తెలుగు తెరపై కుందనపు బొమ్మగా మెరిసి.. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది సమంతా. ఆ తరువాత తన అందమైన నటనతో తెలుగు సినీ పరిశ్రమంలో ఇప్పటికీ అగ్రకథానాయికగా వెలుగొందుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాల సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తోంది సమంత. ఇటీవలే ఓ బేబీ అంటూ మనముందుకు వచ్చిన సమంత.. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నెగటివ్ రోల్ పోషిస్తున్నారు. ఈ పాత్ర ప్రాధాన్యత నేపథ్యంలోనే సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అయితే, కెరియర్ మంచి ఫామ్‌లో దూసుకుపోతున్న తరుణంలోనే ఈ కుందనపు బొమ్మ, యువసామ్రాట్ నాగార్జున తనయుడు యంగ్ హీరో నాగచైతన్యను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలతో పాటు పలు టీవీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇటీవలే బిగ్‌బాస్ షోలో మెరిసి వావ్ అనిపించారు. నాగ్ ప్లేస్‌లో వచ్చి ఆయనకంటే తక్కువ ఎపిసోడ్లకు వ్యాఖ్యతగా వ్యవహరించిన సమంత భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే ఇప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే, సమంత తన లైఫ్‌కు సంబంధించిన ముచ్చట్లను అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమాల వివరాలే కాకుండా పర్సనల్ లైఫ్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల తాను ప్రారంభించిన బిజినెస్ విషయాలను కూడా వెల్లడించారు సమంత. తన పోస్టులు చేయడమే కాదు.. కామెంట్లకు కూడా రిప్లై ఇస్తుంటారు సమంత. దీనికి సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే..
సోషల్ మీడియాలో సమంత ఫొటోకు ఓ నెటిజన్.. చైకి (నాగ చైతన్య)కు విడాకులు ఇచ్చేయ్. మనమిద్ధరం పెళ్లి చేసుకుందాం అంటూ కామెంట్ చేశాడు. అయితే, దీనికి స్పందించిన సమంతా.. అయితే, నువ్ ముందు చైతూను అడుగు అంటూ రిప్లై ఇచ్చింది ఈ కుందనపు బొమ్మ. ప్రస్తుతం కామెంట్స్ ఫొటో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రకరకాల మీమ్స్ ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫన్నీ మీమ్స్ ను మీరు కూడా చేసేయండి మరి !
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!