రామరాజు, రీసెంట్ గా రిలీజ్ చేసిన రామరాజు ఫర్ బీం టీజర్స్ ఆర్ ఆర్ ఆర్ స్టామినాని చెప్పకనే చెప్పాయి. ఈ టీజర్స్ రిలీజయ్యాక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చేశారు. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో ఆలియా పాత్ర కి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్ ఆర్ ఆర్ లో ఆలియా భట్ క్యారెక్టర్ గ్లామరస్ గా ఉంటుందని సమాచారం. సినిమా కథ ఎలా ఉన్నా కాని అన్నీ ఎమోషన్స్ ఉండేలా రాజమౌళి ముందు నుంచి పక్కా ప్లాన్ తో ఉంటాడు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ రాజమౌళి సినిమాలో ఉండాల్సిందే.
అందుకే చరణ్ – ఆలియా మీద మంచి రొమాంటిక్ సీన్స్ ఉండబోతున్నాయట. అలాగే మంచి రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని తెలుస్తుంది. ఇందుకు ఉదాహరణగా బాహుబలి సినిమాలో తమన్నా క్యారెక్టర్ ని గుర్తు చేసుకోవచ్చని చెప్పుకుంటున్నారు. నిజంగా ఆలియా క్యారెక్టర్ గనక అలాగే ఉంటే ఖచ్చితంగా సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని అంటున్నారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!