Shakunthalam: అల్లు రామలింగయ్య ముది మనవరాలు, అల్లు అరవింద్ మనవరాలు, అల్లు అర్జున్ – స్నేహ కుమార్తె అల్లు అర్హ తెరంగేట్రం ఖరారైంది.. ఈ మేరకు ఆమె ఎంట్రీ ని ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.. గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న చిత్రం శాకుంతలం..!! ఈ చిత్రంతోనే అల్లు అర్హ తెరంగేట్రం చేయనుంది..!! ఇక దీనితో అల్లు కుటుంబంలోని నాల్గవ తరం కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లు అవుతుంది..!!
శాకుంతలం సినిమాలో సమంత అక్కినేని ప్రధానపాత్రలో నటిస్తోంది.. ఈ చిత్రంలో రాజకుమారుడు భరతుడిగా అల్లు అర్హ నటించనున్నట్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.. ఈ పోస్టర్ లో దర్శకుడు గుణశేఖర్ ఎత్తుకొని ఉన్నారు.. నేటి నుంచి అర్హ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించనుంది. పది రోజులపాటు జరగనున్న చిత్రీకరణ తరువాత అర్హ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.. అల్లు అర్హ మొదటి సినిమానే పాన్ ఇండియా లెవెల్ భారీ మూవీ కావడం ప్రత్యేకత.. ఈ విషయం పై స్పందించిన అల్లు అర్జున్ శాకుంతలం చిత్ర టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు.. అర్హత మొదటి సినిమాతోనే సమంత అక్కినేని గుణశేఖర్ తో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!