Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు ఆర్హా గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. అతి చిన్న వయసులోనే సోషల్ మీడియాలో తన చిట్టి పొట్టి మాటలతో అల్లరి చేష్టలతో … అప్పట్లో బేబీ షామిలి ని తలపించే రీతిలో వీడియోలు చేసి మంచి క్రేజ్ సంపాదించింది. తండ్రికి తగ్గ కూతురిగా సోషల్ మీడియాలో చిన్న వయసులో.. మంచి పాపులారిటీ సంపాదించిన ఆర్హా తాజాగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది.
విషయంలోకి వెళితే డైరెక్టర్ గుణశేఖర్ సమంత నీ ప్రధాన పాత్రలో చూపిస్తున్న “శాకుంతలం” సినిమా లో ఆర్హా చేత యువరాణి భారత అనే పాత్ర చేయిస్తున్నట్లు సినిమా యూనిట్ స్పష్టత ఇచ్చింది. గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా..లో.. సమంత కీలక పాత్ర చేయటమే కాక.. చాలా కొత్తదనంతో కూడిన సబ్జెక్ట్ నీ.. నటన పరంగా సమంత డీల్ చేస్తున్నట్లు.. తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో స్టేట్ ఆఫ్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు..ఆర్హా నీ గ్రాండ్ లాంచ్ చేయాలని.. అందుకోసం చిన్నపిల్లల కథలను కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్త వచ్చింది.
Read More: Allu arjun: అల్లు అర్జున్ కూతురు తో సినిమా ప్లాన్ చేస్తున్న టాప్ ప్రొడ్యూసర్..??
అయితే అంతకంటే ముందే గుణశేఖర్ దర్శకత్వంలో ఆర్హా.. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడంతో… అల్లు అర్జున్ అభిమానులు ఖుషి అవుతున్నారు. తాజాగా అధికారికంగా వచ్చిన ప్రకటన .. సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో ట్రెండింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి సరికొత్త షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు సమంత రెడీ అయినట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!